ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో కీలక ఉత్తర్వులను మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలున్నాయని తక్షణం జోక్యం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అప్ గ్రేడేషన్ పేరుతో ఈ ఆఫీస్ ను ఇనాక్టివ్ చేయవద్దని ఈసీ ఆదేసించింది. అప్ గ్రేడేషన్ వద్దని స్పష్టం చేసింది.
ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రజాతీర్పు ఈవీఎంలలో ఉన్నప్పుడు ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ ఏపీ అధికారుల స్టైలే వేరు. గత ఐదేళ్లుగా రహస్య పాలన జరిగింది. ఏ జీవోల్లో ఏముందో ఎవరికీ తెలియదు. జీవోల వివరాలు వెబ్ సైట్ లో ఉంచేది కాదు. ఆ విషయంలో హైకోర్టు నుంచి ఎన్నో మొట్టికాయలు తిన్నది. అయినా కోర్టులను లెక్క చేసే పరిస్థితి లేదు.
2008లో ప్రారంభం అయిన జీవోఐఆర్ వెబ్సైట్ను జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత పూర్తిగా మూసేశారు. అప్పట్నుంచి ప్రభుత్వ నిర్ణయాల తాలూకు డేటా, ఫైల్స్ అన్నీ ఈ-ఆఫీస్లో ఉంటాయి. ఇప్పుడు దీన్నే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ పేరుతో మూసేయాలని అనుకున్నారు. కానీ చంద్రబాబు ఫిర్యాదు చేయడంతో నిలిపివేశారు.