ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తీరుపై.. తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ… నేరుగా.. ఢిల్లీలోనే పోరాటం చేస్తోంది. టీడీపీ లేవనెత్తిన అభ్యంతరాలపై.. చర్చించడానికి ఈసీ సిద్ధమయింది. కానీ.. టీడీపీకి చెందిన హరిప్రసాద్ అనే సాంకేతిక నిపుణుడితో మాత్రం చర్చించడానికి ససేమిరా అంటోంది. మిగతా ఎవరినైనా పంపించవచ్చంటూ… టీడీపీ న్యాయవిభాగానికి ఓ లేఖ కూడా రాసింది. హరి ప్రసాద్ ఎందుకు వద్దంటే… ఆయనపై ఓ క్రిమినల్ కేసు ఉందట. అందుకే చర్చించడానికి సిద్ధంగా లేరట. ఈ లేఖ ను చూసి.. టీడీపీ నేతలకు మరింతగా మండిపోయింది. ఎందుకంటే.. ఏపీ విషయంలో.. ఈసీ… ఎవరి మాటలు విన్నది… విజయసాయిరెడ్డి అనే వైసీపీ … నెంబర్ టూ ఇచ్చిన ఫిర్యాదులకు మాత్రమే స్పందించింది.
ఆయనేమైనా పులుకడిగిన ముత్యమా..?. జగన్ అక్రమాస్తుల వెనుక మాస్టర్ మైండ్ ఆయనే. సీబీఐ కేసులలో పధ్నాలుగు నెలలు జైలులో ఉండిరావడం మాత్రమే కాదు.. కండిషనల్ బెయిల్ మీద రాజకీయం చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి.. ఈసీ కార్యాలయంలో… ట్వంటీఫోర్ బై సెవన్ యాక్సెస్ ఇస్తూ.. ఆయన ఇచ్చిన ఫిర్యాదుల ప్రకారం.. అధికారులను బదిలీ చేస్తూ… చివరికి.. ఏపీలోని సీఈవోను కూడా డమ్మీని చేసి.. ఢిల్లీ నుంచి ఎన్నికల వ్యవహారాల్ని నడిపించిన విజయసాయిరెడ్డి… తానే ఎన్నికల అధికారినన్నట్లుగా చెలరేగిపోయినా.. కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. కానీ.. ఓటర్లను నానా తిప్పలు పెట్టి… కొన్ని వందల చోట్ల.. పోలింగ్ కు ఉద్దేశపూర్వకంగా… సాంకేతిక కారణాల పేరుతో.. అడ్డంకులు కల్పించి.. ఓటింగ్ పర్సంటేజీని తగ్గించే ప్రయత్నాలు జరిగితే… దానికి వివరణ ఇవ్వడానికి…. ఓ క్రిమినల్ కేసు ఉందని చెప్పి…. ఓ వ్యక్తిని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది ఎన్నికల సంఘం.
ఏపీ రాజకీయాలపై… ఈవీఎంలపై.. హరిప్రసాద్ అనే నిపుణుడు వ్యక్తం చేసిన అనుమానాల్ని నివృతి చెయడానికి.. ఆయనపై సంబంధం లేని క్రిమినల్ కేసు ఉండటానికి… ఏంటి రిలేషన్. అతనికి సమాధానం చెప్పలేక.. ఈసీ ఇలా వ్యవహరిస్తోంది. హరిప్రసాద్ ది క్రమినల్ కేసు అయితే .. విజయసాయిరెడ్డిది… అంత కంటే దారుణమైన క్రిమినల్ కేసులు. మరి ఈసీ ఈ విషయంలో ఇలా ఎందుకు వ్యవహరిస్తోందో మరి..!