కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏదీ కలసి రావడం లేదు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ పేరును ఈడీ తొలి సారిగా ప్రస్తావించింది. లిక్కర్ స్కాం గురించి కవిత ముందే కేసీఆర్కు చెప్పిందని.. గోపికుమరన్ అనే నిందితుడు తన వాంగ్మూలంలో చెప్పాడని కోర్టులో వాదించింది. బెయిల్ కావాలని కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ బెయిల్ పిటిషన్లను వ్యతిరేకిస్తూ ఈడీ వాదించింది.ఈ వాదనల్లో కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చి అందర్నీ షాక్కు గురి చేసింది.
కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు తన లిక్కస్కాం సహ నిందితుల్ని కేసీఆర్కు కవిత పరిచయం చేశారని.. సమీర్ మహేందు నుంచికేసీఆర్ అన్ని వివరాలు తెలుసుకున్నారని ఈడీ తెలిపింది. నగదు లావాదేవీలు.. ఆదాయం గురించి కూడా కేసీఆర్ వివరాలు తెలుసుకున్నారని తెలిపింది. మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేిసంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఎప్పుడూ కేసీఆర్ అనే పేరు ప్రస్తావన రాలేదు. ఈ వ్యవహారం అంతా కేసీఆర్కు తెలియదనే అనుకున్నారు. గోపికుమరన్ అనే నిందితుడు… ఎప్పుడో తన వాంగ్మూలంలో స్పష్టంగా రికార్డు చేసి ఉంటే ఇప్పటి వరకూ ఏ దశలోనూ ఆ విషయాన్ని కోర్టులకు చెప్పడం లేదా.. మరో విధంగా బయటకు తెలిసేలా చేయకపోవడం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఈడీ ఆషామాషీగా కేసీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చి ఉండదని.. ఖచ్చితంగా ఆయనను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని అందుకే కోర్టు ముందు పెట్టారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఒక్క రోజు ముందు బీజేపీ అగ్రనేతల్లో ఒకరు అయిన బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసి బీజేపీని బ్లాక్ మెయిల్ చేసి కవితను కేసు నుంచి తప్పించాలని కేసీఆర్ ప్లాన్ చేశారని ట్యాపింగ్ కేసు నిందితులు చెప్పిన విషయం బయటకు వచ్చిన తర్వాతి రోజే.. లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్ పేరు బయటకు తేవడం వెనుక ఏమీ లేకుండా ఉంటుందని ఎవరైనా ఊహించగలరా?