ముస్లింలు కాంగ్రెస్‌కు అండగా ఉండాలి అన్నందుకు.. సిద్ధూపై మూడు రోజుల పాటు ప్రచారం నుంచి నిషేధం విధించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గంటలే పట్టింది. అంతకు ముందు అజంఖాన్ నుంచి మాయావతి వరకు.. అనేక మందిపై నిషేధం వేశారు. వీరందరూ.. కోడ్ ఉల్లంఘించినట్లు… గంటల్లోనే తేల్చారు. ఇక వీరు మాత్రమే కాదు.. వివాదాస్పదంగా మాట్లాడిన అనేక మందిపై కేసులు కూడా పెట్టారు ఈసీ అధికారులు. ఇవన్నీ… గంటల్లోనే జరిగిపోయాయి. కానీ.. మోడీ, అమిత్ షాలు మాత్రం పదే పదే కోడ్ ఉల్లంఘిస్తున్నా… వారిపై చర్యల కోసం… తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారట.. .ఎన్నికల సంఘం అధికారులు. వారిద్దరికీ కోడ్ వర్తించదా అంటూ.. దేశం మొత్తం ఈసీపై వేలెత్తి చూపిస్తున్న సమయంలో… చాలా రోజుల పాటు మౌనంగా ఉండి.. ఇప్పుడు మాత్రం.. కామ్‌గా ఉండే ప్రశ్నే లేదు. చర్యలు తీసుకుంటాం.. అని మీడియాకు సమాచారం ఇస్తున్నారు. ఎప్పుడు.. అంటే.. త్వరలో అనే సమాధానం రెడీగా పెట్టుకున్నారు.
బాలాకోట్ దాడులు చేసిన వారికే… మీ తొలి ఓటు ఇవ్వండి అని… అమిత్ షా, మోడీ బహిరంగసభల్లో తొలి సారి ఓటర్లను.. కోరుతున్నారు. ఇవే కాదు.. సైన్యం, దాడులు సహా.. కోడ్ పరిధిలోకి వచ్చి.. అసలు ప్రస్తావించకూడని అంశాలను తీసుకు వచ్చి ప్రచారం చేస్తున్నారు మోడీ, షా. వీరి తీరుపై.. ఇతర పార్టీల నేతలందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా ఈసీ స్పందించడం లేదు. వారిద్దరికీ కోడ్ ఉండదన్నట్లుగా ఈసీ కూడా ఉండటంతో… ఆ సంస్థ విశ్వసనీయతకే దెబ్బపడినట్లుగా అయింది. అయితే ఇప్పుడు మాత్రం… ఎన్నికలు ముగిసేవరకూ చూడబోమని.. ఈ లోపే… మోడీ, షాలపై చర్యలు తీసుకుంటామని చెప్పుకొస్తున్నారు. ఓ వైపు .. రోజువారీ పద్దతిలో చర్యలు తీసుకుంటున్నప్పుడు.. మోడీ, షాలకు మాత్రం.. ఎన్నికలు ముగిసేవరకూ.. అన్న ఆలోచన ఈసీకి ఎందుకొచ్చిందో వారే చెప్పాలి.
ఓ వైపు ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో… కోడ్ పేరుతో.. ఈసీ చేస్తున్న రాజకీయం అంతా ఇంతా కాదు. ఓటర్లను ఇక ప్రభావితం చేసే అవకాశం లేకపోయినప్పటికీ.. ఏ మాత్రం.. కోడ్ రిలీఫ్ ఇవ్వకుండా.. ప్రభుత్వ కార్యక్రమాలు జరగకుండా చేస్తున్నారు. ఏపీ లాంటి రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఏకంగా సంబంధం లేని సీఎస్‌ను ట్రాన్స్ఫర్ చేసి ఆ స్థానంలో మరో అధికారిని నియమించారు. ఆయన తానే సీఎం అన్నట్లుగా ఫీలైపోయి.. కేబినెట్ నిర్ణయాలను కూడా ప్రశ్నించే పరిస్థితికి చేరిపోయారు. ఇన్ని జరుగుతున్నా..ఈసీ కామ్‌గా ఉంటోంది.