తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నాలుగు రాష్ట్రాలతో పాటు నిర్వహించేలా.. కేసీఆర్.. అఘమేఘాల మీద అసెంబ్లీని రద్దు చేశారన్న ప్రచారం జరిగింది. ఆయన కూడా..ఆ నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలు వస్తాయని.. షెడ్యూల్ చెప్పుకొచ్చారు. వాటిని ఈసీ ఖండించింది. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్నదానిపై కసరత్తు చేస్తున్నామని చెప్పుకొచ్చింది. నిజానికి ఇప్పుడు.. ఎన్నికల సంఘానికి… ఆ నాలుగు రాష్ట్రాలు ప్రయారిటీ కాదు. ఇప్పటికిప్పుడు కుదిరితే రేపే తెలంగాణ ఎన్నికలు పెట్టాలన్నంత ఉత్సాహం చూపిస్తోంది. ఇలా అసెంబ్లీ రద్దు గెజిట్ రాగానే.. అలా ఈసీ తెలంగాణ అధికారులతో చర్చలు జరిపింది. ఆ తర్వాత నుంచి రోజు రోజుకు శరవేగంగా ఏర్పాట్లు సాగిపోతున్నాయి.
తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి.. రజత్ కుమార్ ఈ విషయంలో మరింత ఉత్సాహంగా ఉన్నారు. అయిన అసెంబ్లీ రద్దు అయిన రోజే .. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామనే నోట్‌ను పంపించారు. అప్పుడే.. ఢిల్లీ ