తమిళనాడులో లిక్కర్ స్కాం జరిగినట్లు వెయ్యి కోట్ల రూపాయలు గుర్తు తెలియని వ్యక్తులు చేరినట్లుగా ఈడీ గుర్తించింది. ఈ మేరకు తమిళనాడులో మద్యం సరఫరాదారులు, దుకాణాదారులు, ఇతరుల ఇళ్లు,కార్యాలయాల్లో సోదాలు చేసి అధికారిక ప్రకటన చేసింది. మద్యం తయారీ కంపెనీ రవాణా విషయంలో అత్యధిక ఇన్వాయిస్లు తయారు చేసి.. అందులో అధికంగా వేసిన మొత్తాలను రాజకీయ నేతలకు లంచాలుగా ఇచ్చారని ఈడీ భావిస్తోంది. ఆ డబ్బులు ఏ రాజకీయ పార్టీకి చేరాయన్నది తేలుస్తామని అంటున్నారు.
సహజంగా ఈ స్కాం డీఎంకేను చుట్టుకుబోతోందని సులువుగా అర్థం చేసుకోవచ్చు. తమిళ సెంటిమెంట్ రాజకీయాలతో బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నామని అనుకుంటున్న డీఎంకేకు.. ఇలా ఈడీ దాడి కాస్త షాక్ ఇచ్చేదే. ఆ పార్టీ నేతలకు సంబంధం ఉన్న మద్యం వ్యాపారలైనే ఈడీ గురి పెట్టిందని భావిస్తున్నారు. ప్రతి బాటిల్ కు కొంత చొప్పున లెక్కలేసి మరీ వసూలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. సహజంగానే ఈడీ రిపోర్ట్ తర్వాత డీఎంకేపై బీజేపీ విరుచుకుపడుతోంది.
లిక్కర్ స్కాంలో గతంలో ఎన్నికలకు ముందు చత్తీస్ ఘడ్ లో కూడా బయటపడింది. ఏపీలో ఎప్పుడో బయటపడింది కానీ.. ఇప్పటి వరకూ ఈడీ ఎంట్రీ ఇవ్వలేదు. ఈడీ విచారణ కోసం ప్రభుత్వ పెద్దలు లాబీయింగ్ చేస్తున్నా వర్కవుట్ కావడం లేదు. అయితే ఇతర రాష్ట్రాల్లో మాత్రం వెదికి మరీ ఈడీ లిక్కర్ స్కాముల్ని బయట పెడుతోంది. అంతా కళ్ల ముందు ఏపీలో మాత్రం ఇంకా ఈడీ ఎంట్రీ ఇవ్వలేదు.