” పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికి పెట్టిందట ”
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఇదే. జగన్ రెడ్డికి పెత్తనం ఇస్తే ఆయన మొత్తం తలను గొరిగి పెట్టేశారు. గుండు చేసేశారు. ఇప్పుడు అసలు విషయాలు చెప్పకుండా ప్రజలపై యుద్ధానికి సిద్ధమా అని తన సైన్యాన్ని రెడీ చేసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలకు.. వాలంటీర్లతో సభలు పెట్టి తన కోసం యుద్ధానికి సిద్ధం కావాలని కావాలని రెచ్చగొడుతున్నారు. చొక్కా గుండీలు విప్పాలని.. కాలర్ ఎగరేయాలని.. చొక్కా చేతుల్ని మడతేయాలని అంటున్నారు. సిద్ధం అంటూ ప్రజాధనంతో పెంచి పోషిస్తున్న అసాంఘిక శక్తుల్ని జగన్ రెడ్డి రెచ్చగొడుతున్న వైనం చూస్తే.. జగన్ రెడ్డి ఎన్నికలకు వెళ్తున్నారో.. ప్రజలపై యుద్ధానికి వెళ్తన్నారో అర్థం అవుతుంది. ప్రజలు ఎలాగూ ఓట్ల వేయరని వాళ్లపై తన సైన్యాన్ని యుద్ధానికి పంపి.. విధ్వంసం చేసి.. తాను గెలవాలని అనుకుంటున్నాడు. అంటే వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో అడుగు వేయబోతున్నాడో స్పష్టమవుతోంది. ఆయన పెడుతున్న సభల్లో ఎక్కడా తన పాలనా పటిమ గురించి చెప్పడం లేదు. తాను చేసిన విధ్వంసం గురించి చెప్పడం లేదు. తాను సాధించిన ఘన కార్యాల గురించి చెప్పడం లేదు. ఒక్క యుద్ధం గురించి మాట్లాడుతున్నారు.
పదవి చేపట్టిన మరుక్షణం నుంచి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసే ప్రణాళిక
ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన మరుక్షణం నుంచి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయడానికి నిరంతరం శ్రమించారు. ప్యాలెస్ లో కూర్చుకుని రేయింబవళ్లు కుట్రలు చేశారు. పరిశ్రమల్ని తరిమేశారు. వ్యాపారాల్ని దివాలా తీయించారు. ఇసుక దోచుకున్నారు. మద్య నిషేధం పేరుతో చీప్ లిక్కర్ అమ్మేసి పేదల ప్రాణాలతో ఆటలాడి వేల కోట్లు సంపాదించుకున్నారు. అంతకు మించి ఏపీ కోసం కట్టుకుంటున్న పవర్ హౌస్ అమరవతిని నిర్వీర్యం చేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాలైన లేనిపపోని సమస్యలను తెచ్చి పెట్టారు. అలా తెచిన వాటిలో మొట్టమొదటిది మూడు రాజధానుల అంశం. ఎక్కడో సౌతాఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నాయని ఏపీలోనూ అమలు చేస్తామని ఏవో రెండు సంస్థలతో నివేదికలు తెప్పించుకుని అప్పటికప్పుడు తీర్మానాలు చేసేశారు. కానీ నాలుగేళ్లు దాటినా ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు సరి కదా..ఉన్న రాజధాని అమరావతిని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఏపీ రాజధాని ఏదీ అంటే.. ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే హైదరాబాద్ అని చెప్పుకుంటే బాగుంటుందని అనుకున్నారేమో కానీ.. ఏపీకి రాజధాని కట్టుకునే స్థోమత లేదు కాబట్టి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని కోరుతామని ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరయిన వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. వైసీపీలో నిర్ణయాలు తీసుకునే అత్యుంత ముఖ్యుల్లో ఒకరైనవైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధాని అంశాన్ని తనకి తానుగా ప్రస్తావిస్తారని ఎవరూ అనుకోలేదు. పెద్దిరెడ్డి అది వైవీ సొంత అభిప్రాయం అంటుంటే.. బొత్స సత్యనారాయణ మాత్రం వైవీ వ్యాఖ్యలను వక్రీకరించారని తేల్చేస్తున్నారు. వైవీ ఉమ్మడి రాజధాని ప్రస్తావన మీడియా ముందే స్పష్టంగా మాట్లాడారు. కానీ ప్రజలు చీపురు తిరగేసే పరిస్థితి ఉందని తెలిసి మళ్లీ తూచ్ అన్నారేమో. కానీ ఇలాంటి రాజకీయాలు మాత్రం ఐదేళ్లుగా చూస్తూనే ఉన్నాం.
