కర్ణాటక ముఖ్యమంత్రిని రౌండప్ చేసేశారు. ఆయన పై దర్యాప్తు చేసేందుకు లోకాయుక్తకు గవర్నర్ ఇచ్చిన అనుమతి తర్వాత రాజకీయం మారిపోయింది. హైకోర్టు కూడా విచారణ చేయాల్సిందేనని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే కేసు కూడా నమోదయింది. ఆ వెంటనే సిద్దరామయ్య సీబీఐకి కర్నాటకలో ఎంట్రీని రిస్ట్రిక్ట్ చేశారు. కానీ ఈడీ ఉందని మర్చిపోయారు. గుర్తు ఉన్నా చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే ఈడీని ఏమీ చేయలేరు. ఇప్పుడు ఈడీ కూడా కేసు నమోదు చేసింది.
కాంగ్రెస్ ముఖ్యమంత్రులకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించడం కూడా వృధానేనని.. దేశంలో అసలేం జరుగుతుందో అందరికీ తెలుసన్న కామెంట్లు కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. సిద్ధరామయ్యను ఎలాగైనా ప దవి నుంచి దించేయాలన్న అతి పెద్ద ప్లాన్ బీజేపీ ప్లాన్ అమలు చేస్తోందని అనుమానిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తే ఆ దిశగానే వెళ్తున్నాయని చెబుతున్నారు. సిద్ధరామయ్య కుటుంబానికి మైసూరు సమీపంలో తమ గ్రామంలో ఉన్న భూముని తీసుకునన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ బోర్డు … మైసూరులో ఖరీదైన స్థలాల్ని కేటయించిందనేది కేసు.
ఈ కేసులోసిద్ధరామయ్య అధిక ప్రయోజనం పొందారని విచారణకు ఆదేశించారు. ఈడీ అనేది అక్రమ నగదు లావాదేవీల అంశంలో కేసులు పెట్టాలి కానీ. .. ఇక్కడ మైసూర్ స్థానిక సంస్థల విషయంలో జరిగిన దానికి ఈడీని తీసుకు రావడం ఏమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై సిద్దరామయ్య చర్చలు జరుపుతున్నారు.