“ఏదైనా ఒకటి అంటుకుంటే ఆర్పడం కష్టం… అది మంటలైనా .. రాజకీయ పతనమైనా సరే” ఇది భారతీయ జనతా పార్టీ విషయంలో నిజం కావడానికి ఎంతో దగ్గరలో లేదని కర్ణాటక ఎన్నికల తర్వాత ఎక్కువ మంది అభిప్రాయపడతున్నారు. దీనికి ఎక్కువ మంది చెబుతున్న ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్సీకరణ కావడమే. దేశంలో బీజేపీ ప్రత్యేకంగా లేదని మరో కాంగ్రెస్ రూపమేనని గత కొన్నాళ్లుకాగ అవగతమవుతూనే ఉంది. కర్ణాటక ఎన్నికలతో ఆ కాంగ్రెస్ రూపం పతనం కూడా ప్రారంభమయింది. ఇక్కడ బీజేపీ అసలు సమస్య కాంగ్రెస్ ప్రధాన లక్షణాలు అయిన వ్యక్తి పూజ.. హైకమాండ్ పాలన.. ఒక నేతపై ఆధారపడటం వంటివి. అలాంటివి ఎప్పటికైనా కాళ్ల కిందకు నీరు తెస్తాయి. ఇప్పుడు బీజేపీకి అదే జరుగుతోంది. గతంలో ఏదైనా ఓ రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే ఆ పార్టీ పనైపోయిందని గతంలో ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ ఇప్పుడు కర్ణాటకలో ఓడిపోతే అంత కంటే ఎక్కువగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే దీనికి సరైన ప్రాతిపదిక ఉంది మరి.
మోదీ పోలరైజేషన్ ప్లాన్ ఇచ్చిన షాక్!
2019లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. జేడీఎస్ కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలో ఉంది సీఎంగా కుమారస్వామి ఉన్నారు. రెండు పార్టీలు కలిసి అంతకు ము పోటీ చేసిన కొన్ని ఉపఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాయి. భారీ మెజార్టీలు వచ్చాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే దుమ్మురేపడం ఖాయమనుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో పవర్ ను కర్ణాటక ప్రజలు పెంచుతారని అనుకున్నారు. కానీ జరిగింది వేరు. మొత్తం కర్ణాటకలో ఉన్న 28 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ 25 గెల్చుకుంది. మరో చోట సినీ నటి సుమలత ఇండిపెండెంట్ గా బరిలోకి నిలబడితే బీజేపీ మద్దతు ఇచ్చింది. అంటే మొత్తం 28 పార్లమెంట్ స్థానాల్లో 26 బీజేపీకి దక్కాయి. రెండు మాత్రమే అందులో ఒకటి కాంగ్రెస్.. మరొకటి జేడీఎస్‌కు దక్కాయి. మొత్తంగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూస్తే కాంగ్రెస్ జేడీఎస్ కూటమికి 170 స్థానాల్లో మెజార్టీ ఓట్లు వచ్చాయి. అంటే ఇతర పార్టీలు కూటమిగా కట్టినా బీజేపీకి ఏకపక్ష విజయం దక్కింది. అదే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తున్నారు. జేడీఎస్ , కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. రెండింటికీ కలిపి దాదాపుగా 160 సీట్లు వచ్చాయి. ఇక్కడ పొత్తుల్లేకుండానే బీజేపీపై ఆా ఆధిపత్యం ప్రదర్శించారు. ఓటర్లు ఓట్లేశారు. అంటే.. భారత ప్రజాస్వామ్యంలో ఓటర్లు.. ఏ ఎన్నికలకు