నారా లోకేష్ వారసుడు కాదు నాయకుడు అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యువగళం – నవశకం సభా వేదిక మీద నుంచి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నేతలకు అది పొగడ్తగా అనిపించచ్చు.. లోకేష్ అంటే నచ్చని వారికి ఇంకేదో అనిపించవచ్చు..కానీ తన చుట్టూ తనకు తెలియకుండానే ప్రత్యర్థులు తాను రాజకీయాల్లోకి రాక మందే నిర్మించడం ప్రారంభించిన ఓ ఇేమజ్ను కరిగించుకుని తానేంటో ప్రజల ముందు ఆవిష్కరించుకునేందుకు నారా లోకేష్ చేసిన శ్రమ.. పడిన కష్టం.. ఫలితమే నేడు.. మేకోవర్ అయిన లోకేష్ ప్రజల ముందు ఉండటం. అనితర సాధ్యమైన విజయాన్ని ఎవరూ ఊహించనంతగా లోకేష్ సాధించారు. ఎంతగా అంటే.. లోకేష్‌ను చూసి రాజకీయంగా భయపడేంతగా !
లోకేష్‌ను రాటుదేల్చిన ఏడాది
రాయి అయినా చెక్కితేనే శిల్పం అవుతుంది. 2023 ప్రారంభంలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు అంటే.. చాలా మంది లైట్ తీసుకున్నారు. ఎందుకంటే అప్పటికి ఆయనకు ఉన్న ఇమేజ్ అలాంటిది. స్టాన్‌ఫర్డ్‌లో చదువుకుని నీట్గాషేవ్ చేసుకుని పాలిటిక్స్ చేస్తే.. పప్పు అనే ముద్ర వేసేందుకు విపక్ష నేతలు పోటీపడ్డారు. ఆ ఇమేజ్ తొలగించుకుంటూ.. తెలుగులో తన ప్రసంగ స్టైల్‌ను పూర్తిగా మార్చుకుని ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సాగారు. పాదయాత్రలో చాలా ఆటంకాలు వచ్చాయి. లోకేష్ ఆ ఆటంకాలను ఎదుర్కొని.. తనను తను నిరూపించుకంటూ వస్తున్నారు. బాగా చదువుకున్నా.. . నిజంగా నాయకుడు అంటే అలా ఉండాల్సిందే అని ప్రజల మనసుల్లో ముద్ర వేసినట్లుగా మారేందుకు ప్రయత్నించారు. కానీ అది కూడా తనదైన పద్దతిలోనే. దూకుడుగా మాట్లాడినా.. దౌర్జన్యంగా చేసినట్లుగా అనిపించినా… తప్పును ఎదుర్కొనే విషయంలో తగ్గనని నిరూపించేలాగానే మారిపోయారు. తాను నీట్ గా షేవ్ చేసుకున్నంత మాత్రాన చేతకానివాడిని కాదని.. తన వేష, భాషలే కాదు.. మాటలను కూడా మార్చి నిరూపించారు. ఒకప్పుడు చిన్న మాట తడబడితే… ట్రోల్ చేయడానికి వేల మంది రెడీగా ఉండేవారు. ఇప్పుడు లోకేష్ వారికి అలాంటి అవకాశం ఇవ్వ లేదు. నారా లోకేష్ ఇమేజ్ ను.. యువగళం పాదయాత్ర పూర్తిగా మార్చేసింది. కుప్పం నుంచి ప్రారంభమైన యాత్ర సాఫీగా సాగలేదు. అనేక ఆటంకాలు సృష్టించి… యువగళానికి ఓ క్రేజ్ తీసుకు వచ్చారు జగన్ రెడ్డి. చివరికి మైకులు.. నిలబడేందుకు ఉపయోగించుకునే స్టూల్ కూడా లాగేసుకున్నారు. కానీ యువగళాన్ని మాత్రం ఆపలేదు. చివరికి చంద్రబాబును అరెస్ట్ చేయడంతో రెండు నెలల విరామం పాదయాత్రకు వచ్చింది. అయితే ఆ సమయంలోనూ ఢిల్లీలో వ్యవహారాలను చక్క బెట్టారు. ఆయన నాయకత్వ సామర్థ్యంపై పార్టీలో మరింత నమ్మకం పెరిగింది. ఇప్పుడు లోకేష్.. అన్నింటినీ అధిగమించిన నాయకుడు.. ప్రతీ దానికి ధైర్యంగా సమాధానాలిచ్చిన నాయకుడు.. తాను చెప్పింది చేస్తానని ధైర్యంగా చెప్పగలిగే నాయకుడ్నని శిలాఫలకాల సాక్షిగా ఆవిష్కరించుకున్న నాయకుడు…
ఇప్పటి వరకూ పాదయాత్రలు వేరు – యువగళం పాదయాత్ర వేరు !
