” పాలకులు ఈ రీతిన ఉంటే ఈ దేశమేగతిన బాగుపడునోయ్ ” అని పాలనా వైఫల్యాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తున్న ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ ఇక్కడ పాలకులు ఆ రీతిన ఉండటానికి కారణం ఎవరు… వంద శాతం ప్రజలు. ఎందుకంటే పాలకుల్ని ఎంచుకునేది ప్రజలే. ఒక్క సారి అవకాశం ఇస్తే వారే నియంతలుగా మారిపోతారు. జీవితాల్ని ఛిద్రం చేస్తారు. అంతే కాదు భవిష్యత్ తరాలనూ నాశనం చేస్తారు. భవిష్యత్‌లో ఇంకెప్పుడూ కోలుకోకుండా చేసేస్తారు. అదే సమయంలో మంచి చేసే పాలకులూ ఉంటారు. రాజకీయాలు చేయవచ్చు.. రాజకీయ కుట్రలు పన్నవచ్చు.. కానీ దేశం పట్ల.. ప్రజల పట్ల.. వారి జీవితాల పట్ల కనీస బాద్యత ఫీలయ్యే పాలకులూ ఉంటారు. ఇక్కడ కూడా గొప్పతనం ప్రజలదే. ప్రజలు అలా ఫీలయ్యే వారిని ఎన్నుకుంటారు. ఇలాంటి వాటికి మన కళ్ల ముందు కనిపిస్తున్న సాక్ష్యాలు అంతర్జాతీయందా దక్షిణ కొరియా , ఉత్తర కొరియా.. దేశీయంగా ఏపీ, తెలంగాణ.
దక్షిణ కొరియా ప్రపంచంతో అనుసంధానం..అభివృద్ధి చెందిన దేశం !
దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాల గురించి మనం తరచూ వింటూటాం. రెండింటిలోనూ కొరియా పదం ఉంది. అంటే ఒక్క కొరియాకు దక్షిణం..ఉత్తరంగా విడిపోయాయి. ఎందుకు విడిపోయాయి.. ఎలా విడిపోయాయి.. వాటి చారిత్రక నేపధ్యం ఏమిటి అన్న సంగతి వదిలేద్దం. అది ఇక్కడ టాపిక్ కాదు. కానీ ఆ రెండు దేశాల మధ్య కనిపిస్తున్న స్పష్టమైన తేడాలు మాత్రం మన గుర్తు చేసుకోవాల్సిందే. ఎందుకంటే మనకు అన్వయించుకోవచ్చు కూడా. ఇప్పుడు మన దేశంలో .. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. చైనా, జపాన్ వంటి దేశాలతో పోటీ పడి ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్రశ్రేణి దేశంగా దక్షిణ కొరియా ఎదిగింది. శామ్ సంగ్, హ్యుందాయ్, ఎల్జీ, కియా వంటివన్నీ కొరియాకు చెందిన కంపెనీలే. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక గన్న బ్రాండ్లను కొరియా ఉత్పత్తి చేస్తుంది. దక్షిణ కొరియా అభివృద్ధి చెందిన దేశం. హాంకాంగ్, సింగపూర్, తైవానులతో కలిసి దక్షిణకొరియా కుడా గుర్తింపు పొందింది. ఈ నాలుగు దేశాలు ఆర్థికపరంగా ఆసియన్ టైగర్లుగా గుర్తింపు పొందాయి. గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో దక్షిణ కొరియా తూర్పు ఆసియాలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందింది. సులభంగా వ్యాపారం చేయడం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య సంరక్షణ, ఆయుర్దాయం , పరిశోధన, అభివృద్ధిలో ఉన్నత స్థానంలో ఉంది. సాంకేతికంగా కూడా ముందంజలో ఉంది, వేగవంతమైన ఇంటర్నెట్ వేగం, ఇ-గవర్నెన్స్, ICT అభివృద్ధితో హై స్పీడ్ ఇంటర్నెట్కు మారిన ప్రపంచంలోనే మొదటి దేశంగా కూడా ఇది నిలిచింది. అక్కడ ప్రజల తలసరి ఆదాయం రూ. పదిహేను లక్షల రూపాయలు. మన దేశంలో అది అది మూడు లక్షలు ఉంటేనే గొప్పగా చెప్పుకుంటున్నారు.
మరి ఉత్తర కొరియా ?
