రాజకీయం అంటే చచ్చు తెలివి తేటల ప్రపంచం అని నిరూపించేందుకు కొంత మంది రాజకీయ నేతలు చాలా మంది ఉంటారు. ప్రజల్లో సులువుగా జాలి తెచ్చుకుని వారి ఓట్లు ఇట్టే కొట్టేయవచ్చన్న ఆలోచలను అంతే పకడ్బందీగా అమల్లో పెట్టగలిగిన రాజకీయ నాయకులు మాత్రం అరుదుగా ఉంటారు. అందులో ఒకరు జగన్మోహన్ రెడ్డి. ఆయన వైఎస్ చనిపోగానే.. కాంగ్రెస్ పార్టీకి గండి కొట్టేసి పార్టీ ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో.. ఉమ్మడి ఏపీలో ఏ మూల ఏ కారణంతో చనిపోయినా వైఎస్ కోసం వేదనతో చనిపోయారని సాక్షి పత్రికలో రాసుకునున్నారు. ప్లాన్ ప్రకారం ఓదార్పు యాత్ర చేపట్టి శవాల పునాదుల మీద పార్టీని నిర్మించుకున్నారు. అప్పుడే కాదు. .. ఇప్పుడు కూడా ఆయనది అదే వ్యూహం. తాను ఓడిపోగానే తన కోసం చాలా మంది చనిపోయారని లెక్కలు రెడీ చేసుకున్నారు. ఓదార్పు యాత్ర కోసం రెడీ అవుతున్నారు. ఈ లోపే.. ఇద్దరు కుర్రాళ్లు వ్యక్తిగత కక్షలతో చేసుకున్న దాడులతో జరిగిన హత్యలో రాజకీయ వెదుక్కుంటూ.. శాంపిల్ యాత్ర ప్రారంభించేశారు. అందుకే శవం లేచింది.. జగన్ వచ్చేశారని ఏపీ అంతా ఆశ్చర్యపోతోంది.
శవ రాజకీయమే ఏకైక అజెండా !
రాజకీయ నాయకుడు అంటే కాస్తంత అయినా సామాజిక బాధ్యత ఉండాలి. అంతా తన స్వార్థమే చూసుకోకూడదు. ఎందుకంటే.. రాజకీయ నాయకుడు ఎప్పుడూ గెలవడు. గెలిచేది ప్రజలే. వారు ఎవర్ని గెలిపిస్తే వారు గెలుస్తారు. ఇక్కడ గెలుపు తనది అని ఎగిరెగిరి పడితే..తర్వాత తన ఓటు పవర్ చూపిస్తారు . అలాంటివి జరిగినా అర్థం చేసుకోని రాజకీయ నేతల్ని ఎవరూ ఏమీ చేయలేరు. తన అధికారం పోయిందని…ఏపీలో ఎక్కడేం జరిగినా అది వైసీపీ మీద కక్షతో టీడీపీ నేతలే చేశారని ఆరోపించడం.. ఫేక్ న్యూస్‌లతో విరుచుకుపడటం కామన్ అయిపోయింది. అధికారం పోయింది మొదలు.. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగినా రాజకీయమే చేసేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా గాయపడినా ఆ బాధితుడు వైసీపీ వాడవుతాడు.. యాక్సిడెంట్ చేసిన వాడు టీడీపీ వాడవుతాడు. అలా చేయడం వెనుక చంద్రబాబు కుట్ర ఉంటుంది. ఇదే వైసీపీకి తెలిసిన రాజకీయం. పొరపాటున ఎవరైనా చనిపోతే ఇక చెప్పాల్సిన పని లేదు. వైసీపీకి రాబందుకు వచ్చినంత ఉత్సాహం వస్తుంది. వాలిపోతారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాలంటీర్లు లేకపోతే ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయలేరని చెప్పి.. వాళ్లని మండుటెండల్లో ఇబ్బంది పెడ్డి పదుల సంఖ్యలో వృద్ధుల ప్రాణాలు తీసుకున్నారు. ఆ వృద్ధుల శవాలతో చంద్రబాబు ఇంటికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ వృద్ధుల కుటుంబీకులు ఖాండ్రించడంతో ప్లాన్ ఫెయిల్ అయింది. కానీ వారిలో అంత మంది వృద్ధుల ప్రాణాలు తీశామన్న కించిత్ పశ్చాత్పం కూడా లేదు. అదే చచ్చు .. చావు రాజకీయం. బుధవారం వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని జిలానీ అనే మరో వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వీరిద్దరూ కొంత కాలం క్రితం వరకూ స్నేహితులు. తర్వాత శత్రువులు అయ్యారు. వ్యక్తిగత, కుటుంబ విషయాల కారణంగానే ఇద్దరి మధ్య శత్రుత్వం పెరిగింది. కొద్ది రోజుల కిందట రషీద్ . జిలానీ ఇంటికి వెళ్లి కుటుంబం మొత్తంపై దాడి చేశాడు. ఆయన బైక్ ను తగులబెట్టాడు. పగతో రగలిపోయిన జిలానీ.. రషీద్ ను హత్య చేశాడు. వీరిద్దరి మధ్య గొడవలకు రాజకీయంతో సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. మొదట్లో ఇద్దరూ వైసీపీలోనే ఉండేవారు. వైసీపీ మండల స్థాయి నేతకు అనుచరులుగా ఉండేవారు. ఆ నేత రౌడీషీటర్. ఇద్దరూ అనుచరులుగా ఉండేవారు. రషీద్ తో గొడవ అయిన తర్వాత ఎన్నికలకు ముందు జిలానీ టీడీపీలో చేరాడు. గొడవలకు పార్టీలకు సంబంధం లేదు.
