మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి చగన్ భుజభల్ ని ఈడి అధికారులు మనీ లాండరింగ్ కేసులో నిన్న అరెస్ట్ చేసారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్.సి.పి. పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం డిల్లీలో సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో మహారాష్ట్ర సధన్ నిర్మించింది. దాని నిర్మాణంలో చగన్ భుజబల్ తదితరులు అక్రమాలకు పాల్పడి, బారీగా డబ్బు కాజేసినందుకు, మహారాష్ట్రలోని కలీనా అనే ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొన్నందుకు ముంబాయి పోలీసులు కేసులు నమోదు చేసారు. వాటి ద్వారా ఆయన సంపాదించిన సొమ్మును అక్రమంగా విదేశాలకు తరలించినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఆ కేసుల ఆధారంగానే ఈడి అధికారులు చగన్ భుజబల్, ఆయన కుమారుడు పంకజ్, మేనల్లుడు సమీర్, మరి కొందరిపై కూడా కేసులు నమోదు చేసారు. వారిలో సమీర్ ని క్రిందటి నెలలోనే పోలీసులు అరెస్ట్ చేసి ముంబైలోని ఆర్ధర్ రోడ్ జైలుకి పంపించారు. వారికి చెందిన రూ. 280 కోట్లకు పైగా విలువున్న ఆస్తులను జప్తు చేసేందుకు ఈడి నోటీసులు జారీ చేసింది. వారందరిపై మహారాష్ట్ర ప్రభుత్వ అవినీతి నీతి నిరోధాఖ శాఖ కూడా వేరేగా చార్జ్ షీట్లు దాఖలు చేసింది. నిన్న సుమారు 9గంటల పాటు చగన్ భుజభల్ ఆయనను ఈడి అధికారులు ప్రశ్నించారు కానీ ఆయన వారికి సహకరించకపోవడంతో ఇవ్వాళ్ళ ఆయనని కోర్టులో హాజరుపరిచి జ్యూడిషియల్ రిమాండ్ కోరబోతున్నారు.