వినాశకాలే విపరీత బుద్ధి. పోయే కాలం వచ్చినప్పుడు విపరీత నిర్ణయాలు తీసుకుంటారని అర్థం. రాజకీయాల్లో చాణక్యుడు కూడా చెప్పాడు. ఎంత విపరీతమైన ఆలోచన వస్తే అంత వినాశనానికి గురవుతారు. తప్పించుకున్న వాడు ఒక్కడు ఉండడు. అది మ్యాటర్ ఆఫ్ టైమ్ అంతే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన విపరీత ప్రవర్తన కు ఉపయోగించుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల్ని ఘోరంగా మోసం చేస్తూ.. తన దోపిడీకి.. విపక్షాలను వేధించడానికి.. ప్రజల్ని మభ్య పెట్టడానికి.. వ్యక్తిగత విలాసాలను ప్రజలు బాధ్యతగా భావించమని ఇచ్చిన అధికారాల్ని ఉపయోగించుకున్నారు. చివరికి ప్రతిపక్ష నేతలంద్రనీ అరెస్ట్ చేసి తాను జైలుకు వెళ్లాలనే దుస్సాహస కుట్రకూ తెరేలేపారు. ఇందు కోసం అన్ని వ్యవస్థల్నీ అవినీతి మయం చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా అపహాస్యం చేయాలనే ప్రయత్నం ఇంత వరకూ ఎవరూ చేయలేదు. కానీ.. తాను చేయగలనని.. తన చేతిలో అధికారం ఉంటే.. కిమ్ కాదు.. వాడి బాబులా చేయగలనని నిరూపించేస్తున్నారు.
కూల్చుడు. చంపుడు.. దోచుకునుడు.. ఇదే పాలన
నాలుగున్నరేళ్ల కిందట అధికారం చేపట్టింది మొదలు కూర్చున్న కొమ్మనే నరుక్కున్న విధంగా… మనం ఇప్పుడు సమావేశం అయిన ఈ హాల్ అక్రమ కట్టడం కూల్చేయండి అని ఆదేశించారు.. ఆ మాటలే సైకోతనానికి పెద్ద సాక్ష్యంలా ఉంటే… ముస్సోరిలో శిక్షణ పొంది.. సర్వీసులో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొంత మంది చప్పట్లు కొట్టారు. దీంతో ఏపీ భవిష్యత్ సైకోల చేతుల్లోకి వెళ్లిపోయిందని అప్పుడే ప్రజలకు క్లారిటీ వచ్చింది. అప్పట్నుంచి.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పడేశారు. ప్రతీది కూల్చడమే. రూ. పది లక్షల కోట్ల సంపదను ప్రజలకు సృష్టించే.. అమరావతిని నిలువునా బాబాయ్ వివేకానందరెడ్డిని నరికేసినట్లుగా నరికి పడేశారు. పోలవరం ప్రాజెక్టును తల్లి, చెల్లిని వెళ్లగొట్టినట్లుగా .. అనాధను చేసి పడేశారు. మూడు రాజధానుల పేరుతో రాజకయం చేసి రుషికొండకు బోడి గుండు కొట్టించారు. విశాఖను కబ్జాల మయం చేశారు. ఇప్పుడు విశాఖ భయం భయం గా బతుకుతోంది. అంతేనా రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల కాలంలో చిన్న ప్రాజెక్టు పూర్తయిన దాఖలాలు లేవు. ఇచ్చాపురంలో కిడ్నీ బాధితులకు రీసెర్చ్ సెంటర్ కట్టేందుకు రూ. యాభై కోట్లతో శంకుస్థాపన చేస్తే.. ఇప్పటికీ దిక్కులేదు. నాలుగున్నరేళ్లు అయింది. యాభై కోట్లతో ఓ కిడ్నీ సెంటర్ కూడా కట్టలేకపోయారు. ఇక రాష్ట్రం మొత్తం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. పాడైపోయిన రోడ్లే కానీ.. కొత్తగా వేసిన రోడ్డే లేదు. కానీ రోడ్ సెస్ మాత్రం వసూలు చేస్తారు. అదే సమయంలో.. అభివృద్ధి పనులను పక్కన పెట్టేసి.. ప్రజాధనం అంతా తన సొంత డబ్బులు అన్నట్లుగా వాడుకోవడం ప్రారంభించారు. తన ప్రైవేటు నివాసానికి ఆయన వంద కోట్లకుపైగా ఖర్చు పెట్టి ఉంటారు. తన ఇంటి ముందు కాలవ కట్టపై దశాబ్దాలుగా పేదల కాలనీ ఉండేది. రాత్రికి రాత్రి తొలగించేసి.. బ్యూటిఫికేషన్ చేశారు. అయ్యగారి ఇల్లు మాత్రం నాలుగున్నరేళ్లలో ఎంతో మారిపోయింది. కానీ కొన్ని లక్షల మంది ప్రజలు మాత్రం రోడ్డున పడ్డారు. అయ్యగారికి .. ఒంటేలు వస్తే.. పోసుకోవడానికి కూడా హెలికాఫ్టర్ లో వె్ళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నరు. రెండు కిలోమీటర్ల దూరానికి హెలికాఫ్టర్ లో ప్రయాణించి.. తన డాబును ఎప్పటికప్పుడు చూపించుకుంటూనే ఉన్నారు. ఓ వైపు అభివృద్ధి అనే పదం వినిపించకుండా.. కంటికి అనువుగా కనిపించినవన్నీ కూల్చి పడేసి తొక్కుకుంటూ పోతున్నాడు.
ప్రజల్ని పీల్చి పిప్పి చేసే పాలన
వినాశం చేయడం.. అభివృద్ధి చేయకపోవడం ఓ తంతు అయితే.. ప్రజల్ని పీల్చి పిప్పి చేసి.. వారి అంతు చూడటం జగన్ రెడ్డిలోని మరో లక్షణం. ఎవరైనా ప్రశ్నిస్తాడు అని తెలిస్తే వాడి పని ఆ రోజు వాడి పని అయిపోయినట్లే. మద్యం ధరలు పెంచి రక్తమాంసాలు తింటున్న జగన్ రెడ్డిని.. తిరుపతిలో ఓ మందు బాబు … జగన్ రెడ్డి బ్రాండ్ మందు తాగి బండబూతులు తిట్టాడు. తర్వాతి రోజే అనుమానాస్పదంగా చనిపోయాడు. ఉన్న తాము అయినా ప్రాణాలు దక్కించుకోవాలని ఆ కుటుంబసభ్యులు అనుమానం లేదని మంత్రి పెద్దిరెడ్డి ఎదురుగాగా గుడ్లురిమి చూస్తూండగా స్టేట్ మెంట్ ఇచ్చారు. అలాంటి మరణాలు ఎన్నో లెక్కలేదు. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే వ్యక్తిని ఓ ఎమ్మార్వో పిలిపించి మరీ ఎమ్మెల్యే మనుషులకు అప్పగిస్తే పట్టపగలు ప్రభుత్వం కార్యక్రమం దగ్గరే గొంతు కోసి చంపేశారు. ఇక మాచర్లలో చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్తను ఎలా చంపారో కళ్ల ముందే ఉంది. ఇలాంటివి గత నాలుగున్నరేళ్ల కాలంలో లెక్కేసుకుంటే.. కొన్ని వందల కుటుంబాలు అన్యాయమైపోయాయి. అయినా రక్తదాహం తీరడం లేదు. సొంత నియోజకవర్గం పులివెందులలో వారానికొకర్ని అడ్డంగా నరికేస్తున్నారు. అయినా మా వూళ్లు అలా జరగకపోతే ఆశ్చర్యపడాలన్నట్లుగా మార్చేశారు. లా లేదు ఆర్డర్ లేదు. పోలీసులు బులుగు బానిసలుగా మారిపోయింది. బాధితులపైనే కేసులు పెడతామని జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ సారి అన్నారు.. ఆయన టంగ్ స్లిప్ అయ్యారేమోని అప్పట్లో అందరూ ట్రోల్ చేశారు.. కానీ తాను కరెక్టుగానే అన్నానని మీరే అర్థం చేసుకోలేకపోయారని అధికారంలోకి వచ్చి నిరూపిస్తున్నారు. ప్రతిపక్ష నేత ఇళ్లపై దాడులు చేస్తారు.. ఆఫీసుల్లోకి రౌడీమూకల్ని పంపుతారు.. ర్యాలీల్లో రాళ్లు వేయిస్తారు… ఎన్ని రకాల అరాచకాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. కానీ అదే వైసీపీ నేతలు పట్టపగలు హత్యాయత్నం చేస్తే.. అది పార్టీలో మరింత క్వాలిఫికేషన్ ఇలాంటి అరాచకాల మధ్య ప్రజలు ఛీకొడుతూంటే.. ఇక ప్రత్యర్థుల్ని నిర్మూలించడమో.. జైల్లో పెట్టో ఎన్నికలకు వెళ్లాలని డిసైడయ్యారు. చివరికి అదే చేస్తున్నారు.
