వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన ఆస్తుల్ని జప్తు చేసినట్లుగా ఈడీ ప్రకటించింది. హయగ్రీవ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ మోసం వ్యవహారంలో ఈడీ కొద్ది రోజుల కిందట.. ఎంవీవీ ఇంటితో పాటు ఆ వ్యవహారంతో సంబంధం ఉన్న పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసింది. తాజాగా ఆ ఆస్తుల్ని జప్తు చేసినట్లుగా ప్రకటించింది.
చిలుకూరు జగదీశ్వరుడు అనే వ్యక్తికి వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కొంత భూమి కేటాయించారు. అందులో వృద్ధుల సంక్షేమం కోసం ఏమైనా కార్యక్రమాలు చేపట్టాలని కేటాయించారు. అయితే ఆ జగదీశ్వరుడు ఏమీ చేపట్టలేదు. వైసీపీ వచ్చిన దాన్ని దాన్ని ఎంవీవీ స్వాధీనం చేసుకుని విల్లాల నిర్మాణం చేపట్టారు. తనను బెదిరించి తెల్ల కాగితాలపై సంతకం చేయించుకున్నారని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే జగదీశ్వరుడు ఫిర్యాదు చేశారు. కానీ బెదిరింపుల కారణంగా ఆయన సైలెంట్ అయిపోయారు. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఈడీకి కూడా నివేదికలు వెళ్లాయి.
పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరిగినట్లుగా తేలడంతో ఎంవీవీ కంపెనీలతో పాటు జగదీశ్వరుడు..వారి కుటుంబసభ్యులపై ఉన్న ఆస్తులను అటాచ్ చేశారు.నిజానికి ఈ డీల్ చాలా పెద్ద స్థాయిలో జరిగిందని చెబుతారు. వైజాగ్ లో వైసీపీ హయాంలో జరిగిన సవాలక్ష దందాల్లో ఇది ఒకటి. ఇప్పుడు ఈ ఆస్తులన్నీ ఈడీ అటాచ్ మెంట్ కు వెళ్లాయి. భూ మాఫియాలో తేడాలు రావడంతో ఓ రౌడీషీటర్ ఎంవీవీ ఫ్యామిలీని కూడా కిడ్నాప్ చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి నిజాలుఇంకా బయటకు రావాల్సి ఉంది.