దేశవ్యాపితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన దాడులలో జగన్‌తో సంబంధం వున్న రాజేశ్వరి ఎక్స్‌పోర్టు కూడా వున్నట్టు కథనాలు వచ్చాయి. అవాస్తవ లావాదేవీల పేరిట వందల కోట్టు దేశం దాటిస్తున్న ఆ కంపెనీ బాధ్యులను అరెస్టు చేసినట్టు కూడా వార్తలు తెలిపాయి. జగన్‌తో సంబంధం వున్న రాజేశ్వరి ఎక్స్‌పోర్ట్సు అని ఈడీ ట్వీట్ చేసినట్టు పెద్ద ఎత్తునే ప్రచారమైంది. ఈ ట్వీట్‌కు స్వంత కవిత్వం కలిపి తమపై బురద జల్లారంటూ జగన్ మూడు తెలుగు ఛానళ్లకు నోటీసు కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆ వార్త దేశమంతటా ఇంగ్లీషు పత్రికలలోనూ వెబ్సైట్లలోనూ విస్తారంగా ప్రసారమైంది. దానితోపాటు ఈడీ వర్గాల పేరిట వివిధ పత్రికలు ఇచ్చిన కథనాలలో కోట్ చేసిన భాగాలలో తేడాలున్నాయి. అలాగే ఈడీ ట్వీట్‌లోనూ భిన్నమైన వ్యాఖ్యానాలకు అవకాశం కలుగుతున్నది. జగన్ సంస్థలపైన,రాజేశ్వర్ ఎక్స్పోర్ట్సుపైనా దాడులు చేసినట్టు విడివిడిగా చూసే అవకాశం కూడా వాటిలో వుంది. జగన్ అంత గట్టిగా ఖండించడానికి కారణం ఇదే కావచ్చు. అయితే అలాఅనుకున్నా కూడా జగన్ సంస్థలపై దాడిచేసినట్టే భావించవలసి వుంటుంది. వాటి పేర్లేమిటి ఎక్కడున్నాయి వంటి వివరాలు ఈడీనే వెల్లడించాల్సి వస్తుంది.జగన్ రాజేశ్వరి సంస్థతో సంబంధం లేదని మాత్రమే ఖండించడం గమనించదగ్గది.కొన్ని పత్రికలు ఆయన ఖండన కూడా ఇవ్వగా నోటీసుకు గురైనవి మాత్రం తమ కథనంతోనే సరిపెట్టాయి. దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే కొంత నిరీక్షణ తప్పకపోవచ్చు.
ED searches at shell companies related to Y S Jagan Reddy Rajeshwar Exports & others to unearth their modus operandi
— ED (@dir_ed) April 1, 2017
Some of the companies were involved in major money laundering cases related to Chaggan Bhujbal, YS Jagan Mohan Reddy, Yadav Singh, NHRM, AGS Infotech, Rajeshwar Exports etc while some other entities were found to have been used for laundering demonetised currency during post demonetization period,” the ED said in a statement.
ED conducted searches at shell companies & it's operators used by Yadav Singh of NOIDA corruption scam to convert his illegal wealth
— ED (@dir_ed) April 1, 2017