ప్రతిపక్ష నేతల్ని అయితే చంపడం.. లేకపోతే వేధించడం !
పధ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే.. ఎఫ్ఐఆర్ కూడా ఉండక్కర్లేదా ? . అర్థరాత్రి బెటాలియన్ తీసుకెళ్లి చుట్టు ముట్టేసి.. కిందకు దిగిరాకపోతే.. బస్సులను టోయింగ్ చేసి తీసుకెళ్తామంటారా?. స్కిల్ డెలవప్మెంట్ స్కాం జరిగిందని రెండేళ్ల కిందట కేసు నమోదు చేశారు. ఒక్క రూపాయి అవినీతికి సాక్ష్యం చూపించలేక చార్జిషీట్ కూడా వేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఏ 37 అని చేర్చేసి అరెస్ట్ చేసేస్తారు. దేశంలో న్యాయవ్యవస్థపై ఇంత గుడ్డి నమ్మకం ఉందా ? లేకపోతే.. తాము చెప్పిందే చేయాలన్న శాసనం మందుగానే చేసి పెట్టారా ?. రాజకీయ ప్రత్యర్థులపై ఇంత ఘోరమైన కుట్రలు గతంలో ఎవరు చేయలేదు. నాలుగున్నరేళ్ల నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబును చంపడానికి చేసిన కుట్రలు అన్నీ అన్నీ కావు. 73 ఏళ్ల వ్యక్తిని రాళ్లతో కొడితే చాలు.. అన్నట్లుగా చెలరేగిపోయారు. మధ్యలో వీళ్ల కుట్రలపై స్పష్టంగా తెలిసి.. కేంద్రం సెక్యూరిటీని డబుల్ చేసింది. ఎన్ఎస్జీని తీసేయాలని అదే పనిగా కేంద్రానికి లేఖలు రాశారు. ఎన్ఎస్జీ లేకపోతే వేసేస్తామని స్పీకర్ తమ్మినేని కూడా మాట్లాడారంటే.. ఈ రాజ్యంలో ఎలాంటి అరాచకత్వం రాజ్యమేలుతుందో చెప్పడానికి ప్రత్యేకమైన ఉదాహరణలు అక్కర్లేదు. చివరికి ఆయనను అనుకున్నట్లుగా రాజమండ్రి జైల్లో ఉంచారు.ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. రాజమండ్రి జైలర్.. భయపడి సెలవు పెట్టి వెళ్లిపోయాడు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరో వైపు సీఐడీ అధికారులు రాజకీయ నాయకుల మాదిరిగా ఊరూవాడా తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి.. తప్పుడు ప్రచారాలు, బెదిరింపులు. సీఐడీ అధికారులు ఏదైనా ఉంటే కోర్టులో చెప్పాలి కానీ ప్రతీ ఊరూ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని ఏంటి ?. తప్పుడు ప్రచారాలు చేయాల్సిన పని ఏంటి ? వ్యవస్థల్ని ఇంత కన్నా ఎవరూ దిగజార్చరు. అత్యంత ఘోరమైన క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి చేతుల్లో పోలీసులు, వ్యవస్థలు ఉంటే.. ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు ఏపీలో అదే పరిస్థితి ఉంది.
చంద్రబాబు అరెస్టుతో గొయ్యి తవ్వేసుకున్నట్లే !