నేరం చేసిన వాడు నేరస్తుడు – ఏ పార్టీ అయితే ఏంటి ?
నేరం జరిగిన వెంటనే నిందితుడు తెలుగుదేశం పార్టీ వాడని వైసీపీ కార్యకర్తలు ప్రచారం ప్రారంభించారు. జిలానీై తెలుగుదేశం పార్టీ వాడని వైసీపీ ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసింది. కాదు వైసీపీ కార్యకర్త అని టీడీపీ ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసింది. ఆ నిందితుడు రెండు పార్టీల్లోనూ పని చేశాడు. చనిపోయిన వ్యక్తి వైసీపీ కార్యకర్త. తమ పార్టీ వారికి ఉపాధిలో భాగంగా మద్యం దుకాణాల్లో ఉద్యోగాలిచ్చారు. ఓ మద్యం దుకాణంలో క్యాషియర్ గా పని చేస్తున్నాడు. జిలానీ కూడా వైసీపీ దగ్గర ఉపాధి పొందినవాడే. ఇంత నేరం జరిగిన తర్వాత అసలు వారి పార్టీల బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్నది ఆలోచించడమే పెద్ద తప్పిదం. చట్టం అందరికీ ఒకటే. రషీద్ టీడీపీ కార్యకర్త అయితే..ఆయనకు స్పెషల్ ప్రివిలేజెస్ ఉండవు. అలాంటివి చూపిస్తే ప్రభుత్వం సరిగ్గా నడవనట్లే. గతంలో మాచర్లలో స్థానిక ఎన్నికల సందర్భంగా బుద్దా వెంకన్న, బొండా ఉమలపై పట్టపగలు హత్యాయత్నం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ దాడి సంచనలం సృష్టించంది. ల ఆ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. తర్వాత మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు. అలాగే గతంలో టీడీపీ నేతలు, ఆఫీసులపై దాడులు చేసిన వారిపై కేసులు పెట్టలేదు. ఇలాంటివి జరగడం వల్ల ప్రభుత్వం పక్షపాతంగా పని చేసిందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది. ఇప్పుడు వినుకొండలో జరిగిన ఘటనలో నిందితుడ్ని వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ గుర్తింపు ఉంటే .. అది నేరాలు చేయడానికి అర్హత ఎలా అవుతుంది. నేరం జరిగినప్పుడు నిందితుడి పార్టీతో సంబంధం లేకుండా.. కఠిన చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీలో ఉంటే ఆయన చేసిన నేరాలకు సర్టిఫికెట్ వచ్చినట్లుగా కాదు. కానీ రాజకీయం చేయడం వల్ల.. నేరస్తుడికి అనవసరమైన సపోర్టు వచ్చేలా చేస్తున్నారు. టీడీపీ్ నేతే అనే ముద్ర వేయడం వల్ల వైసీపీ ఎలాంటి లాభం వస్తుందో కానీ. అలాంటి ముద్ర వేయగానే..టీడీపీ కూడా రివర్స్ లో చరిత్ర బయటకు తీసి ఆరోపణలు చేస్తోంది. ప్రతి చోటా ఏదో ఓ ఘటన.. నేరం జరుగుతూనే ఉంటుంది. అయితే ఏపీలో మాత్రం జరిగే ప్రతి నేరం వెనుక రాజకీయం ఉంటుంది. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా ఉండదు. అన్ని ప్రధాన పార్టీలూ ఈ ఆరోపణలు చేస్తూంటాయి. సంచలనాత్మక నేరంగా జరిగితే నిందితుడు మీ పార్టీ వాడేనని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. ఎక్కడైనా ఘర్షణ జరిగితే రాజకీయ గొడవలే ఉంటారు. ఇలాంటి రాజకీయ.వల్ల నేరస్తులకు పార్టీలను అంట గట్టడం వల్ల నేర తీవ్రతపై ప్రభావం చూపుతోంది. రాజకీయ పార్టీలకు తెలియకుండానే పెద్ద ఎత్తున సమాజానికి నష్టం చేస్తున్నారు.
కక్షలే తీర్చుకోవాలంటే టీడీపీని అసలు వేధించిన వాళ్లు సేఫ్‌గా ఉంటారా ?
తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ అనే ఓ పుస్తకం రాసుకుంది. గత ఐదేళ్లుగా వారు ఎదుర్కొన్న బాధలు అలాంటివి. అధికారం వస్తే తామేంటో చూపిస్తామని సవాల్ చేశారు. కానీ ఏమీ చేయడం లేదని టీడీపీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. కార్యకర్తల ఈగో శాటిస్ ఫై చేయడానికి అయినా కొన్ని అరెస్టులు చేయాలని అంటున్నారు. ఇక క్యాడర్ ను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేశారు. కక్ష సాధింపులకు పాల్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే తాము కూడా కాపాడలేమని వార్నింగ్ ఇస్తున్నారు. ఫలితంగా.. కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వాళ్లు ప్రశాంతంగా బతుకుతున్నారు. పవన్ కల్యాణ్ పై అత్యంత ఘోరంగా నోరు పారేసుకున్న పేర్ని నాని, రోజా వంటి వాళ్లు ఏపీలో ప్రెస్ మీట్లు కూడా పెట్టగలుగుతున్నారు. అదే వీరిద్దరూ పవర్ లో ఉన్నప్పుడు ఎదురైన అనుభవాలు ఘోరంగా ఉన్నాయి. రోజాను ఎయిర్ పోర్టులో కొట్టినంత పని చేశారు. పేర్ని నాని, అంబటి రాంబాబు వంటి వారిని పక్క రాష్ట్రాల్లోనే కొట్టబోయారు. వీరందరికీ ప్రజలే శిక్ష వేశారని.. చాలా వరకూ వదిలేస్తున్నారు. నేరుగా భౌతిక దాడులకు పాల్పడటం అనే ప్రక్రియపై నమ్మకం పెట్టుకోలేదు. కానీ.. జరిగే ప్రతీ నేరంపై టీడీపీ ముద్ర వేయడం వల్ల… నిందలు ఎలాగూ పడుతున్నాయి కదా రెడ్ బుక్ ఓపెన్ చేసుకుందామన్న సలహాలు క్యాడర్ పార్టీ హైకమాండ్ కు ఇస్తోంది.
అందుకే ప్రతిపక్ష హోదా రాలేదు… ఇంతే సాగితే ?
నిజానికి వైసీపీ గెలిచి ఉంటే ఈ పాటికి ఎంత మందిని చంపి ఉండేవారో చెప్పాల్సిన పని లేదు. సాక్షాక్తూ ఏఏజీని అని చెప్పుకునే సుధాకర్ రెడ్డి కొంత మందిని చంపుకోవడానికి పర్మిషన్ ఇస్తానని గొప్పగా చెప్పుకున్నారు. గత ఐదేళ్లలో ఎంత మందిని చావును కళ్ల జూశారో చెప్పాల్సిన పని లేదు. అలాంటి వారు ఏ మాత్రం తగ్గకుండా చావు రాజకీయాలకు బరి తెగిస్తున్నారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టుపట్టించారు. ఇప్పుడు కనీసం ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్న సంగతిని మర్చిపోకుండా.. 39 శాతం ఓట్లు వచ్చాయని తమ పాత పద్దతిలో చావు రాజకయాలపై దండయాత్ర చేస్తున్నారు. వచ్చే పెట్టుబడులు రాకుండా చేయడానికి కుట్రలన్నీ అమలు చేస్తున్నారు. ఇలాంటి నేతలు రాజకీయాల్లో ఉండటం… ఆ రాష్ట్రానికే శాపం. చంద్రబాబు చెప్పినట్లుగా భూతాన్ని భూస్థాపితం చేయకపోతే.. చచ్చు రాజకీయాలు.. చావు వ్యూహాలతో ఏపీ అల్లాడిపోడం ఖాయం.