తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందా..? గొర్రెల స్కామ్ లో రంగంలోకి దిగిన ఈడీ ఈ కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు రంగంలోకి దిగారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గొర్రెల స్కామ్ లో అనూహ్యంగా రంగంలోకి దిగిన ఈడీ.. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ పాత్రను నిగ్గు తేల్చాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గొర్రెల పంపిణీ పథకం 700కోట్ల స్కామ్ అని ఆరోపణలు వస్తుండటంతో దీని వెనక నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని ఈడీ అంచనాకు వచ్చింది. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ జరిగే అవకాశం లేదని అందుకే ఈ కేసు విషయంలో కేసీఆర్ ను ప్రశ్నించేందుకు ఈడీ సిద్దమైనట్లుగా రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ తోపాటు హారీష్ రావుకు ముందుంది మొసళ్ళ పండగ అంటూ రఘునందన్ రావు హెచ్చరించారు. కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందని… కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులు కేసీఆర్ కోసం వచ్చారని బిగ్ బాంబ్ పేల్చారు. కేసీఆర్ తోపాటు హరీష్ రావుకు కూడా ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించడంతో ఈ కేసులో తదుపరి ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది.