జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీపై కుట్ర చేశారని.. టీఆర్ఎస్తో కలిసి దెబ్బకొట్టే ప్రయత్నం చేశారని.. బీజేపీ నేతలు మండి పడుతున్నారు. ఖచ్చితంగా పోలింగ్ జరుగుతూండగా.. టీఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవికి మద్దతు తెలియచేయడం ఏమిటని.. వారు మండి పడుతున్నారు. పొత్తు ధర్మాన్ని పవన్ కల్యాణ్ విస్మరించారని హైకమాండ్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. గౌరవం లేని చోట ఉండలేమని పవన్ అనడంపైనా వారు విమర్శలు గుప్పిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపామని గుర్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగానే బీజేపీని పెద్ద కొట్టారని అంటున్నారు.
నిజానికి పోలింగ్ జరుగుతున్న సమయంలో ఇలాంటి బహిరంగంగా అభ్యర్థులకు మద్దతు తెలియచేయడం .. కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. ప్రచారం ముగిసిపోయి ఉంటుది. ఏమైనా మద్దతు తెలియచేయాలంటే.. లోపాయికారీ మద్దతులు ఉంటాయి కానీ.. ఇలా నేరుగా ఓ అభ్యర్థిగా మద్దతుగా ప్రకటనలు చేయరు. ఈ అంశంపై బీజేపీ ఫిర్యాదు చేయకపోయినా ఈసీ వెంటనే పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. సుమోటోగా తీసుకుని కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే పవన్ కల్యాణ్ .. ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తమ క్యాడర్ వాణీదేవికి మద్దకు పలకాలని అభిప్రాయం వ్యక్తం చేశారని.. వారి నిర్ణయాన్ని గౌరవిస్తానని.. ఆయన చెప్పుకొచ్చారు. అదే విషయాన్ని ఈసీకి సమాధానంగా ఇచ్చే అవకాశం ఉంది.
పవన్ కల్యాణ్ టీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం… బీజేపీకి ఎప్పుడూ లేనంత షాక్ ఇచ్చినట్లయింది. చివరి క్షణంలో టీఆర్ఎస్ పవన్ కల్యాణ్‌తో టచ్‌లోకి వెళ్లి.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రకటన చేయించడంలో సక్సెస్ అయినట్లుగా అనుమానిస్తున్నా రు. సిట్టింగ్ సీటు గెల్చుకోకపోతే.. ఇప్పటి వరకూ వచ్చిన హైప్ అంతా.. తలకిందులు అవుతుందని.. వారి ఆందోళన. ఇప్పుడు పవన్ కల్యాణ్ వల్ల అది బీజేపీకి కోలుకోలేని షాక్ తగిలినట్లే.