ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాల విషయంలో కొన్ని మార్గదర్శకాలు పెట్టాలని ఈసీ నిర్ణయించుకుంది. ఈ ప్రకారం ఉచిత పథకాలను ప్రకటించడమే కాదు వాటికి నిధులు ఎక్కడ్నుంచి తెస్తారో చెప్పేలా నిబంధనలు మార్చాలని డిసైడయింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది. వారు సమాధానం చెప్పాల్సి ఉంది. చెబుతారు కూడా. వాటికి ఈసీ సంతృప్తి చెందాల్సిందే. ఎందుకంటే తాము ప్రకటించే ఉచిత పథకాలను ఎలా అమలు చేస్తామో ఏపీ ప్రభుత్వం లాంటివి ఇప్పటికే ప్రాక్టికల్‌గా నిరూపిస్తున్నాయి. అదే కేస్ స్టడీ ఇంకేం కావాలని ఎదురు దాడి చేసినా ఆశ్చర్యం లేదు
శ్రీలంకలో పరిస్థితులు చూసిన తర్వాత చాలా మంది ఆర్థిక నిపుణులు కూడా దేశంలో పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు పడ్డాయి. సుప్రీం ఓ కమిటీని నియమించింది. ఈసీ ప్రస్తుతం ఉన్న అధికాాల ప్రకారం పార్టీలు ప్రకటించే ఉచిత పథకాల్ని అడ్డుకోలేమని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది . చట్టంలో సరైన మార్పులు చేయాల్సి ఉందని తెలిపింది.కేంద్రం ఇలాంటి చట్టాల్లో మార్పులు తెచ్చే అవకాశం కనిపి్తోంది.
సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చేసే సిఫార్సులు ఏవైనా… అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి… రాజకీయ పార్టీలు ఉచిత పథకాల ప్రకటన విషయంలో కొన్ని మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తోంది. అప్పులు చేసి ఇస్తామని.. ఆదాయం పెంచుకుటామని.. అసాధారణ ఆదాయం వస్తుందని.. మాటలు పార్టీలు చెబుతాయి. వాటిని ఈసీ నమ్మకతప్పదు. ఎందుకంటే అన్నీ అంచనాలే.