బ్యాంకుల నుంచి ప్రజల సొమ్ము వేల కోట్ల రుణాలు తీసుకుని.. దారి మళ్లించడమో.. జల్సాలు చేయడమో చేసి.. చివరికి చేతులెత్తేసి..రెండు, మూడు నెలలు జైల్లో కూర్చుని బయటకు వస్తే సరిపోతుందనుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ జాబితాలో డెక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డి కూడా చేరారు. ఆయన బ్యాంకులకు ఎగ్గొట్టిన ఖాతా రూ. ఎనిమిది వేల కోట్లపైనే . బాధిత బ్యాంకుల్లో కెనరా బ్యాంక్ ఫస్ట్ ఉంది. ఇతర బ్యాంకులూ ఉన్నాయి. 2015లోనే రుణాలు చెల్లించకుండా చేతులెత్తేస్తే సీబీఐ అరెస్ట్ చేసి జైలుకు పంపింది. బెయిల్ పై విడుదలయ్యారు.
మళ్లీ ఇన్నాళ్లకు ఈడీ రంగంలోకి దిగింది. అసలు తీసుకున్న డబ్బులన్నీ ఎటు తరలించారని ప్రశ్నించింది. సమాధానం చెప్పకపోయే సరికి అరెస్ట్ చేసింది. ఆయన సోదరుడు వినాయక రవిరెడ్డి అరెస్ట్ చేస్తారని గ్రహించి విచారణకు కూడా రాలేదు. డెక్కన్ క్రానికల్ సహా అన్ని ప్రస్తుతం ఎన్సీఎల్టీలో ఉన్నాయి. ఆర్థిక వ్యవహాలు వెంకట్రామిరెడ్డి చేతుల్లో లేవు. కానీ ఆయన ఎడిటోరియల్ స్టాఫ్ ను నియంత్రిస్తారని చెబుతారు. డెక్కన్ క్రానికల్ లో జగన్ కు ఎలా అవసరమో అలా వార్తలు రాస్తారని చెబుతారు.
వెంకట్రామిరెడ్డి విలాస పురుషుడు. ఆయన తండ్రి .. డెక్కన్ క్రానికల్ ను విలువలను పాటించి పెంచి ఇస్తే కుమారుడు రామిరెడ్డి మొత్తం నాశనం చేశారు. హైదరాబాద్ ఐపీఎల్ టీంను కొనుగోలు చేసి నిండా మునిగారు. ఆ ఫ్రాంచైజీని ముంచారు. ఆయనకు తన జుట్టుపై ఎక్కువ మమకారం అని.. ఆ జుట్టు కోసమే లక్షలు ఖర్చు చేస్తారని చెబుతారు. ఇప్పుడు మొత్తం పోయాయి.. మళ్లీ మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తోంది.