తెలంగాణలో రాజకీయం మొత్తం బుధవారం.. చంద్రబాబు, రాహుల్ గాంధీ పర్యటన విషయాల్లో కలకలం రేగింది. ఓ కీలక నేత ఫామ్‌హౌస్ లో తనిఖీలు జరిగాయని.. ఎంత మొత్తంలో పట్టుబడిందో క్లారిటీలేదు కానీ.. కోట్లలోనే ఉందన్న విషయం పుకారులా బయటకు వచ్చింది. ఫామ్‌హౌస్ అనగానే అందరికీ.. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌసే గుర్తుకు వస్తుంది. పైగా.. గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి కొద్ది రోజులుగా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో వందల కోట్లు ఉన్నాయని.. అక్కడ్నుంచే నేరుగా… డబ్బుల పంపిణీ జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అక్కడ సోదాలు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశారు కూడా. దీంతో ఆ ఫిర్యాదు మేరకు.. తనిఖీలు చేశారేమోన్న ఉత్సుకత మీడియాలో ప్రారంభమయింది.
అందుకే తనిఖీలు జరిగాయని.. పెద్ద మొత్తంలో నగదు పట్టుబడిందని… స్పష్టంగా తెలిసినప్పటికీ… ఎలాంటి బ్రేకింగులు వేయలేకపోయారు. చివరికి ఎన్నికల అధికారి… రజత్ కుమార్ సైనీ… ఫామ్ హౌస్‌లో తనిఖీలు జరిగాయని… ఆ ఫామ్ హౌస్ … కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి బంధువులదని చెప్పారు. రూ. పదిహేను కోట్లు నగదు దొరికిందని… మరో ఆరు కోట్లు పంపిణీ చేసినట్లుగా.. రాసుకున్న లెక్కలు కూడా దొరికాయని.. మీడియాకు తెలిసింది. కానీ రజత్ కుమార్ మాత్రం… అలాంటి సమాచారం.. మొత్తం సీల్డ్ కవర్ లో ఐటీ అధికారుల నుంచి వచ్చిందని.. దాన్ని గురువారం మీడియాకు ఇస్తామని చెప్పారు. కానీ.. ఈ సీల్డ్ కవర్ సంప్రదాయం ఎప్పటి నుంచో ఎవరికీ అర్థం కాలేదు. కర్ణాటకలో ఎన్నికల సమయంలో ఐటీదాడులు చేసినపప్పుడు … అధికారులు లైవ్ అప్ డేట్స్ ఇచ్చేవారు. అక్కడ ఒక్క బీజేపీ నేత ఇల్లు, ఫామ్ హౌస్ పై దాడి చేయలేదు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఫామ్ హౌస్ పై దాడి చేశారు. అధికార పార్టీ హోదా ఉంది. అందుకే.. సీక్రెట్ గా ఉంచారు. ఇప్పుడు ఈసీ పట్టుబడింది తక్కువ మొత్తమే అని చెబితే.. అందరూ అనుమానంగా చూస్తారు.
ఒక్క కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి ఫామ్ హౌస్ మాత్రమే కాదు.. పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఇంట్లోనూ… ఐటీ అధికారులు సోదాలు చేశారని.. కనీసం రూ. ఆరు కోట్లు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. ఇలాంటి ఆరోపణలు.. వచ్చినప్పుడు.. ప్రతి ఒక్కరిపై సోదాలు చేస్తూనే ఉన్నారు. అలాంటిది.. మరి… ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన ఫామ్ హౌస్ లో వందల కోట్లు ఉన్నాయని… ప్రత్యర్థి ఆరోపిస్తున్నప్పుడు.. ఎందుకు సోదాలు చేయరు..? మీడియా సమక్షంలోసోదాలు చేస్తే.. పిక్చర్ క్లారిటీ వస్తుంది కదా..? ఎందుకు స్పందించరు..?