ఓట్లేస్తున్నామో చక్కగా గుర్తుంచుకుంటున్నారు. ఆలోచిస్తున్నారు. గుడ్డిగా వేసేయడం లేదు. ఆ విషయం కర్ణాటక ఎన్నికల ఫలితాలతో నిరూపితమయింది. అయితే ఇదేమీ గుర్తించకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ పాలకుడిగా తనకు ఉన్న ఇమేజ్ ను కర్ణాటక ఎన్నికల్లో వాడేసుకోనాలని ప్రయత్నించారు. విస్తృతంగా పర్యటించారు. తనను చూసి ఓటేయాలన్నట్లుగా విజ్ఞప్తులు చేశారు. స్థానిక అంశాలు తాను మాట్లాడితే అంత అతకదని.. పోలరైజేషన్ అంశాలనే టాపిక్స్ గా తీసుకున్నారు. భజరంగ్ దళ్ నిషేధాన్ని.. ది కేరళ స్టోరీని.. తనను కాంగ్రెస్ నేతలు తిట్టిన విషయాన్ని ప్రచారాస్త్రాలుగా మార్చారు. ఇక్కడే మోదీ ఓటర్ల అంచనాలను అంచనా వేయడంలో విఫలం అయ్యారని అనుకోవచ్చు. లఆయన ప్రచారం కన్నా.. తాము రాష్ట్ర అసెంబ్లీకి ఓట్లేస్తున్నామన్న విషయాన్ని ప్రజలు పరిగణనలోకి తీసుకున్నారు. ఇక్కడ మోదీకి మొదటి వైఫల్యం.. అంతే కాదు.. భవిష్యత్‌లో ఆయన నేర్చుకోవాల్సిన చాలా కీలకమైన విషయాలను.. ఈ ఓటమి ఆయన ముందు పెట్టింది.
కాంగ్రెస్ తరహాలోనే హైకమాండ్ పార్టీగా మారిన బీజేపీ !
కర్ణాటక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతా తానై వ్యవహరించారు. ఓట్లు తన కోసమే వేయాలన్న అబిప్రాయాన్ని కల్పించడానికి ప్రయత్నించారు. అవి రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు. ఢిల్లీలో కాకుండా బెంగళూరులో ఉండే ప్రభుత్వాన్ని వారు ఎన్నుంటున్నారు. అయితే ఓ మోదీ రాజకీయ కారణాలతో మొత్తం తన భుజాన వేసుకున్నారు. గల్లీ గల్లీలో తిరిగారు. ఫలితం ఎలా ఉందన్న సంగతి పక్కన పెడితే ఆయన బీజేపీ విషయంలో తానే ఏకైక స్టార్ క్యాంపెయినర్ అనే భావనను బలంగా వ్యాప్తి చేశారు. అదొకటే కాదు అలా చేయడం వల్ల ఓటముల ముద్ర తనపై పడతాయి. అయినప్పటికీ సాహసం చేశారు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు “హైకమాండ్” పార్టీ. కాంగ్రెస్ తరహాలో ఏక వ్యక్తి మీద ఆధారపడుతున్న పార్టీ. నిజంగా ఆ పార్టీ అలా ఆధారపడేలా తీసుకువచ్చింది.. బీజేపీ మోదీ, అమిత్ షాలే అనుకోవచ్చు. పార్టీలో వీరి పెత్తనం పెరిగిన తర్వాత.. చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. కానీ ప్రజల్లో పాతుకుపోయిన నేతలను వేళ్ల మీదే్ లెక్కబెట్టవచ్చు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ లాంటి వారికి ప్రజల్లో పలుకుబడి ఉంది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ సీఎంకు జాతీయ స్తాయిలో పలుకుబడి ఉందో విశ్లేషిస్తే.. నేతల్ని మోదీ, షాలు ఎదగనీయలేదని అర్థం చేసుకోవచ్చు. పార్టీలో మోదీ కంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు. ప్రజల్లో పలుకుబడి ఉన్న వాళ్లు ఉన్నారు.కానీ ఇప్పుడు వారెవరికీ పార్టీలో ప్రాధాన్యత లేదు.
