ఢిల్లీ లిక్కర్ స్కాంలో అంతా సైలెంట్ అయిపోయింది. కానీ హఠాత్తుగా ఈడీ రంగంలోకి దిగి.. దినేష్ అరోరా అప్రూవర్ ను అరెస్ట్ చేసింది. అంతే కాదు ఆయన నిజాలు చెప్పడం లేదని.. కస్టడీ పిటిషన్ వేసింది. దినేష్ అరోరా .. సౌత్ లాబీ నుంచి ముడుపులు తీసుకుని.. మనీష్ సిసోడియాకు ఇచ్చారనేది అభియోగం. దీన్ని ఆయన అంగీకరించి.. అప్రూవర్ గా మరి చాలా కాలం కిందటే బ యటకు వచ్చారు. సిసోడియా లోపలకు వెళ్లారు.ఇప్పుడు మళ్లీ ఈడీ ఆయన నిజాలు చెప్పడం లేదని అరెస్ట్ చేసింది.
ఇటీవల శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఆయనేం చెప్పారో తెలియదు కానీ.. మొత్తం సీన్ మారిపోయిందన్న ప్రచారం జరిగింది. కానీ ఇన్ని రోజులు సైలంట్ గా ఉన్న ఈడీ మళ్లీ ఇప్పుడు రంగంలోకి దిగింది. దినేష్ అరోరా చెప్పాల్సిన నిజాలేమిటో తెలుసుకుని.. చర్యలు ప్రారంభిస్తందో లేకపోతే.. అసలు కేసులో అరెస్టయి జైల్లోఉన్న వారంతా ఇంకా ఎంత కాలం అని అని చెప్పి బెయిల్ అడుగుతారన్న ఉద్దేశంతో ఏమో కానీ.. మరొకరి అరెస్టుని చూపించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక్క కవిత తప్ప అందరూ అరెస్టయ్యారు. కవితను అరెస్ట్ చేయడమే తరువాయన్నట్లుగా హడావుడి చేశారు కానీ ఆగిపోయారు. ఆమెకు చెందిన పది ఫోన్లను తీసుకుని సైలెంట్ అయిపోయారు. దీంతో రెండు పార్టీల మధ్య ప్యాచప్ అయిపోయిందన్న ప్రచారం జరిగింది. ఇది తెలంగాణలో బీజేపీని డ్యామేజ్ చేసింది. ఇప్పుడు దినేష్ అరోరా అరెస్ట్ నుంచి కొత్తగా ఏమైనా ప్రారంభిస్తారా లేదా అన్నది.. ముందు ముందు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.