ఖమ్మం జిల్లాలోని పాలేరు ఉపఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎన్నికల సంఘం తెరాస ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది. టి-కాంగ్రెస్ నేతల పిర్యాదుపై స్పందిస్తూ, జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, ఎస్పి షానవాజ్ ఖాసిం, రిటర్నింగ్ అధికారి గణేష్ లను తక్షణమే బదిలీ చేసి వారి స్థానంలో నిష్పాక్షపతంగా పనిచేసే అధికారులని నియమించాలని ఆదేశించింది. వారు ముగ్గురు అధికార పార్టీకి ఏజంట్లు మాదిరిగా వ్యవహరిస్తున్నారని, వారి పర్యవేక్షణలో ఎన్నికలు స్వేచ్చగా, నిష్పక్షపాతంగా జరుగుతాయనే నమ్మకం తమకు లేదని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయడంతో, వారు ముగ్గురిని తక్షణమే బదిలీ చేసి వారి స్థానంలో వేరొకరి పేర్లను తమకు సూచించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.