ఏపీలో వీఐపీల పర్యటనల్లో ఏర్పడుతున్న శాంతిభద్రతల ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం ఆరా తీసింది. రాష్ట్ర సీఈవో నుంచి నివేదికలు తెప్పించుకుంది. ఘటనలపై సీఈవో పోలీసుల వద్ద నుంచి నివేదిక తీసుకున్నారు. వాటిని క్రోడీకరించి ఈసీకీ పంపించారు. ఏపీలో పోలీసుల భద్రతా వైఫల్యం ఉందని సరైన నాయకత్వం లేదని అధికార పార్టీ కోసం పని చేస్తున్నట్లుగా ఉందన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.
కఠినంగా వ్యవహరించకపోవడం తరచూ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇదంతా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పర్చి పోలింగ్ ప్రక్రియను ప్రభావితం చేయడానికన్న అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో కొంత మంది పోలీసు అధికారులు సమూహంగా ఏర్పడి అధికార పార్టీ కోసం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలించి ఈసీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఏపీ డీజీపీ శాశ్వత డీజీపీ కాదు. ఆయన ఇంచార్జ్ డీజీపీ. పది మంది సీనియర్లు ఉన్నప్పటికీ ఆయనను జగన్ డీజీపీని చేశారు. ఆయన సమర్థంగా విధులు నిర్వహించలేకపోతున్నారని స్పష్టమయింది. ఇక సీఎస్ కూడా పూర్తి స్థాయిలో అధికార పార్టీకి అనుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చట్టబద్ధమైన అనుమతులు లేకుండా అప్పులకు ప్రయత్నించడం.. ఆస్తులు రాసివ్వడం వంటివ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేసేప్రయత్నం కూడా చేయడం వివాదాస్పదమయింది. ఒకటి రెండు రోజుల్లో ఏపీలో పరిస్థితుల్ని చక్కదిద్దాలని ఈసీ భావిస్తోంది.