వేజ్ బోర్డు ప్రభావంతో తల్లడిల్లిపోయిన సంస్థల్లో `ఈనాడు` ప్రధమ స్థానంలో ఉంటుంది. వేజ్ బోర్డు అప్లయ్ చేస్తే.. ఉద్యోగులకు భారీ స్థాయిలో వేతనాలు పెంచాల్సివస్తుంది. అందుకే…. ఈనాడుని `రామోజీ ఫిల్మ్‌సిటీ`కి షిఫ్ట్ చేసేశారు. అక్కడైతే.. `గ్రామం` కోటాలో సిబ్బందికి ఈస్థాయిలో వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అందుకే… హుటాహుటిన ఈనాడు సిబ్బంది మొత్తం రామోజీ ఫిల్మ్‌సిటీకి షిఫ్ట్ అయిపోయారు. అయినా వేజ్ బోర్డు భారం తీరలేదు. అందుకే చాలామందిని బలవంతంగా వాలెంటరీ రిటైర్మెంట్ లేఖ చేతిలో పెట్టేశారు. అందుకోసం.. భారీ ప్యాకేజీలు ప్రకటించారు. ఈ ప్రభావం సెక్యురీటీపై పడింది. ఇప్పుడున్న సెక్యురీటీకి కనీసం నెలకు అరవై వేల జీతం చెల్లించాల్సివచ్చింది. అందుకే… వాళ్లకూ రిటైర్మెంట్ లేఖలిచ్చేసి, థర్డ్ పార్టీ సెక్యురీటీ పేరిట.. వాళ్ల కోసం మళ్లీ కొత్త పోస్టులు సృష్టించి నెల జీతం రూ.10 వేల నుంచి రూ.15 వేలకు ఫిక్స్ చేశారు. అంటే సెక్యురీటీ గార్డులు ఈనాడుకి రాజీనామా చేసి, మళ్లీ ఈనాడులోనే తక్కువ జీతానికి, అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిన చేరారన్నమాట.
ఈ మతలబు గ్రహించిన సెక్యురిటీ సిబ్బంది కోర్టుని ఆశ్రయించారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో పక్కాగా ఉండే ఈనాడు… కోర్టులో గట్టిగా తన వాదన వినిపించింది. దాంతో సెక్యురీటీ గార్డులు వేసిన కేసు కొట్టివేశారు. తమపై కోర్టుకెక్కిన సెక్యురిటీపై ఈనాడు సీరియెస్ అయ్యింది. దాంతో వాళ్లందరి పోస్టులూ మళ్లీ ఊడాయి. జీతాలన్నీ సెటిల్ చేసి, అర్థాంతరంగా వాళ్లని ఉద్యోగాల నుంచి తప్పించింది యాజమాన్యం. రాత్రికి రాత్రే మళ్లీ కొత్త సిబ్బందిని నియమించుకుంది. ఈ వ్యవహారమంతా ఎంత గప్ చుప్ గా సాగిందంటే.. ఒకరిద్దరు కీలక సభ్యులకు తప్ప… ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అదీ.. ఈనాడు తెలివితేటలంటే. అయితే అన్ని మీడియా సంస్థలు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ నే వాడుకుంటున్నాయి అనే విషయం ఇక్కడ గమనార్హం