ఏపీ ప్రభుత్వానికి ఉచిత కంటెంట్ ఇస్తామని చెప్పి రూ. ఏడు వందల కోట్ల వరకూ సొమ్ము చేసుకున్న ప్రముఖ ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ పై ఈడీ గురి పెట్టింది. వేల కోట్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయని చెప్పి.. మళ్లీ వాటిని విదేశాలకు తరలించారని స్పష్టత రావడంతో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. బైజూస్ సీఈవో రవీంద్రన్, ఆయన కంపెనీ థింక్ అండ్ లర్న్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. బెంగళూరులోని ఆయన నివాసంతో పాటు రెండు ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది.
విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించారన్న ఆరోపణల మేరకు ఆయనపై ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఫెమా చట్టం కింద తనిఖీలు చేపట్టగా పలు కీలక పత్రాలు లభించాయని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. 2011 నుంచి 2023 మధ్య కంపెనీకి రూ. 28వేల కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అందాయని పేర్కొంది. అదే సమయంలో రూ. 9754 కోట్లను ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ కింద పంపినట్టు గుర్తించామని చెప్పింది. అయితే పెట్టుబడులు రాకుండానే వచ్చినట్లుగా చెప్పుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. తనిఖీల సమయంలో పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ చెబుతోంది.
బైజూస్ భారీగా అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రెండున్నర వేలకోట్ల ఆదాయంపై నాలుగున్నర వేల కోట్ల లాస్ ను గత ఆర్థిక సంవత్సరంలో చూపించారు. ఇలాంటి మ్యాజిక్‌లు చాలా చేశారని ఈడీ తనిఖీల్లో గుర్తించారు. కరోనా సమయంలో పెద్ద ఎత్తున కంటెంట్ అమ్ముకున్న కంపెనీఅందులో విషయం లేకపోవడంతో తేలిపోయింది. ఇప్పుడు మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఆదాయం లేకపోవడంతో.. తీవ్ర ఒత్తిడి ఎదుర్కొటోంది.
ఏపీసీఎం జగన్ పెట్టుబడుల సదస్సు కోసం దావోస్ వెళ్లినప్పుడు బైజూస్ రవీంద్రన్ అక్కడ సీఎం జగన్ ను కలిశారు. సదస్సు తర్వాత ఏపీ ప్రభుత్వం ఏటా రూ. ఏడు వందల కోట్లు పెట్టి ట్యాబ్‌లు కొనాలనుకుంది. ఓ సారి కొన్న తర్వాత సొంత కంటెంట్ తయారు చేస్తున్నామని చెబుతోంది.