పాదయాత్ర ఎప్పుడూ సింపుల్ కాదు.. ఎవరు చేసినా ఆ ఎఫెక్ట్ ను తక్కువ అంచనా వేయలేరు. నేరుగాప్రజలతో మమేకం కావడం కన్నా ఓ రాజకీయ నాయకుడికి మేలు చేసే మరో రాజకీయ కార్యక్రమం ఉండదు. అందుకే స్వాతంత్ర్య పోరాటాల నుంచి పాదయాత్రలు అనేవి ఓ ప్రత్యేకమైన రాజకీయ వ్యూహంగా మారిపోయాయి. గత ముఫ్పై ఏళ్లుగా ప్రతీ ఏడాది ఎన్నికలు వస్తున్నాయంటే.. ఎవరో ఒకరు పాదయాత్రలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పాదయాత్రల ద్వారా విజయాలు వస్తాయా రావా అన్న సంగతి పక్కన పెడితే.. తాను వస్తే సమస్యలు పరిష్కరిస్తానన్న భరోసా ఇవ్వగలిగితే.. ప్రజల ఆమోదం పొందవచ్చు. మాస్ లీడర్‌గా ప్రజల్లో స్థానం సంపాదించుకోవచ్చు. టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర అదే కోవలో జరిగింది. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి అభ్యర్థులు మాత్రమే పాదయాత్ర చేశారు. నారా లోకేష్ సీఎం అభ్యర్థి కారు. ఆయన ప్రజల కోసమే అడుగులు ముందుకేశారు. టీడీపీ యువనేతగా.. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన నేతగా లోకేష్ అడుగులు వేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకే అడుగు వేశారు. ఆయనకు ఎదురైన సవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతున్న రాష్ట్రంలో రోడ్డు మీద రాజకీయ కార్యకలాపం చేయడమే ప్రభుత్వానికి ెద్ద తప్పు. రాష్ట్రంలో రోడ్డు మీదకు రాని వర్గం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు రంగంలోకి దిగారు.
కుట్రలను చేధిస్తూ ముందడుగు వేసిన లోకేష్
వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఎలా గెలవాలని అనుకుంటుందో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు ఓ స్పష్టత ఉంది. పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా ప్రభుత్వాధినేత .. టీనేజ్ లో ఉన్నప్పుడే ఏకంగా ఎస్ఐనే కొట్టి.. సెల్ లో వేశారు.. ఇప్పుడు ఆయనే పాలకుడు.. ఇక ఆయన వికృత మనస్థత్వానికి పోలీస్ పవర్స్ తోడైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత నాలుగున్నరేళ్లుగా ప్రజల కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇక ఎన్నికల సమయంలో ఎలా వినయోగిస్తారో చెప్పాల్సిన పని లేదు. వాటిని ఎదర్కొగలిగే శక్తి.. ధైర్యం.. మాకున్నాయని విపక్షాలు భరోసా ఇవ్వగలగాలి. అప్పుడే్ ప్రజల బయటకు వచ్చి అండగా నిలుస్తారు. ఇప్పుడు నారా లోకేష్ అలాంటి భరోసాను ప్రజలకు ఇచ్చారు. ప్రతి వర్గంతోనూ మమేకం అయ్యారు. బ్రహ్మరాక్షసి లాంటి రాజకీయం ఆయనను ఎప్పటికప్పుడు చుట్టుముట్టినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆయనపై అటు రాజకీయంగా.. ఇటు వ్యక్తిగతంగా దాడి చేయడానికి వ్యవస్థల్ని సైతం వాడుకుంది ప్రభుత్వం. కానీ మైక్ లాక్కో గలిగింది..స్టూల్ లాక్కోగలిగింది. కానీ లోకేష్ సంకల్పాన్ని మాత్రం కాదు. చివరికి చంద్రబాబును అరెస్టు చేసి… యువగళాన్ని నొక్కేశామనుకున్నారు. కానీ రెండు నెలలు మాత్రమే ఆపగలిగారు. రౌడీ రాజకీయాలు కాదని.. బతుకుల్ని బాగు చేసుకునే రాజకీయాలు చేసుకుందామని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజల మద్దతు పొందారు. దానికి సాక్ష్యమే యువగళం.. నవశకం సభ.
