తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెసు అభ్యర్థి రేవంత్ రెడ్డి.. తనను ఓడించడానికి రూ. 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. అందులో నిజం ఎంత ఉందో కానీ… కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఇంట్లో… ఎన్నికల కమిషన్ అధికారులు జరిపిన సోదాల్లో ఏకంగా రూ. 15 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని ప్రచారం జరుగుతోంది. తెల్లవారు జామున కొడంగల్ లో ఉన్న నరేందర్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అధికారులు… పెద్ద మొత్తంలో సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సంఘం అధికారులు ఈ విషయాన్ని కాస్త.. సీక్రెట్ గా ఉంచారు. సాయంత్రానికి మొత్తం బయటకు వచ్చింది. ఐతే… ఎంత మొత్తం స్వాధీనం చేసుకున్న విషయం ఎన్నికల అధికారి రజత్ కుమార్ బయట పెట్టలేదు. గురువారం.. అన్ని విషయాలు… చెబుతామంటున్నారు.
ఎన్నికల్లో కొడంగల్ నుంచి మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్‌రెడ్డిని బరిలోకి దించడమే కాదు.. ఆయన గెలుపు బాధ్యతను హరీశ్, జితేందర్‌కు కేసీఆర్ అప్పగించారు. రేవంత్ రెడ్డి ని ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ కి రానివ్వకుండా చూడాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. రేవంత్ కాంగ్రెసు పార్టీలో చేరినప్పుడు… రాజీనామా చేస్తారని.. ఉప ఎన్నికలు వస్తాయన్నా.. ఉద్దేశంతో.. అప్పుడే పట్నం నరేంద్ర రెడ్డి ని అభ్యర్థి గా ఎంపిక చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేవంత్ అనుచరులు.. అనేక మంది ని టీఆర్ఎస్ లో చేర్చుకొన్నారు. ఐనా రేవంత్… తన బలాన్ని ఎప్పటికీ అప్పుడు ప్రదర్శిస్తూ వస్తున్నారు.
ప్రతి విషయాన్ని వెంటనే… మీడియా కు చెప్పే ఎన్నికల సంఘం… కొడంగల్ లో ఎంత మొత్తం దొరికింది అన్న దాన్ని రహాస్యంగా ఉంచింది. దీనితో అనేక విమర్శలు వస్తున్నాయి. భారీగా నగదు దొరికితే.. ఎన్నిక వాయిదా పడే అవకాశం కూడా ఉంది. గతం లో.. తమిళ్ నాడు లో ఆర్కె నగర్ ఉప ఎన్నిక ను అలాగే వాయిదా వేశారు.