జగన్ రెడ్డి మామూలు దోపిడీ దారుడు కాదు.. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఎలా అడ్డగోలుగా దోచుకున్నారో అన్నీ సీబీఐ చార్జిషీట్లలో ఉంది… కావాలంటే మీరే చూసుకోండి అని ఈనాడు పత్రిక విశ్లేషణాత్మకంగా మళ్లీ మళ్లీ ప్రజల ముందు పెడుతోంది. జగన్ పై అక్రమాస్తుల కేసులో విచారణలు జరగడం లేదు. రకరకాల పిటిషన్లు వేసి.. ఆపుకుంటున్నారు. ఇప్పటికి పధ్నాలుగేళ్లు దాటిపోయింది. చార్జిషీట్లు వేసి దశాబ్దం దాటిపోయింది. ఇంత వరకూ ట్రయల్ ప్రారంభం కాలేదు. ఇది న్యాయవ్యవస్థలో ఉన్న లోపాన్ని బయట పెడుతోంది. బలవంతులైన నేరస్తులు విచారణను ఎలా ఆలస్యం చేయగలరో చూపించినట్లయింది.
ఇలా దశాబ్దాలు గడిచిపోవడం వల్ల… ఓ తరం.. ఈ నేత అవినీతిని గుర్తు చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారికి ఓట్లేసి.. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితి రిపీట్ కాకుండా ఉండటానికి జగన్ రెడ్డి దోపిడిని ప్రజల ముందు ఉంచుతోంది ఈనాడు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే ఇలా చెలరేగిపోతే.. ఇక పీఠంపై ఉన్నప్పుడు ఇంకెంతగా దోపిడీ చేసి ఉంటారో ఆలోచించుకోవాలని ప్రజలకు చాయిస్ ఇస్తున్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా ముఫ్పై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన పాలనలో ప్రజలు ఎలా నిలువుదోపిడికి గురయ్యారో గుర్తు చేస్తోంది.
జగన్ రెడ్డి ప్రతీ సభలో… ఈనాడు గురించి ఏడుస్తూనే ఉంటారు. ఆపేపర్ చదవొద్నది..టీవీలు చూడొద్దని గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటారు. కానీ అందులో వచ్చేవి అబద్దాలని మాత్రం చెప్పలేవు. ప్రభుత్వం తరపున ఫ్యాక్ట్ చెక్ అని పేరు పెట్టి… మిస్ లీడింగ్ అంటూ కవర్ డ్రైవ్ లు వేస్తూంటారు. అంటే ఈనాడు చెప్పే సమాచారం మత్తం కరెక్టే.. కానీ… తప్పు అని చెప్పే తెలివితేటలు చూపిస్తున్నారన్నమాట. లీడింగా.. మిస్ లీడింగా అన్నది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు… కానీ ఈనాడు మాత్రం ఫుల్స్వింగ్లో జగన్ రెడ్డి పై మీడియా పరంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది