ఢిల్లీ లిక్కర్ స్కాం రాజకీయంగా పెను సంచలనం అవుతోంది. ఒక్కో ఆధారంతో ఈడీ, సీబీఐ విడివిడిగా చార్జిషీట్లు దాఖలు చేస్తున్నాయి. అయితే వచ్చే నెల అంటే జనవరి ఆరో తేదీన ఈడీ కామన్ చార్జిషీటును దాఖలు చేయాలని నిర్ణయించుకుంది. అంటే ఇప్పటి వరకూ నిందితుల వారీగా కోర్టుల్లో దాఖలు చేసిన చార్జిషీట్లకు భిన్నంగా.. మొత్తం కేసులో కుట్ర కోణాన్ని చేధిస్తూ.. చార్జిషీటు దాఖలు చేయనుంది. ఇందులో అసుల నిందితులు ఎవరు.. కుట్రలు ఎలా చేశారు.. ఎలా అవినీతికి పాల్పడ్డారు.. మొత్తం అంశాలను పొందు పర్చనున్నారు.
కామన్ చార్జిషీటులో ఉండే పేర్లు… నిందితులే ఫైనల్. ఇప్పటి వరకూ మనీష్ సిసోడియాను నిందితునిగా చేర్చలేదు. ఎఫ్ఐఆర్ లో మాత్రం ఆయన ఏ వన్ గా ఉన్నారు. అలాగే కవిత పేరును ప్రస్తావించారు .. అవినీతికి పాల్పడ్డారని.. ఢిల్లీలో మద్యం వ్యాపారం ఆమె గుప్పిట్లో ఉందని తేల్చారు కానీ.. నిందితురాలిగా తేల్చలేదు. ఇప్పటి వరకూ వెలుగు చూసిన వివరాల ప్రకారం చూస్తే.. కవిత కీలక నిందితుల్లో ఒకరిగా ఉంటారు. అదే జరిగితే రాజకీయంగా పెను సంచలనం అవుతుంది. ఆ తర్వాత సీబీఐ, ఈడీ మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఆధారాల్లేకుండా ఆషామాషీగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ కేసులో చార్జిషీట్లు దాఖలు చేయవు. అలా చేస్తే.. ప్రజల ముందు పరువు పోతుంది.రాజకీయ వేధింపులకు అస్త్రంగా మారారన్న నమ్ముతారు. వాటిపై విశ్వసనీయత తగ్గిపోతుంది. మొత్తం ఆధారాలను చూపించే..కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తారని భావిస్తున్నారు. అందుకే.. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో వచ్చే ఏడాది అత్యంత కీలకం కానుంది.