ఆదివారం అనుబంధం (సండే మ్యాగజైన్)ని ఎత్తేసి అందరినీ ఆశ్చర్యంలో పడేసింది ‘ఈనాడు’. ఇదే బాటలో ఆంధ్రజ్యోతి కూడా నడిచింది. సాక్షి టాబ్లాయిడ్ కి పరిమితమైంది. నిజానికి `ఈనాడు` సండే మ్యాగజైన్ వర్క్ మొత్తం పూర్తయ్యింది. ప్రింటింగ్‌కి వెళ్లేముందు… `ఈసారికి ఆదివారం అనుబంధం ప్రింట్ చేయొద్దు` అని పై నుంచి ఆదేశాలు వచ్చాయట. సండే బుక్ ప్రింటింగ్ అనేది అనేక వ్యయ ప్రయాసలతో కూడుకున్న విషయం. ఆరోజు ఈనాడు సర్క్యులేషన్ దాదాపు 18 లక్షల వరకూ ఉంటుంది. అన్ని లక్షల పుస్తకాలు ప్రింట్ చేయాలి. సండే పుస్తకానికే దాదాపుగా కోటి రూపాయల వరకూ ఖర్చువుతుందని అంచనా. ఈ మేరకు సండే పుస్తకాన్ని ఆపేసి, కోటి రూపాయలు మిగిల్చింది ఈనాడు. సాక్షి తరహానాలు నాలుగు పేజీల టాబ్లాయిడ్గా సండే మ్యాగజైన్‌ని విడుదల చేయాలని భావించినా, ఆ ప్రతిపాదన కూడా చివరి క్షణాల్లో పక్కన పెట్టారని టాక్. ప్రస్తుతం ఈనాడులో సండే డెస్క్ వర్క్ చేయడం లేదు. ఆ డెస్క్‌లో ఉన్నవాళ్లందరినీ కరోనా సెలవులు దొరికాయి. మళ్లీ ఈ సండే పుస్తకాన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలీదు.