అతి భీకరంగా దూసుకొస్తున్న తుపాన్ ఫొని సహాయక చర్యలు చేపట్టేందుకు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు ఒడిషాకు.. కేంద్ర ఎన్నికల సంఘం కోడ్ మినహాయింపు ఇచ్చింది. ఒడిషాలో నాలుగు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన చివరి విడత ఎన్నికలు ముగియడం.. అదే సమయంలో.. తుపాను ప్రభావం కనిపించడంతో… ఈసీ.. వెంటనే.. కోడ్ ఎత్తివేత నిర్ణయం తీసుకుంది. 11 తీర ప్రాంత జిల్లాలు పూరీ, కేంద్రపడ, భద్రక్, బాలాసోర్, మయూర్బంజ్, గజపతి, గంజాం, ఖుర్ధా, కటక్, జాజ్‌పూర్ జిల్లాల్లో… ఎలాంటి కోడ్ ఉండదు. పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకి కూడా.. ఒడిషాలో ఎన్నికలు జరిగాయి.
తుపాన్ ఫోని ప్రభావం.. ఆంధ్రప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాలపై కూడా ఉంటుందని వతావరణశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో.. వర్ష బీభత్సం సృష్టించే అవకాశం ఉందని చెబుతున్నారు. తిత్లీ తుపాను దెబ్బకు ఇప్పటికే.. ఉత్తరాంధ్ర ప్రజలు…తీవ్రంగా నష్టపోయారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే.. ప్రజలు మళ్లీ నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంపై ఇప్పటికే.. ఏపీ సీఎం.. ఈసీకి లేఖ రాసినప్పటికీ.. ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. కోడ్ మినహాయింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే.. బెంగాల్ తీర ప్రాంతాలపైనా ఫోని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ.. కోడ్ సడలింపుపై… ఈసీ .. ఎలాంటి అనుకూల నిర్ణయం తీసుకోలేదు. ఒక్క ఒడిషాకు మాత్రమే తుపాను ముప్పు ఉన్నట్లుగా… ఈసీ నిర్ణయం ప్రకటించింది.
నిజానికి ప్రకృతి విపత్తుల సమయంలో.. ప్రత్యేకంగా ఈసీ.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మినహాయింపు ఇవ్వాల్సిన పనిలేదు. ఆ సమయంలో కోడ్ వర్తించదని… చట్టంలోనే ఉంది. ఆ సమయంలో ప్రజాప్రభుత్వాలు ..ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా పని చేయవచ్చని కోడ్‌లో ఉంది. అయితే.. ఈసీ మాత్రం.. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. బీజేపీయేతర పార్టీలు ఉన్న చోట.. కోడ్‌కు.. ప్రత్యేకమైన అధికారాలు జోడించి.. దాదాపుగా కేంద్ర పాలన చేస్తున్నారు. ఏపీలోనూ అదే కనిపిస్తోంది. ఓ వైపు… తుపాను ముంచుకొస్తున్నా.. ప్రజాప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసి.. అధికారులు.. ఏసీ రూముల్లో కూర్చుని.. సమీక్షలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రజల ఎలా పోతే మాకేంటి.. అన్న చందంగా… ఈసీ, ఏపీ అధికారుల తీరు ఉందన్న విమర్శలు వస్తున్నాయి.