తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది, మోడీ పట్ల కూడా అనుకూలతను ప్రదర్శిస్తుంది.. అని ‘ఈనాడు’కు పేరు. అయితే వారి అనుకూలత మాత్రమే కాదు, వీరిని వ్యతిరేకించే రాజకీయ పక్షాల పట్ల కూడా వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది ఈ మీడియా వర్గం. చంద్రబాబు, మోడీ అనుకూలంగా ఉంటూ.. జగన్, కాంగ్రెస్ పార్టీ వంటి వారి విధానాలను, తీరును ఏపకక్షంగా విమర్శించుకోవడం మాత్రమే కాదు, వారి వ్యతిరేక వార్తలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం మాత్రమే కాదు.. తెలుగుదేశం, బీజేపీ మినహా దేశంలోని మిగతా రాజకీయ పార్టీలన్నింటి విషయంలో ‘ఈనాడు’ లో వ్యతిరేక కథనాలు రావడం, వారిని తక్కువ చూసే ప్రయత్నాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పత్రికలో!
యూపీలో సమాజ్ వాదీ పార్టీని తక్కువ చేసి చూపడం, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను చేతగాని వాడిగా చూపడం… ‘ఈనాడు’కు అలవాటు గా మారింది. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకం కావడం వల్లనే ఈనాడు పత్రిక ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ వంటి వాటిని దుర్మార్గమైనవిగా చూపుతోంది. సమాజ్ వాదీ సంగతలా ఉంటే… ఆమ్ ఆద్మీ పార్టీ ని కూడా ఈనాడు బద్నాం చేస్తుండటం గమనార్హం.
దేశంలోని రాజకీయ పార్టీలన్నింటి కన్నా భిన్నం అనిపించుకుంది ఆప్. భారతీయ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా , ఎక్కడా సాధించని విజయాన్ని ఢిల్లీలో సాధించి చూపించింది ఆప్. కేవలం ఢిల్లీలోనే కాదు, పంజాబ్ లో కూడా ఆప్ సత్తా చాటనుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సంచలనం సృష్టించే అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అయితే.. ‘ఈనాడు’లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఇబ్బందుల్లో ఉందని, ఆప్ కుంటుకొంటూ పంజాబ్ ఎన్నికల రేసులో నిలుస్తోందని ఈనాడు చెబుతోంది! మరి పంజాబ్ ఎన్నికల రేసులో ఆప్ ఉత్సాహవంతంగా దూసుకుపోతోందని జాతీయ మీడియా చెబుతోంటే ‘ఈనాడు’ మాత్రం బీజేపీ ప్రయోజనాలను కాపాడటానికి.. ఆప్ ను తక్కువ చేసి చూపుతోంది. అయినా ఈ మీడియా వాళ్ల భ్రమ కానీ.. పంజాబ్ ఎన్నికల విషయంలో ఆప్ పరిస్థితి ఏం బాగోలేదని.. ఏపీలో వ్యతిరేక కథనాలు రాయడం వల్ల ప్రయోజనం ఏముంది?