రాజధాని లేకుండా చేసి ఎవరికి మేలు చేశారు ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మొదటి అంశంగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ప్రజుల ఎవరికి ఓటేయాలన్న ఎజెండాలో ఖచ్చితంగా రాజధాని ఉంటుంది. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రంగా ఇప్పటికే ఏపీపై దేశవ్యాప్తంగాసెటైర్లు పడుతున్నాయి. టీడీపీ హయాంలో అమరావతి రాజధానిగా ఉంది. కానీ గత ఐదేళ్ల కాలంలో మూడు రాజధానులు పేరుతో వైసీపీ రాజకీయం చేసింది. ఇప్పుడు ఎన్నికలకు ముందు మూడు రాజధానుల గురించి మాట్లాడటం లేదు. విశాఖ గురించి చెప్పడం లేదు. అమరావతి గురించీ స్పందించడం లేదు. దీంతో అసలు ఏపీ రాజధాని అంశంపై వైసీపీ స్పందనేమిటన్నది ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. గతంలో సీఎం జగన్ ఉత్తరాంధ్రలో బటన్ నొక్కుడు సభలు పెట్టినప్పుడు విశాఖలో కాపురం పెట్టేస్తున్నానని ప్రకటనలు చేసేవారు. అంటే.. విశాఖ నుంచి పాలనకు వచ్చేస్తున్నా అని చెప్పేవారు. కానీ ఇటీవల సిద్ధం సభను భీమిలీలో పెట్టారు. రాజధాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్ ముగింపు కార్యక్రమానికి వెళ్లారు.. అక్కడా మాట్లాడలేదు. దీంతో మూడు రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్తుందనుకున్న వైసీపీ.. ఇప్పుడు మరో ఆలోచనలో ఉందన్న అభిప్రాయం ఎక్కువ మందికి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఎందుకు వద్దో ఏపీ ప్రభుత్వం ప్రజలకు చెప్పలేకపోయింది. అమరావతిని శ్శశానం అన్నారు.. అవినీతి అన్నారు.. మరొకటి అన్నారు… అక్కడేమీ లేవు అంతా గ్రాఫిక్సే అన్నారు. అయితే అమరావతిలోనే ఐదేళ్లుగా పరిపాలన సాగుతోంది. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం.. మంత్రుల కార్యాలయాలు అన్నీ ఉన్నాయి. ప్రభుత్వం మరే ముందు 45 వేల కోట్ల రూపాయల విలువైన పనులు రేయింబువళ్లు జరుగుతూ ఉండేవి. పెద్ద పెద్ద హౌసింగ్ ప్రాజెక్టులు దాదాపుగా పూర్తయ్యే స్టేజ్‌కు వచ్చాయి. అన్నింటినీ నిలిపివేశారు. అన్నీ పాడుబడిపోయాయి. అలా వదిలేశారు. కానీ అమరావతి రాజధానిగా ఎందుకు వద్దో మాత్రం ప్రజలకు క్లారిటీగా చెప్పలేకపోయారు. చివరికి ప్రభుత్వం ఎంతకి దిగజారిపోయిందంటే… అమరావతి నిర్మాణం పూర్తయిందని దొంగ సర్టిఫికెట్లు పుట్టించి బ్యాంకుల్ని కూడా బురిడీ కొట్టిస్తున్నారు.
రాజ్యాంగ, చట్ట ఉల్లంఘనలు చేసి పాలన చేయడం చేసి వ్యవస్థల దుర్వినియోగం
ఏపీకి రాజధాని లేదన్నది అబద్దం. ఏపీకి రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. ఇది ఏకగ్రీవంగా జరిగిన నిర్ణయం. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక్క చోట కూడా.. తమ ప్రాంతానికి రాజధాని కావాలని ఉద్యమాలు జరగలే్దు. కనీసం డిమాండ్లు రాలేదు. అందరూ ఏకగ్రీవంగా రాజధానికి మద్దతు తెలిపారు. ఇప్పుడు సీఎంగా ఉండి అమరావతిని నిర్వీర్యం చేసిన సీఎం జగన్ కూడా.. అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. అమరావతికి మద్దతిస్తున్నానన్నారు. అంతకు ముందు రాజధాని నిర్మాణంలో ఆయన ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయని వీడియోలు ఉన్నాయి. దీంతో అమరావతికి ఎలాంటి సమస్యా ఉండదనుకున్నారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్ తనకు రాజధాని మార్చే ఉద్దేశం లేదనే అందరికీ చెప్పారు. రాజధాని అమరావతిగానే ఉంటుందని కావాలంటే మేనిఫెస్టోలనేపెడతామని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా చెప్పారు. కానీ అధికారంలోకి చేతిలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ అమరావతి అంతు చూశారు. నిజానికి సీఎం జగన్ రెండో సారి కాకండా… 2014లో అయిన ముఖ్యమంత్రి అయి ఉంటే.. మూడు రాజధానులు కాదు.. ఏడు రాజధానులు అన్నా.. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు వచ్చి ఉండేవి కాదు. ఎందుకంటే.. రాజధాని నిర్ణయం అప్పటికీ రాష్ట్రం చేతుల్లో ఉంది. మొదట ఏర్పడే ప్రభుత్వానికి ఆ అవకాశం వచ్చింది. రాజధాని విషయంలో ఎలాంటి చట్టాలు లేవు. కానీ ఆ అవకాశం జగన్ కు రాలేదు. చంద్రబాబుకు వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం అందరితో చర్చించి.. ఏకగ్రీవంగా అమరావతిని ఖరారు చేసింది. జగన్ కూడా అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఆ మెరకు చట్టం చేసి సీఆర్డీఏను ఏర్పాటు చేసి.. రైతుల వద్ద నుంచి ల్యాండ్ పూలింగ్ చేసి అమరావతి నిర్మాణం ప్రారంభించారు. ఇలాంటి సమయంలో అధికారంలోకి వచ్చిన జగన్ మూడు రాజధానులు అన్నారు. మరి రాజధానికి భూములిచ్చిన రైతుల సంగతేంటి ?. చట్ట ప్రకారం వారికి చేయాల్సింది చేయకుండా.. వారిని రోడ్డున పడేస్తామంటే.. రాజ్యాంగం ఎలా ఊరుకుంటుంది ?. అదే జరిగింది. సీఎం జగన్ మూడు రాజధానులు చట్ట విరుద్ధం కాబట్టి ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. అదే చట్టబద్ధంగా రైతులందరికీ పరిహారం చెల్లించేసి ఉంటే.. మూడు కాదు. ఎన్ని రాజధానులు అయినా పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ అటు రైతులకు పరిహారం ఇవ్వకుండా.. ఇటు వారి భూముల అమ్మకాలు, పంచేయడాలు చేసి.. రాజధానిని మాత్రం అక్కడ ఉంచను అంటే న్యాయస్థానాల్లో ఎలా నిలబడుతుంది..?
