సుప్రీంకోర్టు కన్నెర్ర చేస్తే కానీ.. ఎన్నికల సంఘానికి చురుకు పుట్టలేదు. అసలు దేశంలో ఎన్నికల సంఘం ఒకటి ఉందా.. లేదా అన్నట్లుగా.. పరిస్థితి మారిపోయింది. రాజకీయ పార్టీలన్నీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం ప్రారంభించాయి. మత విద్వేషాలు, సైన్యాన్ని.. రాజకీయాలకు వాడుకోవద్దని.. స్పష్టమైన ఆదేశాలున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో.. ఎన్నికల సంఘం పనితీరుపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నా ఈసీ చర్యలు తీసుకోకపోవడంపై.. మండిపడింది. ఈ విషయంపై దాఖలైన పిటిషన్ విచారణ సమయంలో… ఈసీపై.. సుప్రీంకోర్టు మండిపడింది. ‘‘అసలు మీరేం చేస్తున్నారు. ఎంత మందికి నోటీసులు పంపారు. మీ అధికారాలు ఏంటో మీకు తెలుసా?” అంటూ ఘాటుగా హెచ్చరించడంతో.. వెనక్కి తగ్గక తప్పలేదు.
కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకకపోవడాన్ని ప్రశ్నిస్తే.. ఈసీ మాత్రం..పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు. చర్యలు తీసుకోకపోతే.. సీఈసీని పిలిపించాల్సి వస్తుందని.. హెచ్చరించడంతో… వెంటనే.. ఎన్నికల సంఘం… దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిల ప్రచారంపై ఆంక్షలు విధించింది. యోగి ఆదిత్యనాథ్‌పై 72 గంటలు, మాయావతిపై 48 గంటలు నిషేధం విధించింది. ఆ ప్రకారం యోగి 3 రోజులు, మాయావతి 2 రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలి. నిజానికి అసలు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోంది.. ప్రధానమంత్రి నరేంద్రమోడీనే. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న సమయంలో.. ఆయన మైనార్టీలు..మెజార్టీగా ఉండే ప్రారంతంలో షెల్టర్ వెదుక్కున్నారని ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత కూడా.. సైన్యాన్ని ఆయన వాడుకుంటూనే ఉన్నారు.
కానీ.. మోడీ వ్యాఖ్యలను.. ఈసీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంది. ఇంకా పరిశీలిస్తూనే ఉంది. కొన్ని క్లీన్ చిట్ ఇచ్చేసి ఊరుకుంటోంది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలోనూ.. సైన్యాన్ని మోడీ.. రాజకీయం చేస్తూనే ఉన్నారు. అయినా పట్టించుకోవడం లేదు. సాక్షాత్తూ.. గవర్నర్ గా ఉన్న కల్యాణ్ సింగ్ అనే నేత కూడా బీజేపీకి ప్రచారం చేసినా.. ఇంత వరకూ చర్యలు తీసుకోలేదు. సుప్రీంకోర్టు ఆగ్రహించిందని.. ఒకరిద్దరు నేతలపై మాత్రం.. చర్యలు తీసుకుంటున్నారు.