సాఫీగా వచ్చిన సక్కెస్ కాదు – ఎదురొడ్డి నిలబడి గెలుచుకున్న విజయం
సాఫీగా వచ్చే ఏ విజయానికైనా జీవిత కాలం తక్కువే. కష్టపడి .. మెట్టు మెట్టుగా ఎక్కి సాధించుకున్న విజయమే స్థిరంగా ఉంటుంది. మానసిక ధైర్యాన్నిస్తుంది. ఆ విజయానికి మనం అర్హులమనే అభిప్రాయాన్ని…నమ్మకాన్ని కలిగిస్తుంది. పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యి.. వారి అభిమానాన్ని సంపాదించుకుని.. తనపై ఇప్పటి వరకూ ఉన్న అనుమానాలను పటాపంచలు చేసిన లోకేష్ విజయం కూడా అలాంటిదే. ప్రజల మనసుల్లో సుదీర్ఘంగా ఉండేదే. ఇప్పుడు లోకేష్ తిరుగులేని నాయకుడు . లోకేష్ సామర్త్యం.. ప్రతిభపై ఆయన గురించి తెలిసిన వారు ఎవరికీ అనుమానాల్లేవు. కానీ ప్రజాస్వామ్యంలో గుర్తించాల్సింది ప్రజలు. వారికి లోకేష్ తాను ఎంత సమర్థుడ్నో చూపించాల్సి ఉంటుంది. తాను మంత్రిగా ఉన్నప్పుడు పనితీరు మాత్రమే చూపించారు.. కానీ ఆ పని తీరు రాజకీయంగా ప్లస్ కాదు.. రాజకీయం వేరే. ఇప్పుడు లోకేష్ ఆ రాజకీయంలోనూ తాను దిట్ట నిరూపించుకున్నారు. పాదయాత్ర పూలబాట మాత్రం కాదు.. ఓ వైపు దాడులు.. మరో వైపు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు.. మరో వైపు శారీరక శ్రమ.. ఇలా అన్నింటినీ ఓర్చుకుని.. పాదయాత్ర చేశారు. అలాంటి అడ్డంకులు అధిగమించినప్పుడే నిజమైన విజయం లభిస్తుంది. అలాంటి విజయాన్ని లోకేష్ అందుకున్నారు.
ఏపీకి దశ – దిశ చూపించాల్సిన బాధ్యత
నారా లోకేష్ పాదయాత్ర ద్వారా తాను ఏపీ భవిష్యత్ లో తిరుగులేని నాయకుడ్ని నిరూపించారు. ఆయన వయసు ఇప్పుడు 40 ఏళ్లు మాత్రమే. రాష్ట్రానికి ఆయన దశ..దిశ చూపించే నాయకుడిగా మారారు. రాష్ట్రంలో ఓ భారీ రాజకీయ శక్తిగా మారారు. ఏపీ లో ఇప్పుడు రోడ్డెక్కని వర్గం లేదు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. అంగన్ వాడీలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రోడ్డెక్కితే వారికి తన పవర్ చూపించాలని ఉబలాటపడే సీఎం తన ముందు ఉన్నారు. ఎవరైనా రాజకీయాలు చేస్తూంటే.. చీప్, సిల్లీ కుట్రలు చేసే సీఎం మన ముందు ఉన్నారు. సొంత రాష్ట్ర సంపదను.. సొంత ఖాతాలకు మళ్లించే సీఎం ఉన్నారు. ప్రజల మీద ప్రభుత్వం ఇప్పటికే రూ. పది లక్షల కోట్ల అప్పు పెట్టింది. కానీ ఒక్క రూపాయి సంపదను సృష్టంచలేదు. పేద ప్రజల వద్ద నుంచి మద్యం రేట్లు పెంచి వారి కుటుంబాలను ప్రభుత్వం దివాలా తీయించింది. వారి రక్తాన్నిపీలుస్తోంది. ఇక పెరగని చార్జీలు లేవు. ఆస్తి పన్ను.. ఆస్తి విలువతో పాటు పెంచుతూ పోతున్నారు. మధ్య తరగతి ప్రజల్ని పూర్తిగా లూటీ చేస్తూ.. కొంత వరకూ .. తమ ఓటు బ్యాంకుకు పంచుతూ.. వారు ఓట్లు వేస్తే చాలన్నట్లుగా పాలన సాగుతోంది. అంటే.. అందరి దగ్గర దోచుకుంటూ.. కొంత మందికి పంచుతూ పాలన సాగుతోంది. మరో వైపు ఓ కులాన్ని ఆర్థికంగా కుంగ దీయాలన్న కారణంగా తీసుకున్న నిర్ణయాలు అన్ని కులాలను ఆర్థికంగా కుంగ దీశాయి. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల జీవితాల్ని తల కిందులు చేస్తున్నాయి. మరో వైపు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. వైసీపీ చోటా నాయకుడు కూడా.. ఇప్పుడు పోలీసుల్ని బెదిరించే వారైపోయారు. ఓ వైపు ప్రభుత్వం దోపిడి.. మరోవైపు వైసీపీ నేతల దౌర్జన్యాలతో ప్రజలు సతమతమయిపోతున్నారు. నోరు తెరిస్తే గ్యారంటీ ఉండదని.. గుడ్ల నీరు కక్కుకుంటూ ఉండిపోతున్నారు. ఇలాంటి ప్రజలందరికీ లోకేష్ తన పాదయాత్ర ద్వారా భరోసా ఇచ్చారు. తానున్నానని సందేశం పంపారు.
ఇప్పుడు ప్రజల ముందు విలన్ ఉన్నాడు. ఆ విలన్ ఎదుర్కొనే హీరో కూడా తనను తాను ఆవిష్కరించుకున్నారు. తండ్రిని కేసుల బారి నుంచి కాపాడుకున్న వైనం… విలన్ నుంచి బాధితుల్ని కాపాడుతున్న వైనం చూసి ప్రజలు కూడా సంతృప్తి చెందారు. అంతిమంగా ఏపీ రాజకీయాల్లో పాదయాత్ర ఓ హీరోను ఆవిష్కరింప చేసిందని అనుకోవచ్చు. ఇది మా నోటి వెంట వచ్చే పొగడ్త కాదు.. లోకేష్‌తో పాదయాత్ర చేసిన తీరు.. రాజకీయాల్ని ఎదుర్కొంటున్న వైనం… ప్రజాసమస్యల పట్ల అవగాహన… అన్నింటినీ పరిశిలిస్తే ఎవరికైన అనిపిచే మాట.
ఇప్పుడ పడింది.. ఒకటే అడుగు.. ప్రజానాయకుడిగా లోకేష్ వేయాల్సిన అడుగులు లెక్కలేనన్ని ఉన్నాయి.. ఆల్ ది బెస్ట్ లోకేష్ .