ఇప్పుడు రాజధానిపై తమ స్టాండ్ ఏదో ఎందుకు చెప్పరు ?
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పి గత ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి ప్రచారం చేసి ఉంటే ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు.కానీ ఆయన అమరావతికే మద్దతు పలికి అదికారంలోకి వచ్చాక మాట మార్చారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు వెళ్లే సమయం వచ్చింది. అటు రాజధానిని నిర్వీర్యం చేశారు.. ఇటు మరో రాజధానిని రెడీ చేయలేకపోయారు. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారన్నది ఆసక్తికరంగా ఉంది. సిద్ధం సభలను ఉత్తరాంధ్రలో పెట్టినప్పుడు మూడు రాజధానుల గురించి జగన్ మాట్లాడలేదు. ఐదేళ్ల పాటు ఇదిగో వైజాగ్ వచ్చేస్తున్నా..అదిగో వైజాగ్ వచ్చేస్తున్నా అన్నారు కానీ.. వెళ్లలేకపోయారు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చిన తర్వాత ఇప్పుడు.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొంత కాలం కొనసాగించాలని కేంద్రంతో మాట్లాడతామంటున్నారు. దీని వల్ల ప్రజలకు .. రాష్ట్రానికి వచ్చే లాభమేంటి ? ఎన్నికలకు టీడీపీ తమది అమరావతే రాజధాని అనే విధానాన్ని ప్రకటించింది. అందులో మరో సందేహం లేదు. అ పార్టీకి చెందిన అన్ని ప్రాంతాల నేతలూ అదే చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ తన విధానాన్ని స్పష్టం చేయాల్సి ఉంది. విశాఖ రాజధాని అనేది రాజ్యాంగపరంగా సాధ్యం కాదు. అమరావతి రైతులకు రూ. లక్ష కోట్ల వరకూ నష్టపరిహారాన్ని ఇస్తే..సెటిల్ చేసుకుని రాజధానిని తరలించవచ్చు. లేకపోతే మళ్లీ గెలిచినా రాజధాని పెట్టలేరు. న్యాయస్థానాలూ కూడా చట్టాలు ఉల్లంఘించి రైతులకు అన్యాయం చేయమని ఎక్కడా చెప్పవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మూడు రాజధానులు చేయాలనుకుంటే.. అదే విషయాన్ని ప్రజలకు చెప్పాలి.. లేకపోతే ఒకే రాజధానా అన్నది కూడా చెప్పాలి.
చొక్కాలు మడతేసి యుద్ధానికి వస్తే ప్రజలు కుర్చీ మడతెయ్యడం ఖాయం !
కానీ జగన్ రెడ్డికి ఇప్పుడు తన ఐదేళ్ల పాలనపై.. చేసిన నిర్ణయాలు.. ఘనకార్యాలను చూపి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఓటర్లపై తన మూకతో యుద్ధం ప్రకటించి.. గెలుస్తానని నమ్మకంతో వెళ్తున్నారు. వాలంటీర్లను తన సైన్యంగా అందుకే ప్రకటించుకున్నారు. అంటే.. రాబోయేది.. ప్రజలకు.. జగన్ రెడ్డికి మధ్య జరగబోతున్న యుద్ధం. తాము ఇచ్చిన అధికారంతో తమపైనే యుద్ధం ప్రకటిస్తున్న జగన్ రెడ్డికి ఏ స్థాయి ఓటమి రుచి చూపించాలో ప్రజలే నిర్ణయించాలి. చొక్కా మడతేసి వచ్చే రౌడీలకు కుర్చీ మడత పెట్టి సమాధానం చెప్పకపోతే… ఎవరి మాన ప్రాణాలకు.. ఆస్తులకు గ్యారంటీ ఉండదు.