ప్రతిపక్ష నేతల్ని చంపడం.. కుదరకపోతే బూతులతో మానసికంగా వేధించడం. ఎంత మందిని వేధించారో లెక్కలేదు. ఎంత ఘోరంగా తిడితే తనకు అంత విధేయుడన్నట్లుగా పదవులు కట్టబెట్టారు. దారుణాలు ఏ స్థితికి వెళ్లాయంటే.. తప్పుడు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపితే.. మంత్రులు సంబరాలు చేసుకున్నారు. ఏపీ మొత్తం బూతుల రాజ్యం అయిపోయింది. చివరికి కులాలను పెట్టి తిట్టడం కూడా ఓ రాజకీయం చేసేశారు. ఓ గౌరవనీయమైన వ్యక్తి కి వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన పేర్ని నాని, క్లీనర్ నుంచి ఎదిగిన కొడాలి నాని, రోజా .. ఇలా ఎంత మంది బూతులతో విరుచుకుపడతారో .. జనాలందరికీ తెలుసు. ఇలాంటి ఘోరాలను తట్టుకోలేక.. విపక్షాలు ఏకమయ్యాయి. సరైన సమయంలో… ప్రజలంతా ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనంంగా ఉన్న సమయంలో… పవన్ కల్యాణ్ పొత్తుల ప్రకటన చేశారు. టీడీపీతో కలిసి పోటీ చేస్తామన్నారు. వచ్చే ఆరు నెలలు కలిసి ఉద్యమిస్తామన్నారు. సివిల్ వారు సృష్టిస్తామంటున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రజల్లో భయం తగ్గిపోతుంది. రెండు పార్టీలు కలిసి ప్రజా ఉద్యమాలు ప్రారంభిస్తే.. ఎన్నికలకు ముందే పరారు కావాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తే తప్పు పూర్తిగా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన సైకో మనస్థత్వానిదే. అందులో సందేహమే లేదు.
సైకో పక్కన ఉన్న వాళ్లు తమను తాము కాపాడుకోండి !
ప్రజల మూడ్ స్పష్టంగా ఉంది. అయినా జగన్ రెడ్డి ఓట్లు గోల్ మాల్ చేస్తాడని.. గల్లంతు చేస్తాడని.. మా ఓటర్లు వేరే ఉన్నారని.. ఇంకా రెచ్చిపోతే.. తర్వాత ప్రజల నుంచి సానుభూతి కూడా లభించడం కష్టం. అందుకే జగన్ రెడ్డి తన గొయ్యి తాను తవ్వేసుకున్నాడు. మిగతా వాళ్లనూ కప్పెట్టడానికీ ప్లాన్ చేశాడు. నమ్ముకున్నోళ్లందర్నీ .. నమ్మిన వాళ్లనూ నట్టేట ముంచుతున్నాడు. అదీ అలా ఇలా కాదు.. వారు చేసిన వెధవ పనులకు బతకాలంటేనే భయంపుట్టేలా చేసేలా.. చేస్తారు వచ్చే వాళ్లు. బాధలు పడిన వాళ్లు.. మంచితనంతో ఉండరు. పగ, ప్రతీకారాలతో రగిలిపోతారు. అందుకే.. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. జగన్ రెడ్డి చేసిన వేధింపులకు మించి వేధింపులు ఎదుర్కోకూడదంటే.. ఇప్పటి నుంచి ఎవరి దారి వారు చూసుకుంటే బెటర్. ఎందుకంటే..జగన్ రెడ్డి ఎలాగూ గొయ్యి తవ్వేసుకున్నాడు. ఎన్నికల ఫలితాల రోజు ఎవరికి వారు నియోజకవర్గాల్లో ఉండి.. జగన్ రెడ్డి కూడా అమరావతి లేకపోతే.. సేఫ్ సైడ్ గా తాను రుషికొండను బోడిగుండుగా మార్పించేసి కట్టించుకున్న ప్యాలెస్ లోనే ఉంటే.. అదే ధైర్యం అనుకోవచ్చు. ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు కూడా లేదు. కేంద్రం ముందస్తు అనుకుంటే డిసెంబర్లోనే జరుగుతుంది. అందర్నీ జైల్లో పెట్టి ఎన్నికలకు పోయినా ప్రజలు తవ్వుకున్న గొయ్యిలోనే పాతరేస్తారు. అదే నిజం.. అదే భవిష్యత్.