ఓటముల నుంచి పాఠాలు.. ఘోర ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకోని వాడు ఎప్పుడూ విజయం వైపు అడుగు ముందుకు వేయలేడు అనేది చరిత్ర చెప్పే సత్యం. ఉద్యోగం.. వ్యాపారం.. రాజకీయం ఏ రంగానికి అయినా ఇది వర్తిస్తుంది. నేను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు నాకు చేతయినందే ఉద్యోగం.. వ్యాపారం.. రాజకీయం అనుకుంటే.. ఒక్క సారి జాక్ పాట్ తగులుతుందేమో కానీ 99 సార్లు మాడు పగిలిపోతుంది. ఇలాంటి వ్యక్తి ఉద్యోగంలో ఉంటే ఆ సంస్థకు.. వ్యాపారంలో ఆ కుటుంబానికి..రాజకీయంలో ఉంటే.. ఆ పార్టీకి, ఆ రాష్ట్రానికి సర్వనాశనం తప్పదు. ఏపీలో రాజకీయాల్ని చూస్తే..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే కుల, మత, ప్రాంత ఉద్వేగాలను పక్కన పెట్టి చూస్తే ఈ వ్యవహారం అంతా కళ్ల ముందే కనిపిస్తూ ఉంటుంది. అలాగే పాఠాలు కూడా నేర్చుకోని రాజకీయం మన ముందు కనిపిస్తూ ఉంటుంది. పుట్టగతులు లేకుండా పోయే పార్టీ కూడా మనకు అవగతమవుతుంది.
విశ్వసనీయత షో చేస్తే రాదు – ప్రవర్తనలో ఉండాలి !
రాజకీయాల్లో విశ్వసనీయత అనేది చాలా ముఖ్యమని ఓ నేత పదే పదే తన ప్రసంగాల్లో చెబుతూంటారు. మరి ఆ నేతకు విశ్వసనీయత ఉందా?. సొంత తల్లి, చెల్లి కూడా ఆయనను నమ్మడం లేదు. రాసిచ్చిన ఆస్తిని కూడా వెనక్కి ఇవ్వాలనికోర్టుకెళ్లారు. సొంత వాళ్లతో అలా ఉంటే ఇక బయట వాళ్లతో ఎలా ఉంటారో ప్రత్యేకంగా అంచనా వేయాల్సిన పని లేదు. తనను నమ్మిన ప్రతి ఒక్కరిని అటు జైలుకు పంపడమో.. ఇటు కుటుంబాన్ని రోడ్డున పడేయడమో చేస్తారు. చివరికి చిన్న పిల్లలను కూడా వదిలి పెట్టరు. రాజకీయ డ్రామాల కోసం పిల్లలనూ వదలని ఆ రాజకీయం మనుగడ సాగిస్తుందని అనుకోవడం పిచ్చి పని. జగన్ రెడ్డితో కలిసి పని చేసిన వారు ఇప్పుడు ఎవరు ప్రశాంతంగా ఉన్నారు ?. ఆడిటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి దగ్గర నుంచి వైవీ సుబ్బారెడ్డి వరకూ ప్రతి ఒక్కరూ..దోపిడీలు.. నేరాల కేసుల్లో మునిగితేలుతున్నారు. ఐఏఎస్, ఐపీఎల్ ఆఫీసర్ల వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చారు. ఆ వ్యవస్థ ఎంత బలహీనమయిందో రుజువు చేశాడు. శ్రీలక్ష్మి అనే అధికారణి ఆయనను నమ్ముకుని ..ఐఏఎస్ అధికారులు ఎలా ఉండకూడదో అన్నదానికి ఓ ఉదాహరణగా మారారు. తండ్రి చనిపోయిన మరుక్షణం నుంచి రాజకీయాలు ప్రారంభించారు. ఓదార్పు యాత్ర కోసం సాక్షి పత్రికలో ఎయిడ్స్ మరణాలను కూడా వైఎస్ కోసం చనిపోయినట్లుగా మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో అటు ఆదిలాబాద్ నుంచి ఇటు చిత్తూరు వరకూ వందల మంది వైఎస్ కోసం చచ్చిపోయారని పేర్లు , అడ్రస్ లతో సహా సాక్షిలో రాసుకున్నారు. అప్పటికి కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టలేదు. కానీ కాంగ్రెస్ వదలాలని.. ఓదార్పు యాత్ర చేయాలన్న లక్ష్యంతోనే ఆయన శవాల లెక్కలు రాసుకున్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఓదార్పుయాత్రకు అనుమతి ఇవ్వలేదని .. తన తండ్రిని సీఎంను చేసినా..తనను వేల కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చిన పార్టీని ఎడమకాలితో తన్ని.. బయటకు వచ్చి ఆ పార్టీ అధ్యక్షురాలి మీదనే ప్రమాందలో చనిపోయిన తన తండ్రిని కుట్ర చేసి హత్య చేయించాలని ఆరోపించిన విశ్వసనీయత ఆయనది. ఆయనకు ఎవరి మీద కోపం వస్తే.. వారి మీద మీరే నా తండ్రిని హత్య చేయించారని బురద వేసేస్తారు. రిలయన్స్ మీద.. చంద్రబాబు మీద అలాగే వేశారు. ఆయన గురించి తెలియక.. ఆయన తల్లి, చెల్లి అదే నిజమని చెప్పి ఏడ్చుకుంటూ అవే మాటలు చెప్పేవారు. ప్రజలు సానుభూతి పవనాల్లో కొట్టుకుపోయేవారు. ఇలాంటి రాజకీయాలు చేసే ఆయన అసలు మనస్థత్వం మాత్రం.. ఎలా ఉంటుందో అధికార వచ్చిన తర్వాత అందరూ చూశారు. అందుకే తల్లి, చెల్లి దూరమైపోయారు. ఆయనకు ఇప్పుడు ఉన్న బంధువులు ఎవరంటే.. వివేకా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి .. జగన్ తో ఉంటే కాస్తంత డబ్బులు వస్తాయని ఆశపడే వర్గం మాత్రమే. రేపు తనను కాపాడే శక్తి లేదని తెలిస్తే అవినాష్ కూడా ఉండరు. అదీ ఆయన విశ్వసనీయత.
ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచి గుణపాఠాలు నేర్చుకోరా ?
అధికారం అందిన తర్వాత ఆ విషపునీయత ఏమిటో ప్రజలకు.. పార్టీ నేతలకు తెలిసిన తర్వాత ఆయనకు ఇవ్వాల్సిన రిజల్ట్ ఇచ్చారు. మరి ఇప్పుడేం చేయాలి?. పదేళ్ల కిందట తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్న ప్రజులు పదేళ్ల తర్వాత అంత ఘోరమైన బెల్టు ట్రీట్ మెంట్ ఇచ్చారని తెలిసిన తర్వాత ఆయన ఏం చేయాలి ?. చేసిన తప్పులేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దిద్దుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలి. కానీ ఆయనేం చేస్తున్నారు?. కనీసం కుటుంబాన్ని అయినా చక్కదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. వారిపై నిందలు వేసి వారిని ఇంకా బద్నాం చేయాలనే ఆలోచన చేస్తున్నారు కానీ.. వారికి చేసిన అన్యాయాన్ని సరి చేసి .. తనకు ఉన్న వేలాది కోట్లలో కొంచెం తన చెల్లెలి బిడ్డలకు ఇద్దామన్న ఆలోచన చేయడం లేదు. తల్లి, చెల్లి కోసమే ఆలోచన చేయని వాడు.. ఇక సామాన్య ప్రజల కోసం.. చేస్తాడా?. ఆ చాన్సే లేదని.. ఇప్పుడు నిరూపిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు బెంగళూరులో ఉండి.. మూడు రోజులు ఏపీలో ఉండి.. ఆ మూడు రోజులు డ్రామాలతో హడలెత్తించే పనులు చేస్తున్నారు. వైసీపీ ఎందుకు ఓడిపోయిందంటే.. ఆ విషపునీయతతో ఆయన వందీ మాగధులు చేసిన అరాచకమే కారణమని వైసీపీ నేతలంతా చెబుతారు. ఓ రాచమల్లు ప్రసాదరెడ్డి.. ఓ వాసుపల్లి గణేష్ లాంటి వారు బహిరంగంగానే చెబుతున్నారు. వారంతా కలిసి మిగతా పార్టీ మొత్తాన్ని నాకించేశారని. ఆ అడ్డగోలు రౌడీ వెధవలను బయటకు పంపేయాలని.. అప్పుడైనా ప్రజల్లో వైసీపీకి కాస్త ఇమేజ్ వస్తుందని అనుకుంటూ వస్తున్నారు.కానీ జగన్ రెడ్డి ఏం చేస్తున్నారు ? . వల్లభనేని వంశీకి క్లీన్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఆయన ఎంత క్లీనో కళ్ల ముందు లేదా .. ఎవర్ని నమ్మిస్తారు.. ? ఎవరు నమ్ముతారు?. ప్రజల్ని ఓ మాదరిగా కూడా చూడని మనస్థత్వంతో ఈ లీడర్ చెలరేగిపోతున్నారు. వంశీ అందగాడు అంటాడు.. కొడాలి నాని హ్యాండ్సమ్ అంటారు.. అందుకే అరెస్టులంటాడు.. ఇలాంటి మాటలన్నీ.. ప్రజలు ఇచ్చిన షాకులకు పిచ్చెక్కిపోయిన లీడర్ చెబుతున్న మాటలనుకోవాలి. కానీ నేర్చుకునే ప్రయత్నం చేయకపోతే ఎలా ?
ఫేక్ ప్రచారాల రాజకీయాలు ప్రతీ సారి వర్కవుట్ అవ్వవు !