బలమైన నేతలను ప్లాన్డ్ గా నిర్వీర్యం చేసేసిన మోదీ !
యోగి ఆదిత్యనాథ్ .. బీజేపీ జాతీయ స్థాయి పదవిని చేపడతారో లేదో తెలియదు కానీ ఆయన ప్రభావాన్ని యూపీ నుంచి బయటకు రాకుండా చేసేందుకు అమిత్ షా, మోదీ ప్రయత్నిస్తున్నారనేది బహిరంగరహస్యం. హిమంత బిశ్వ శర్మను ఈశాన్య రాష్ట్రాలకు పరిమితం చేస్తున్నారు. ఇక గుజరాత్ తరహాలోనే మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కానీ ఆయన ప్రభావం మధ్యప్రదేశ్ దాటి బయట కనిపించకుండా చేశారు. ఇ్పపుడు మధ్యప్రదేశ్ లోనూ ఆయనను పక్కన పెడతారన్న ప్రచారం జరుగుతోంది. అందులో సందేహం లేదు. ఇవాళ కాకపోతే.. రేపైనా శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం పదవి నుంచి దిగిపోక తప్పదు. మరి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇక కీలక నేతలెవరున్నారు ?. అంతా తమ రాష్ట్రాల్లో పాలనను బీజేపీ హైకమాండ్ చేతుల్లో పెట్టిన వాళ్లే. మోదీ , షా అవకాశం ఇస్తే మాట్లాడుతారు లేకపోతే లేదు. గుజరాత్ సహా అన్ని చోట్లా జరుగుతోంది ఇదే. ఇలాంటి పరిస్థితుల వల్ల ఆయా రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే తామే ప్రచారానికి వెళ్లాల్సి వస్తోంది. కర్ణాటకలో జరిగింది కూడా అదే . బీజేపీ అదికారంలోకి రాక ముందు మోదీ, షాల కంటే సీనియర్లు పార్టీలో చక్రం తిప్పారు. రాజ్ నాథ్ సింగ్, గడ్కరీ అద్యక్షులుగా వ్యవహరించి జాతీయ స్తాయిలో కీలక నేతలయ్యాయుర. ఇప్పుడు వారి పరిస్థితి ఏమయింది ? వారి రాజకీయ జీవితం ఏమయింది అనేది చెప్పాల్సిన పని లేదు. ఇక దక్షిణాదిలో కీలక నేతగా ఉన్న వెంకయ్యనాయుడ్ని ఉపరాష్ట్రపతిని చేసి.. రాజకీయాల నుంచి తప్పించారు. ఆ పదవి అయిపోయిన తర్వాత ఆయనను పట్టించుకోవడం మానేశారు. ఇలాంటినేతలు ఎంతో మంది బీజేపీ కోసం ఉపయోగించుకోకుండా పక్కనపెట్టేశారు మోదీ, షాలు. అందుకే ఇప్పుడు బీజేపీలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీ మాత్రమే కనిపిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో అందరూ డమ్మీలే.
కాంగ్రెస్ తనను తాను ఎలా నిర్వీర్యం చేసుకుదో బీజేపీ కూడా అంతే !
