జాతీయ మీడియా ఏరీ సీఎం జగన్ తీరును దుమ్మెత్తి పోస్తోంది. గత మూడు నెలల కాలంలో జగన్ పై ఏర్పడిన ఇమేజ్… జాతీయ దినపత్రికల్లో కనిపిస్తోంది. రాజకీయాలకు అర్థం.. పరమార్థం.. ప్రజలకు మేలు చేయడం కాకపోవచ్చేమో కానీ…కీడు మాత్రం చేయకూడదు. కానీ ఏపీలో సర్కార్ అదే చేస్తోందని.. జాతీయ మీడియా నమ్ముతోంది. సాధారణంగా.. ఏదైనా జరిగితే కవరేజీ ఇవ్వడం వేరు.. నేరుగా.. తమ అభిప్రాయాలను ఎడిటోరియల్ ద్వారా వెల్లడించడం వేరు. ఈ ఎడిటోరియల్ అభిప్రాయాలకు అత్యంత విలువ ఉంటుంది. సాధారణంగా జాతీయ దినపత్రికలు.. ఈ ఎడిటోయల్స్ ను… జాతీయ స్థాయిలో ప్రభావిత అంశాలపైనే ప్రచురిస్తాయి. కానీ జగన్ విషయంలో.., నాలుగు ప్రసిద్ధ దినపత్రికలు… ఎడిటోరియల్స్ రాశాయి. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది ట్రిబ్యూన్, ఏషియన్ ఏజ్, ఎకనమిక్ ఎక్స్‌ప్రెస్ వంటి పత్రికలు.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ…సంపాదకీయాలు రాశాయి.
పత్రికా ప్రమాణాలను అత్యున్నత స్థాయిలో ఉంచిన..ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక .. ఓ ఎడిటోరియల్‌లో .. జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు ముద్రను చెరిపేయడానికి వాడుతున్నారని.. ఆయన సమర్థవంతమైన పరిపాలనా ఎజెండాను నిర్ధేశించుకోవాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ అభిప్రాయపడింది. టైమ్స్ గ్రూప్‌నకు చెందిన ఎకనమిక్ టైమ్స్ ..అమరావతి విషయంలో జగన్ విధానాన్ని తీవ్రంగా తప్పు పడుతూ.. ఎడిటోరియల్ ప్రచురించింది. పట్టణీకరణలో .. అమరావతి అనేది ఓ రోల్ మోడల్ లాంటిదని.. దాన్ని చంపవద్దని… ఏపీ సీఎంకు ఎకనామిక్ టైమ్స సూచించింది. ది ట్రిబ్యూన్ పత్రిక… ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాన్ని ఎలా టార్గెట్ చేస్తున్నారో వివరించి.. ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతోందని… అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏషియన్ ఏజ్ పత్రిక…ఏపీ సీఎం తప్పుడు సలహాలతో… దారుణమైన పాలన అందిస్తున్నారని.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి సమయం కేటాయిస్తున్నారని విమర్శలు గుప్పించింది.
జాతీయమీడియాలో ఏకపక్షంగా.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు వ్యతిరేకంగా ఏకంగా ఎడిటోరియల్స్ వస్తాయని ఎవరూ ఊహించలేకపోయారు. జగన్ నిర్ణయాలు దేశంపై తీవ్ర ప్రభావం చూపుతూండటం… ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉండటం వల్లే.. జాతీయ మీడియా విమర్శలు గుప్పిస్తోందని చెబుతున్నారు. విశేషం ఏమిటంటే.. జాతీయ మీడియాతో సమన్వయం చేసుకుని … వ్యతిరేక వార్తలు రాకుండా చూసుకునేందుకు… సాక్షిలో జీతం తీసుకుంటున్న ఓ సుప్రసిద్ధ జర్నలిస్టును… అంతర్రాష్ట్ర మీడియా సలహాదారుగా ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే నియమించింది. ఆ తర్వాతే… అసలు వ్యతిరేక కథనాలు రావడం ప్రారంభమయ్యాయి..!
An damning editorial by @EconomicTimes And what's worse, except Botsa's incoherent statements,@ysjagan didn't give any clarity to Andhra people on Amaravati.
From the editorial:
"To kill Amaravati to settle political scores would be an unpardonable act of irresponsibility" pic.twitter.com/SJtYtia9D1
— Telugu360 (@Telugu360) September 13, 2019