అసెంబ్లీ రద్దు అయిన తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. కేంద్రం ఎన్నికల సంఘం.. ప్రకటించింది. అసెంబ్లీ రద్దయిన మరుక్షణం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లేనని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొత్త అసెంబ్లీ ఏర్పడే వరకు కోడ్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్రప్రభుత్వం సహా అసెంబ్లీ రద్దయిన రాష్ట్రాల్లో ఎటువంటి ప్రజాకర్షక పథకాలపై ప్రకటన చేయొద్దని ఈసీ ఓ నోటీసును అన్ని రాష్ట్రాలకు పంపింది. పాలనా నిర్ణయాలు, విధాన నిర్ణయాలు తీసుకోవద్దని.. ఎన్నికల సమయంలో వర్తించే నియమాలన్నీ పాటించాల్సిందేనని ఈసీ నోటీసులో స్పష్టం చేసింది. ఆపద్ధర్మ ప్రభుత్వంలోనూ ఈ నియమావళి వర్తిస్తుందని ప్రత్యేకంగా పేర్కొంది.
ఎన్నికల సంఘం నుంచి ఈ ఆదేశాలు ఒక్క తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే కాక.. అన్ని రాష్ట్రాలకు.. కేంద్ర ప్రభుత్వానికి కూడా అందడం… అందరిని ఆకర్షిస్తోంది. ఇప్పటికిప్పుడు ఈసీ ఇలాంటి ఆదేశాలు ఎందుకు జారీ చేసిందన్నదానిపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ రద్దయినా.. కేంద్ర ప్రభుత్వం రద్దయినా ఒకే నిబంధనలు అమలులో ఉంటాయన్నట్లుగా ఈసీ ఆదేశాలు ఉన్నాయి. మామూలుగా అయితే… ఎన్నికలు జరిగాల్సిన రాష్ట్రాల్లో.. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి… ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమలులోకి వస్తుంది. అయితే అప్పటి వరకూ ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి…. అలాంటి నిబంధన ఉంది. కానీ అసెంబ్లీ రద్దు అయినా.. రద్దు చేసినా . ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వస్తుందని.. ఈసీ తాజా ఉత్తర్వుల ద్వారా స్పష్టమయింది.
తెంలగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో ఆపద్ధర్మ ప్రభుత్వం అనేదే లేదని.. తమ ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొన్ని నైతిక అంశాలు మాత్రమే పరిశీలించాల్సి ఉంటుందున్నారు. దానికి తగ్గట్లుగా… ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందన్న కోణంలో.. పత్రికల్లో వ్యాసాలను కొంత మంది ప్రముఖులతో రాయిస్తున్నారు. ఈ కారణంగా కీలక ప్రజాకర్షక నిర్ణయాలను కేసీఆర్ తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగింది. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే.. ఈసీ తాజా నిర్ణయంతో ఆగిపోయినట్లే అనుకోవచ్చు.