నిదానికి ఇదంతా కాంగ్రెస్ పార్టీ రాజకీయం. కాంగ్రెస్ హైకమాండ్.. రాష్ట్ర స్థాయిలో కీలక నేతల్ని ప్రజా నాయకులుగా ఎదగనిచ్చేందుకు అవకాశం కల్పించేది కాదు. నోరెత్తలేని నాయకుల్ని సీఎంలుగా చేసేవారు. కోపం వస్తే తప్పించేవారు. అయితే ఇలాంటి చర్యల వల్ల.. కాంగ్రెస్ బలహీనపడింది. కాంగ్రెస్ అనేక శాఖలుగా విడిపోయింది. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ బలహీనంగా ఉంది కానీ.. కాంగ్రెస్ అవశేష పార్టీలు మాత్రం బలంగా ఉన్నాయి. దీనికి కారణం హైకమాండ్ పాలిటిక్సే అని చెప్పాల్సిన పని లేదు. కళ్ల ముందు కాంగ్రెస్ పార్టీ దుస్థితి కనిపిస్తున్నా.. బీజేపీ, షాలు పార్టీపై పట్టు కోసం అదే ఫార్ములాను ప్రయోగించారు. ప్రయోగిస్తున్నారు. అందుకే వారికి ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. బీజేపీలో వయసు నిబంధనల చూపి చాలా మందిని సైలెంట్ చేసేశారు. కర్ణాటకలో యడ్యూరప్పను పక్కన పెట్టడానికి కూడా అదే కారణం చూపారు. నిజానికి నరేంద్రమోదీ వయసు 73 ఏళ్లు. ఆయన శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చు కానీ.. రూల్ రూలే. వెంకయ్యనాయుడు ఇప్పటికీ చాలా యాక్టివ్ గా ఉంటారు. మరి ఆయనను ఎందుకు పక్కన పెట్టారు. ఉమాభారతి వంటి వారిని ఎందుకు పట్టించుకోవడం లేదు. పార్టీలో అగ్రనేతల్ని పక్కన పెట్టడానికి వయసు నిబంధన తెచ్చారు. కానీతమకు అన్వయించడానికి మోదీ , షాలు సిద్ధంగా లేరు.తాము రిటైరవుతామన్నా.. పార్టీ అంగీకరించలేని స్థితికి తీసుకు వచ్చారు. ఇప్పుడు మోదీ కాకపోతే ఎవరు అనే పరిస్థితి వస్తుంది. ఇది కావాలనే మోదీ, షా అంతా చేశారు. కానీ.. తర్వాత పరిస్థితి ఏమిటన్నది మోదీ, షాలు ప్లాన్ చేసుకోలేకపోయారు. ఊహించలేకపోయారు. కర్ణాటక ఎన్నికలతో ఆ విషయం బయటపడింది.
కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ నాయకత్వం గాంధీ వారసుల రూపంలో ఉంది మరి బీజేపీకి ?
ఇప్పటికిప్పుు చూస్తే.. మోదీ ఇమేజ్ కు కర్ణాటక ఫలితాలు తెచ్చే ముప్పేమీ ఉండదు. ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. అందులో మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ కీలకం.త ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే మోదీ ఎదురులేని వ్యక్తి అనే విశ్లేషణలు వస్తాయి. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్‌లలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలను ఎదుర్కొంటోంది. వాటిని ఎలా అనుకూలంగా మల్చుకోవాలో మోదీ, షాలకు తెలుసు అయితే మోదీ కర్ణాటక ఎన్నికల ఫలితాలతో నేర్చుకోవాల్సింది.. తెలుసుకోవాల్సింది ఏమింటే… హైకమాండ్ పాలిటిక్స్‌కు తాము చెక్ పెట్టాలని.. పార్టీలో తాము కాదు.. రాష్ట్ర స్థాయిలో బలమైన నేతల్ని రెడీ చేసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి కీలక అడుగులు వేస్తారా అన్నదాన్ని బట్టి బీజేపీ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అనుకోవచ్చు. కానీ మోనార్క్ లాగా మారిన రాజకీయ నేతలకు ఇవి పట్టవు. అందుకే బీజేపీ పతనం దిశగా ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత నిర్వీర్యమైపోయిన వారికి గాంధీల వారసత్వం ఓ నాయకుడ్నో.. నాయకురాలినో అల్టర్ నేటివ్ గా ఉంచుతోంది. కానీ బీజేపీకి మోదీ తర్వాత ఎవరు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. బీజేపీ ఈ పరిస్థితిని కవర్ చేసుకోకపోతే.. మరో కాంగ్రెస్ గా మారడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు.