“హిందూ గాళ్లా.. బొందూగాళ్లా..” అంటూ కరీంనగర్ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చేసిన వ్యాక్యలపై.. ఈసీ నోటీసు జారీ చేసింది. పన్నెండో తేదీ సాయంత్రంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇలా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై.. వీహెచ్‌పీ.. తెలంగాణ అధ్యక్షుడు రామరాజు.. ఢిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయనకు తీరిగ్గా ఈసీ.. పోలింగ్‌కు ముందు ఒక్క రోజు.. నోటీసులు జారీ చేిసంది. నిజానికి కేసీఆర్ ఈ మాటలను అన్న తర్వాత.. దాన్ని బీజేపీ విపరీతంగా మార్కెట్ చేసుకుంది. సోషల్ మీడియాలో హైలెట్ చేసుకుంది. కావాల్సినంత హిందూ సెంటిమెంట్ రగిలించుకునేందుకు తాపత్రయపడింది. కేసీఆర్ కూడా అదే కోరుకున్నట్లు ఉన్నారు. ఆ తర్వాత జరిగిన బహిరంగసభలో.. బీజేపీ వాళ్లు తనను సోషల్ మీడియాలో తిడుతున్నారని.. చెప్పుకున్నారు.
ఆ తర్వాత… ఆ వివాదం అలా సోషల్ మీడియాలో ఉండగానే.. ఈసీ దాన్ని మరోసారి గుర్తు చేస్తూ నోటీసులు జారీ చేసింది. నిజానికి ఈ హిందూ జాతీయ వాదాన్ని ఉత్తరాదిలో బీజేపీ విస్తృతంగా వాడుకుంటోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోజూ.. ఏదో కోణంలో ఇలా వివాదాస్పద ప్రకటనలు చేస్తూనే ఉంటారు. దీనికి ప్రధానమంత్రి కూడా మినహాయింపు కాదు. మైనార్టీల పేరుతో.. అనేక రకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఈసీ మాత్రం.. లైట్ తీసుకుంటోంది. విద్వేష వ్యాఖ్యలు చేసి.. రాజకీయాన్ని మరింతగా… దిగజార్చుతున్నా.. ఈసీ.. వేగంగా స్పందించడం లేదు.
నోటీసులు జారీ చేసినా.. అది కూడా.. ఓ ప్రత్యేక ఎజెండాతో సమయం చూసుకుని జారీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో “హిందూ” … ఎన్నికల ఎజెండాను తెచ్చే ప్రయత్నంలోనే ఇలాంటి ప్రకటనలు వస్తున్న విషయంలో ఎవరికీ డౌట్ లేదు. కానీ.. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన ఈసీ తీరుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.