అదే సమయంలో ఒకప్పుడు కొరియాలో భాగం అయిన ఉత్తరకొరియా .. దక్షిణ కొరియాను ఆనుకునే ఉంటుంది. ఆ దేశం పేరు కూడా ప్రజల్లో నానుతూనే ఉంటుంది. కానీ దక్షిణ కొరియా తరహాలో ప్రపంచానికి ఉపయోగపడే బ్రాండ్లు.. ప్రజల జీవన విధానం, అభివృద్ధి వంటి విషయాల్లో కాదు. అక్కడి నియంత పాలకుడు వ్యవహరించే.. చేసే పిచ్చి చేష్టలతో వార్తల్లోకి వస్తుంది. అక్కడి ప్రజలు మూడు పూటలా తిండి తినే పరిస్థితుల్లో లేరు. ఎవరైనా ప్రభుత్వం చెప్పినట్లుగా చేయాల్సిందే. ప్రభుత్వం అంటే..నియంత పాలకుడు కిమ్ జోంగ్ మాత్రమే. చివరికి అక్కడి ప్రజలు తమకు నచ్చినట్లు హెయిర్ కట్స్ కూడా చేసుకోకూడదు. దేశాధ్యక్షుడు సూచించిన 15 రకాల హెయిర్ కట్స్‌కు మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది. అవి కాదని వేరే హెయిర్ కట్ చేయడానికి, చేయించుకోవడానికి ఇక్కడ ఎవరూ సాహసించరు. ఉత్తరకొరియాకు ప్రపంచంతో సంబంధం లేని టైమ్ జోన్, క్యాలెండర్ రెండూ ఉన్నాయి. జపనీస్ కంటే 30నిమిషాల ముందుకు వీరు సమయాన్ని మార్చుకున్నారు. అలాగే ప్రపంచం అంతటికీ ఇప్పుడు 2017సంవత్సరం నడుస్తుంటే ఉత్తరకొరియాలో మాత్రం 104వ సంవత్సరం నడుస్తోంది. మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్-Il జయంతిని వీరు కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు. దుస్తుల విషయంలోను ఆంక్షలు ఉంటాయి. ఇక్కడ జీన్స్ వేసుకోవడం నిషిద్దం. అలాగే ఇంటర్నెట్ కూడా కొంతమంది వీఐపీలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కార్లు కూడా కొంతమందికి మాత్రమే అనుమతిస్తారు. ఉత్తరకొరియా ప్రజలకు బాహ్యా ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. అసలు బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే అవకాశం వీరికి లేదు. కారణం సమాచార వ్యవస్థను కిమ్ జాంగ్ తన గుప్పిట్లో బంధించడమే. ఇక్కడ కేవలం మూడు న్యూస్ చానెల్స్ కు మాత్రమే అనుమతి ఉంది. అవి కూడా ప్రభుత్వం నిర్దారించిన వార్తలనే ప్రసారం చేస్తాయి. నిబంధనలు అతిక్రమిస్తే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. హాలీవుడ్ సినిమాలు చూసినా మరణశిక్షలు తప్పవు. క్షమాభిక్ష అన్న పదం ఉత్తరకొరియా చరిత్రలో లేదు. నిబంధనలు అతిక్రమిస్తే నిర్దాక్షిణ్యంగా శిక్షలు వేయడమే. అందుకే ఈ దేశంలో దాదాపు 3లక్షల మంది ప్రజలు జైళ్లలో బంధీలుగా ఉన్నారు. ఇంత దుర్భరమైన పాలన అందిస్తున్న కిమ్ ను ప్రజలే ఎన్నుకుంటారు. నమ్ముతారో నమ్మరో ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్నికల్లో మాత్రం ఒక్కరే నిలుచుంటారు. సదరు అభ్యర్థి గనుక నచ్చకపోతే.. ప్రజలు ఓటింగ్ సమయంలో వేరే అభ్యర్థి పేరు బహిరంగంగా చెప్పాలి. ఆ తర్వాత వాళ్లకు విధించే శిక్షలు మామూలుగా ఉండవు.ప్రతీ ఇంట్లోను కిమ్ జాంగ్ పాలకుల ఫోటోలు తప్పనిసరిగా ఉండాలి. ఉత్తరకొరియా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక రేడియో ఛానెల్ నడుస్తుంటుంది. కాబట్టి ప్రతీ ఇంట్లోను విధిగా ఆ ఛానెల్ వార్తలను వినాలి. రేడియో ఎప్పుడూ ఆన్ లోనే ఉండాలన్న నిబంధన ఉంది.
