తెలుగు పత్రికల్లో ఈనాడుకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ స్థానం రావడానికి ఆ సంస్థ పాటించిన విలువలే కారణం అని అనుకోవచ్చు. అలాంటి విలువల్లో ఒకటి సొంత వార్తలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం. కుటుంబంలో జరిగే ఎలాంటి కార్యక్రమానికైనా అది “వార్త” అయితేనే ఇవ్వాలని లేకపోతే వద్దని నిర్మోహమాటంగా గతంలో చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ రూల్‌ని సవరించుచుకున్నట్లుగా ఉన్నారు. రామోజీరావు మనవరాలు బృహతి వివాహం సందర్భంగా పేజీలకు పేజీలు ఫోటోలు పేపర్లో ముద్రించేశారు.
ఈనాడు ఎండీ కిరణ్ – శైలజల రెండో కుమార్తె బృహతి వివాహం బొల్లినేని కృష్ణయ్య కుటుంబానికి చెందిన దండమూరి అమర్ మోహన్ దాస్ , అనితల కుమారుడు వెంకట్ అక్షయ్‌తో జరిగింది. ఈ పెళ్లిని అత్యంత వైభవంగా నిర్వహించారు. రామోజీరావు తన కుటుంబంలో పెళ్లిళ్లను నిరాడంబరంగా నిర్వహిస్తూ ఉంటారు. కానీ మనవరాళ్ల దగ్గరకు వచ్చే సరికి ఆయన మనసు మార్చుకున్నారు. దేశంలోని ప్రముఖులందర్నీ పిలిచారు. చీఫ్ జస్టిస్ నుంచి తెలంగాణ మంత్రుల వరకూ అందరూ వచ్చారు. తెలంగాణ సీఎం వచ్చారు. ఏపీ సీఎంను పిలిచారో లేదో స్పష్టత లేదు .
ఇలా వచ్చిన ప్రముఖులందరి ఫోటోలకూ పేపర్లో చోటు కల్పించారు. సాధారణంగా ఈనాడులో ఎవరెవరు హాజరయ్యారు అనేది రాయకూడదనే రూల్ ఉంటుంది. ఖచ్చితంగా రాయాల్సిన పరిస్థితి ఉంటే తప్ప.. కానీ ఈనాడులో ఫోటోతో పాటు ఏ రంగానికిచెందిన ప్రముఖులు వచ్చారు అన్నది హోదాలతో సహా రాశారు. అయితే సహజంగానే పాఠకులు.. ప్రేక్షకులకు కూడా ఇలాంటి వాటి పట్ల ఆసక్తి ఉంటుంది కాబట్టి ఎవరికీ అతిశయోక్తి అనిపిచడం లేదు. వివిధ కారణాలతో రామోజీరావుకూ అలాంటి ఇమేజ్ ఉంది.
ఇటీవల ఎడిటర్లను కూడా రెండు ప్రాంతాలకు ఇద్దర్ని నియమించారు. ఈనాడు పత్రిక ఎండీ కుమార్తె కావడంతో ఆ ఇద్దరూ తమ క్రియేటివిటీ చేతనైనంతగా చూపించే ప్రయత్నం చేశారని చెబుతున్నారు.