వరద బాధితుల కోసం ఈనాడు రూ. ఐదు కోట్ల విరాళం ప్రకటించింది. అంతే కాదు తమ పాఠకులు కూడా సాయం చేయాలని పిలుపునిచ్చారు. అంతే కాదు ఐదు కోట్లను రిలీఫ్ ఫండ్కకు జమ చేశారు. ఫండ్ అంతా సమకూరిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాలా లేకపోతే సొంతంగా ఏదైనా పనులు చేయాలా అన్నది నిర్ణయించే అవకాశం ఉంది.
విపత్తులు వచ్చినప్పుు ఈనాడు ఇలా విరాళాలు సేకరించి..దానికి పెద్ద మొత్తంలో తాము జమ చేసి ఇళ్లు, స్కూళ్లు విపత్తులు వచ్చిన ప్రాంతాల్లో కట్టించిన సందర్భాలు ఉన్నాయి. ఒడిషా, కేరళల్లోనూ ఇలా కట్టించారని అక్కడి ప్రభుత్వాలు గుర్తు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఖమ్మం , విజయవాడల్లో వచ్చిన వరదలో అనేక మంది నష్టపోయారు. ఈ క్రమంలో ఈనాడు కూడా ముందడుగు వేసింది. రూ. ఐదు కోట్లు ఇవ్వడమే కాకుండా .. విరాళాలు సేకరిస్తోంది.
మామూలుగా ఈనాడు రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇస్తే.. పత్రికలో ప్రచురిస్తారు. ఓ నిర్దిష్టమైన ఎమోంట్ ఇచ్చిన ప్రతి విరాళం ఇచ్చిన వారు ప్రచురిస్తారు. ఈనాడులో పేరు చూసుకోవడానికైనా చాలా మంది విరాళాలిస్తారు. ఈ కోణంలో ఇంకా ఎక్కువ విరాళాలు వస్తాయేమో చూడాలి.
మరి ప్రతి దానికి ఈనాడు కన్నా తామే ఎక్కువ అని చెప్పుకునే సాక్షి ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాల్సి ఉంది. జగన్ ప్రకటించిన రూ. కోటితో ఫండ్ ప్రారంభిస్తే.. నవ్వుల పాలవుతుంది. సొంతంగా ఏమైనా చేస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.