తెలంగాణ దక్షిణ కొరియాలా.. ఏపీ ఉత్తర కొరియాలా మారిపోతున్న పరిస్థితులు
దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల గురించి తెలుసుకున్న తర్వాత మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది తెలుగు రాష్ట్రాలే. అచ్చంగా ఆ రెండు దేశాల్లో జరుగుతున్నదే ఇక్కడ కూడా జరుగుతోంది కదా అనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించారు. రాష్ట్రం ఎక్కడికి పోలేదు ప్రజలూ ఎక్కడికి పోలేదు. భూమి ..ప్రజలు అన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. కానీ హద్దులు మాత్రం మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌గా.. తెంలగాణలాగా విడిపోయింది. ఇప్పటికి పదేళ్లు అయింది. మొదటి ఐదేళ్లుగా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఏపీలో పాలకులు మారిపోయారో అప్పట్నుంచే అసలు ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు కనిపించడం ప్రారంభమయ్యాయి. తెలంగాణ గత తొమ్మిదేళ్లుగా అభివృద్ది ప్రాధాన్యతాశాల్లో దూసుకుపోతోంది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టుకున్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లందుకు పాలకులు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. అక్కడ రాజకీయాలు లేవని కాదు..రాజకీయాలు ఉన్నాయి. కుట్రలు, కుతంత్రాల రాజకీయాలూ ఉన్నాయి. కానీ వారు తమ రాష్ట్రాన్ని నాశనం చేసుకోవడానికి కానీ.. ప్రజల జీవితాల్ని ప్రభావితం చేయడానికి కానీ ఎక్కడా ప్రయత్నతించలేదు. ప్రజల జీవితాన్ని పాలనా నిర్ణయాల ప్రకారంగా బాగు చేసే ప్రయత్నం చేశారు.. వీలైనంతగా పారిశ్రామికాభివృద్దికి ప్రయత్నించి.. ప్రజలంతా తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడానికి ప్రయత్నించారు. అందుకే తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రం అనే భావనకు వచ్చేలా చేస్తోంది. ప్రజల జీడీపీ పెరుగుతోంది. తెలంగాణ ఆయువు పట్టు హైదరాబాదే కావొచ్చు కానీ..మిగిలిన ప్రాంతాలు ఆ స్థాయిలో కాకపోయినా తెలంగాణ ప్రజలంతా జీవన ప్రమాణాల్ని పెంచుకుంటున్నారన్నది నిజం. రెట్టింపు అయిన ధాన్యం ఉత్పత్తి.. మాత్రమే కాదు.. కరెంట్ వినియోగం అనూహ్యంగా పెరగడం కూా ప్రజల కొనుగోలు శక్తికి నిదర్శనం. ప్రభుత్వం కూడా ప్రజల్ని రాచి రంపాలన పెట్టాలని అనుకోలేదు. ఏదో విధంగా ఇంప్రెస్ చేయడానికే ప్రయత్నిస్తోంది. శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే విడిపోయిన తర్వాత తెలంగాణను చూస్తే ఎవరికైనా దక్షిణ కొరియా అనిపిస్తుంది. ఇలా అనిపించడానిక ప్రధాన కారణం..అసలు పోలిక పెట్టుకునే పరిస్థితి తేవడానికి ప్రధాన కారణం ఏపీలో ఉన్న జగన్ రెడ్డి పరిపాలన.
