ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ చాలా దూకుడుగా ఉంది. కేటీఆర్ ను విచారణకు పిలిచి ఆయనపై లోపల ప్రశ్నల వర్షం కురిపిస్తూండగానే కేసులో కీలకంగాఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేశారు. ఈ కంపెనీ ఫార్ములా ఈ రేసు కు మొదటి సీజన్ కు స్పాన్సర్ గా వ్యవహరించారు. తర్వాత వైదొలగింది. అందుకే ప్రభుత్వం నుంచి స్పాన్సర్ షిప్ ను చెల్లించాల్సి వచ్చిందని కేటీఆర్ చెబుతున్నారు.
ఇప్పటికే A2 అరవింద్ కుమార్, A3 bln రెడ్డిలను ఈడీ ప్రశ్నించింది. వారు ఇచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించడంతో పాటు గ్రీన్ కో అనుబంధ కంపెనీ అయన ఏస్ నెక్ట్స్ జెన్ తో లావాదేవీల్ని కూడా బయటకు తీశారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏస్ నెక్ట్స్ జెన్ యజమానులు.. కేటీఆర్ స్నేహితులేనని మొత్తం వ్యవహారాలు కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ స్టేట్ మెంట్లను ముందు ఉంచి ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఆర్ధిక లావాదేవీలు,RBI నిబంధనల అతిక్రమణ, విదేశీ అకౌంట్లకు నగదు బదిలీపై ఆరా తీస్తు్నారు. ace nxt gen సంస్థ సీజన్ 9 కోసం ఎంత చెల్లించింది, ప్రభుత్వం ఎంత చెల్లించింది వంటి వివరాలు కేటీఆర్ నుండి తెలుసుకున్న ఈడీ బ్యాంక్ అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేటీఆర్ ను చిక్కుల్లో పడేసే ప్రశ్నలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ ఇందులో అవినీతి ఏమీ లేదని చెబుతున్నంత సులువుగా ఏమీ లేదని.. చాలా సీరియస్ గా ఈడీ దర్యాప్తు చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.