ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. విచ్చలవిడిగా ప్రచార కార్యక్రమాలకు వెచ్చిస్తోంది. కట్టని.. పెట్టని వాటికి శంకుస్థాపనలు చేస్తూ.. ఆ పేరుతో ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తోంది. గట్టిగా ఐదు కోట్లు కూడా పంపిణీ చేయని పథకాలకు పది కోట్లకపైగా ప్రకటనలు ఇస్తోంది. ఇందులో ఈనాడుకూ ఇప్పటి వరకూ ప్రకటనలు ఇచ్చేవారు. నిబంధనల ప్రకారం.. అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న పత్రికకు ప్రకటనలు ఇవ్వాల్సిందే. ప్రజాధనాన్ని ఖర్చు చేసెటప్పుడు కొన్ని నిబంధనలు పాటించాలి.
ఈ కారణంగా తన పత్రికకు ప్రకటనలు ఇవ్వాలంటే.. ఈనాడుకూ ఇవ్వాల్సిందే. ఈనాడుకు అరకొరగా ఇస్తూ.. తమ పత్రికలు, అస్మదీయ పత్రికలు, చానళ్లకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నారు. కనీసం రూ. ఐదు వందల కోట్లు సాక్షి ఖాతాకు చేరి ఉంటాయని భావిస్తున్నారు. ఓ వైపు ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారడం.. ప్రజల సొమ్మ విషయంలో ఏ మాత్రం బాధ్యత లేనట్లుగా వ్యవహరించంతో .. ఏపీ ఆర్ధికంగా దివాలా తీసిన విషయంలో తమకూ కొంత ప్రకటనలు వచ్చాయని అనుకోకూడదని ఈనాడు యాజమాన్యం డిసైడయినట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ఇతర అంశాలపై ఈనాడు తీవ్ర స్థాయిలో పోరాడుతోంది. ఇలాంటి సమయంలో .. ప్రజాధనంతో ఇచ్చే తప్పుడు సమాచార ప్రకటనలను తమ పత్రికలో వేయడం మంచిది కాదని నిర్ణయానికి వచ్చినట్లుగా మీడియా వర్గాలు చెబుతున్నాయి. అందుకే.. మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన మూడో సారి చేయడానికి జగన్ సిద్ధమయ్యారు..దానికి సంబందించిన ప్రకటన ఈనాడు పేపర్లో రాలేదు. సాక్షిలో మాత్రేమే వచ్చింది.