రాజకీయాల్లో డ్రామాలు, అబద్దాలు ఒక్క సారి వర్కవుట్లు అయ్యాయని ప్రతీ సారి అదే పని చేస్తానంటే కష్టం. అధికారలోకి రాక ముందు ఎన్ని అబద్దాలు చెప్పినా ఓ లెక్క.. అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్ల పాలనను ప్రజలకు చూపించిన తర్వాత కూడా మళ్లీ అవే అబద్దాలు చెప్పి బతికేస్తానని ప్రజల మీద పడిపోతే భరించడానికి వారు సిద్ధమవుతారా?. విజయవాడ, గుంటూరులో ఆయన చేసిన అరాచకం చూసిన వారికి.. ఏపీ రాజకీయాల్లో ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయంటే.. ఉండవా అనుకుంటారు. ఎన్నికల కోడ్ ఉందని చెప్పినా మిర్చియార్డుకు పోయాడు..ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రోడ్ షోలు నిర్వహిస్తే.. కేసులు పెడతారని తెలుసు. అయినప్పటికీ ఆయన చేయాలనుకున్నది చేశారు. కేసులు పెడితే కేసులు పెట్టాలని లబోదిబోమని ఏడవడానికి ఈ డ్రామాలన్నీ. జగన్ రెడ్డిది నేర మనస్థత్వం.. క్రూర మనస్థత్వం..ఎవరి ప్రాణాలు తీసి అయినా తాను రాజకీయంగా ఎదగాలనుకుంటారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. కోడికత్తి కేసు డ్రామా దగ్గర నుంచి గులకరాయి వరకూ ఆయన చేయని డ్రామాలు లేవు. ప్రజల్ని కులమతాలుగా వర్గీకరించి.. చంద్రబాబును ఖచ్చితంగా వారు వ్యతిరేకిస్తారని.. అలాంటి వారంతా తనకే మద్దతిస్తారన్న పాలసీతో రాజకీయం చేస్తున్నారు. ప్రజల కడుపు కాలిన తర్వాత కుల, మత , ప్రాంతాల గురించి ఆలోచించరని ఎన్నికల ఫలితాలోనే నిరూపితమయింది. ఈ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే.. పాతాళంలోనే ఉంచి మట్టి కప్పేస్తారు తప్ప.. మరో చాన్స్ ఇచ్చేందుకు సిద్ధపడరు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ప్రజల్ని తక్కువ అంచనా వేసి బాగుపడిన వాడు ఎవడూ లేడు. ప్రజల్ని ఒక సారి మోసం చేయవచ్చు కానీ.. ప్రతీ సారి మోసం చేయాలనుకున్నవాడు పిచ్చివాడే అవుతాడు.
రాజకీయాల్లో మరో అడుగు లేదనే రాజకీయం !
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయాలు చూసి.. ఇలాంటి వ్యక్తితో ప్రజాస్వామ్య రాజకీయాలు చేయాల్సి ఇస్తుందన్న సిగ్గుపడాల్సి వస్తోందని చంద్రబాబు చాలా సార్లు అన్నారు. ఆయనే కాదు.. వైసీపీలో ఉన్నచాలా మంది సీనియర్లు కూడాఅదే అనుకుని ఉంటారు. వారంతా చదువుకుని ఉండకపోవచ్చు కానీ.. రాజకీయాల్లో ఎంతో కొంత సంస్కారాన్ని విలువలను కాపాడుకుంటూ వచ్చిన వారే. ఇంత సిగ్గులేని రాజకీయాలు చేయడం వారికి అలవాటు లేదు. ఇలాంటి వారెవరూ ఆయనకు చెప్పలేరు. ప్రజల జ్ఞాపకశక్తిని తక్కువ అంచనా వేసి.. చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తే.. టీడీపీపై కుల ముద్ర వేస్తే గతంలోలా గెలిచేయవచ్చని అనుకుంటున్నారేమో కానీ.. జగన్ అనే పేరు వింటే మరో పేదళ్ల పాటు ప్రజలు భయపడేలా పరిపాలన చేశారు. ఇప్పుడు అదే అరాచకాలతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వ్యవహరిస్తాను.. అసెంబ్లీకి కూడా వెళ్లకుండా బయట మాత్రమే అబద్దాలు చెబుతాను.. ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయం చేస్తానంటే ఎల్ల వేళలా సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి నేర, ఘోర మనస్థత్వం ఉన్న వారిని వ్యవస్థలు ఎంత కాలం సహిస్తాయో కానీ.. ప్రజలు మాత్రం సహించే అవకాశం ఉండదు. ప్రజా జీవితంలో ఉండాలనుకున్నప్పుడు ప్రజల ఆలోచనలకు తగినట్లుగా ప్రచారం చేసుకోవాలి. పది మందిని పోగేసుకుని హంగామా చేస్తే అది రాజకీయం అవదు. సోషల్ మీడియాలో కోర్టు ఖర్చు పెట్టించి బూతులు తిట్టిస్తే పాలిటిక్స్ అవ్వవు. దానికో లెక్క ఉంటుంది. అది నేర్చుకోనంత కాలం.. రాజకీయాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు.