ప్రధానమంత్రి నరేంద్రమోడీ హెలికాఫ్టర్ లో సోదాలు చేశారంటూ.. మోహిసన్ అనే ఐఏఎస్ అధికారిని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేయడం దుమారం రేపుతోంది. ప్రధాని కాన్వాయ్‌ను కానీ.. ఆయన వెహికల్స్‌ను కానీ చెక్ చేయవద్దని ఏ నిబంధనల్లో ఉందని.. విపక్ష పార్టీలు.. ఈసీపై విరుచుకుపడుతున్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో … ఎస్పీజీ భద్రత ఉన్న నేతల వెహికల్స్‌లో సోదాలు చేయవద్దని ఉందని.. అందుకే.. అధికారిని సస్పెండ్ చేశామని ఈసీ చెబుతోంది. కానీ… ఈసీ చెబుతున్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో ఎక్కడా… ఎస్పీజీ భద్రత ఉన్న నేతల వాహనాలు చెక్ చేయకూడదని లేదని.. పత్రాలతో సహా.. పార్టీలు, నెటిజన్లు బయటపెట్టారు. ఎస్పీజీ భద్రత ఉన్న వారికి ఎన్నికల సమయంలో.. వాహనాలు వాడుకోవచ్చన్న నిబంధన ఉంది
కానీ.. వాటిని చెక్ చేయకూడదని ఎక్కడా లేదు. అయినప్పటికీ.. ఎన్నికల సంఘం అత్యుత్సాహం ప్రదర్శించింది. ఇప్పటికే ఎన్నికల సంఘం… బీజేపీకి, మోడీకి అనుకూలంగా… వ్యవహరిస్తోందని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అయినప్పటికీ.. ఎన్నికల సంఘం.. విపక్ష నేతలను మాత్రమే టార్గెట్ చేసుకుంటోంది. దాదాపుగా ముఖ్యమంత్రులందరి హెలికాఫ్టర్లు చెక్ చేస్తోంది. ఆ సమానత్వాన్ని మోడీకి వర్తింప చేయడానికి మాత్రం నిరాకరిస్తోంది. కర్ణాటకలో మోడీ హెలికాఫ్టర్ నుంచి ఓ అనుమానాస్పద పెట్టెను బయటకు తీసుకెళ్లినట్లు వీడియోలు బయటకు వచ్చినా ఈసీ స్పందించలేదు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరుతో.. తనకు ఉన్న అధికారాలన్నింటినీ ఈసీ… ప్రతిపక్షాలపైనే ప్రదర్శిస్తోంది. ఇష్టారీతిన అధికారుల బదిలీలు చేసి… ఐటీ దాడులతో.. బీజేపీయేతర పార్టీలపై దాడులకు ప్రొత్సహిస్తోంది. ఇంత వరకూ.. ఒక్క బీజేపీ నేత ఇంటిపైనా.. ఐటీ దాడులు జరగలేదు. కానీ.. బీజేపీ.. ఆ పార్టీని వ్యతిరేకించే వారు ముఖ్యమంత్రులైనా సరే వదిలి పెట్టలేదు. ఈసీ ఈ విషయంలో.. తమకు లేని అధికారాలను కూడా.. తీసుకుని… బీజేపీకి సహకరిస్తోందన్న ఆరోపణలకు.. బలం చేకూర్చేలా… మోడీ హెలికాఫ్టర్‌ను చెక్ చేసిన వారిని సస్పెండ్ చేసింది. ఇది బీజేపీపై ఎవరైనా అధికారులు సోదాలు చేయాలన్నా… కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నా.. భయపడేలా ఈసీ చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.