మంత్రి తలసానికి మాత్రమే నోటీసులు ఇవ్వలేదు కానీ.. ఆయన చుట్టూ ఆర్థిక వ్యవ్యవహారాల చూసుకుంటున్న అందరికీ ఈడీ నోటీసులు వెళ్తున్నాయి. తాజాగా ఆయన పీఏ హరీష్‌ను ఈడీ పీలిచించి ప్రశ్నించింది. అంతకు ముందు ఆయన సోదరులు ఇద్దర్ని ప్రశ్నించింది. తలసానితో వ్యాపార సంబంధాలున్న ఇతరులను కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆయన కుమారుడికీ నోటీసులు జారీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాను ఇప్పుడు ఎదుగుతున్న రాజకీయ నేతనని..తనకు నోటీసులు రాలేదని.. ఆయన కుమారుడు ట్వీట్ చేశారు.
చీకోటి ప్రవీణ్ తో తలసాని బృందానికి దగ్గర సంబంధాలున్నాయని ఈడీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన చుట్టూనే ఉచ్చు బిగుస్తున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు కూడా అనుమానిస్తున్నాయి. అయితే నేరుగా తలసానికి సంబంధం ఉండదని అంటున్నారు. రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న తలసాని.. ఆర్థిక వ్యవహారాలు ఎప్పుడూ తన పేరుపై ఉండేలా చూసుకోరు. అన్నీ బంధువుల పేరు మీద సాగుతూనే ఉంటాయి. అందుకే తలసానికి ఈడీ నోటీసులు అందకపోవచ్చు కానీ.. ఆయన సన్నిహితులు మాత్రం ఈడీ గుప్పిట్లో ఉన్నట్లేనని చెబుతున్నారు.
చీకోటి ప్రవీణ్ విచారణలో ఏం చెప్పారో కానీ.. మొత్తం కస్టమర్ల ఖాతాలను బయటకు తీసి.. వారి ఆర్థిక లావాదేవీలు మొత్తం బయటకు తీస్తున్నారు. దీంతో ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ కేసుతో సంబంధం లేకపోయినా తమ అసలు వ్యాపార లోగుట్లు ఏమైనా బయటకు వస్తాయేమోనని వారి ఆందోళన. మరో వైపు టీఆర్ఎస్ నేతలు కూడా.. ఈ కేసినో కేసు పేరుతో తమ పార్టీ నేతల్నే టార్గెట్ చేశారని అనుమానిస్తున్నారు.