ఆల్రెడీ హీరోయిన్గా శ్రియను సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఇంకొక యంగ్ హీరోయిన్ను సినిమాకు యాడ్ చేశారు తేజ. విక్టరీ వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో శ్రియ హీరోయిన్గా సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోకి ‘అంతకు ముందు ఆ తరువాత’, ‘అమీ తుమీ’, ‘అ!’ సిన్మాల ఫేమ్ ఈషా రెబ్బాను ఇంపార్టెంట్ క్యారెక్టర్‌కి సెలెక్ట్ చేశార్ట. వెంకీతో పాటు ఈ సిన్మాలో యంగ్ హీరో నారా రోహిత్ వున్నాడు. అతడిది ఇంపార్టెంట్ క్యారెక్టర్. రోహిత్‌కి జోడిగా ఈషాను సెలెక్ట్ చేశారని సమాచారం. ప్రెజెంట్ డిస్కషన్స్ జరుగుతున్నాయ్. ఈ సినిమాకు ‘ఆట నాదే వేట నాదే’ టైటిల్ పరిశీలనలో వుంది. సెంటిమెంట్ ప్రకారం చూస్తే ఈషాకు కలిసొచ్చే అక్షరంతో టైటిల్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు ఈ తెలుగమ్మాయికి పేరు తీసుకొచ్చిన సినిమాలు, హిట్ సినిమాలు ‘అ’తో స్టార్ట్ అయ్యాయ్. వెంకీ సినిమా టైటిల్ కూడా అదే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. రెండు మూడు రోజుల్లో ఈషా సెలెక్ట్ అయ్యిందా? లేదా? అనే అంశం మీద స్పష్టత వస్తుంది.