పేదలు.. పెత్తందారుల మధ్య యుద్ధం అంటూ.. తాను ఊరికో ప్యాలెస్ కట్టుకుని ప్రజల ముందుకు వస్తున్న జగన్ రెడ్డి నిజస్వరూపాన్ని ప్రముఖ దినత్రిక ఈనాడు ఓ కథనంతో బట్టబయలు చేసింది. నేరుగా పేరు పెట్టి మరీ జగన్ ను ప్రశ్నించింది. అయితే ఇక్కడ జగన్ అని మాత్రమే హెడ్ లైన్ లో పెట్టారు… జగన్ రెడ్డి అని పేరు పెట్టి ఉంటే… సిట్యూయేషన్ మరింత గంభీరంగా ఉండేది.
పేదలను పెత్తందారు జగన్ రెడ్డి ఎలా దోచుకున్నారో ఈ కథనంలో చాలా స్పష్టంగా వివరించారు. పేదల రక్త మాంసాలను కూడా దోపిడీ చేయడం జగన్ రెడ్డికే సాధ్యమవుతుంది. అధికారంలో ఉన్న అన్న క్యాంటీన్లకు పోటీగా రాజన్న క్యాంటీన్లను రెండు, మూడు చోట్ల పెట్టి నమ్మించిన జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే అటు అన్న క్యాంటీన్లు, ఇటు రాజన్న క్యాంటీన్లు మూసేసి పేదల కడుపు కొట్టేశారు. ఇది డైరక్ట్‌గా పేదలపై చేసిన ఎటాక్ … ఇక నాలుగున్నరేళ్ల కాలంలో పేదలు ఎవరూ ఎదగకుండా చేసేందుకు.. పేదల్ని పేదలుగానే ఉంచేందుకు జగన్ రెడ్డి చేసిన కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఈనాడు బయటపెట్టింది.
మద్యం విషయంలో జగన్ రెడ్డి వైఖరిని ఈనాడు చాలా సింంపుల్ గా ప్రజల ముందు ఉంచింది. మద్యం ఆదాయంలో 80 శాతం బడుగు, బలహీన వర్గాల నుంచి పిండుకుంటున్నదే. కాస్త ఆదాయం ఉన్న వారికి.. స్మిగ్లింగ్ సరుకు అందుబాటులో ఉంటోంది. అది వైసీపీ నేతల జేబుల్లోకి పోతోంది. ప్రభుత్వం పిండుకుంటోంది మాత్రం. పేదల రక్తాన్నే. ఇదే విషయాన్ని ఈనాడు సూటిగా ప్రజలకు చెప్పింది.
ఇక ఈ నాలుగున్నరేళ్ల కాలంలో తీసుకున్న పేదల వ్యతిరేక నిర్ణయాలన్నింటినీ వెల్లడించింది. చివరికి ఎప్పుడో నాలుగు దశాబ్దాల కిందట ఇళ్ల పేరుతో తీసుకున్న రుణాలను వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో వసూలు చేయడాన్నీ ప్రశ్నించింది. మొత్తగా పెత్తందారు జగన్ ని .. ఈనాడు ప్రజల ముందు ఉంచింది. జగన్ రెడ్డి తమ పొట్ట ఎలా కొట్టి.. రక్త మాంసాలను ఎలా దోచుకుంటున్నారో పేదలకు అర్థమయ్యేలా చెప్పింది.