కిమ్ పెట్టే ఆంక్షలన్నీ ఏపీలో అమలు – ఏపీ ప్రజలు తెచ్చి పెట్టుకున్న దరిత్రం
జగన్ రెడ్డి పరిపాలన ఉత్తర కొరియా నియంత కిమ్ కన్నా ఘోరంగా ఉందన్న అభిప్రాయం రావడానికి కారణం ఆయన పరిపాలనకు.. కిమ్ నిర్ణయాలకు మధ్య ఉన్న పోలికలే. ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రజాస్వామ్యం. కానీ కిమ్ కూడా ఐదేళ్లకో సారి ఎన్నికలు పెడతారు. తనకు మాత్రమే ఓటేసేలా రూల్స్ మార్చేశారు. జగన్ రెడ్డి కూడా అంతే. వైసీపీకి మాత్రమే ఓటేయాలి.. వైసీపీ వాళ్లు మాత్రమే ఓటేయాలన్న రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన ఘోరాలు చూసిన తర్వాత ఇక ఎవరికైనా ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం వస్తే వారి తప్పేం లేదు. ఇప్పుడు ఓట్ల జాబితాలను తారుమారు చేసి తమ ఓటర్లు మాత్రమే ఉంటారని ఫిక్సయిపోయి 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని ప్రకటించడం కిమ్ ను గుర్తు చేయకుండా ఉంటుందా ?. ఉత్తర కొరియాలోలాగే ఏపీలో ప్రజలు కూడా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే శిక్షలకు గురవుతారు. ప్రశ్నిస్తే దాడులకు గురవుతారు. వారే్ కేసులు పెట్టించుకోవాల్సి ఉంటుంది. పుంగనూరు, అంగళ్లులో వైసీపీ నేతలే దాడి చేసి.. టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. మొత్తం ఐదు వందలపై కేసులు పెట్టారంటే..కిమ్ ను మించిపోయినట్లే. ఉత్తర కొరియా జైళ్లలో ఐదు లక్షలు మగ్గిపోతున్నారని అంటారు.. ఏపీలో అంత కంటే ఎక్కువ మందిని జైళ్లలో పెట్టేయగలరు. కానీ న్యాయస్థానాలు కనికరిస్తూ ఉండటం వల్ల కొంత మంది బయటపడిపోయారు. లేకపోతే పనికి మాలిన కేసులు పెట్టి సుప్రీంకోర్టు సీజేఐని కూడా లోపలేయగల తెంపరితనం ఏపీ పాలకులు.. వారి కనుసన్నల్లో బ్రహ్మరాక్షసులుగా మారిపోయిన పాలకులకు ఉంది. తినే తిండి విషయంలోనూ అదే పరిస్థితి. తానే మందు కూడా అంతే. ఏపీ పాలకులు ఇచ్చే మద్యమే తాగాలి. వారు చూపించే టీవీ చానళ్లే చూడాలి. తాము చెప్పిందే నిజమని నమ్మాలి. ఉద్యోగాలు, పరిశ్రమల జాడే ఉండదు. తామురేషన్ బియ్యం పడేస్తాం..తిని పడి ఉండండి అంతకు మించి ఎక్కువ కేసులు పెట్టి బొక్కలో వేస్తామని హెచ్చరికలు షరామామూలుగానే ఉంటాయి.
అసలు సమస్య ప్రజలు తెలుసుకుంటారా ? లేదా అనే !
ఉత్తర కొరియా అయినా.. దక్షిణ కొరియా అయినా.. ఏపీ అయినా .. తెలంగాణ అయినా … ఆ దేశాలకు వచ్చిన పరిస్థితులు పూర్తిగా ప్రజల వల్లనే. ఉత్తర కొరియా ప్రజలు తిరుగుబాటు చేస్తే కిమ్ ఎంత సేపు ?. కానీ చేయలేరు. ఎందుకంటే అంతగా భయపెడతారు. భయం పోగొట్టుకున్న రోజున వారంతా తిరగబడితే .. కిమ్ కాదు కదా.. వారి వంశం ఆనవాళ్లు కూడా లభించవు. దక్షిణ కొరియా ప్రజలకు తాము ఏం కోరుకున్నారో అదే చేస్తున్నారు. అభివృద్ధి ఫలాలను ఎంచుకున్నారు. అనుభవిస్తున్నారు. తెలంగాణ ప్రజలు అదే తెలివిడితనంతో వ్యవహరించారు. కానీ అవినీతి కేసుల్లో నిండా మునిగి.. నోరు తెరిస్తే అబద్దాలు.. కుల, మత రాజకీయాలు చేసి.. రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేసి.. ప్రజల బతుకుల్లో నిప్పులు పోస్తాడని తెలిసి కూడా నియంత పాలకుడ్ని ఎంచుకున్నారు. ఇప్పుడు ఆ పాలకుడు.. ప్రజలతో పని లేకుండా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అదే అధికారాన్ని ప్రయోగిస్తున్నాడు. అతని ప్రయత్నాలు ఏ మాత్రం సక్సెస్ అయినా ఏపీ ఉత్తరకొరియాను దాటిపోతుంది. ప్రజల్ని ఎవరూ కాపాడలేరు. కుల , మత ద్వేషాలతో ప్రజలు వారి నెత్తి మీద చేయి పెట్టుకుంటారో..కాస్త తలపైకెత్తి చూసి.. ప్రపంచం మనల్ని చూసి నవ్వుతోందని తెలివి తెచ్చుకుంటారో వేచి చూడాల్సి ఉంది.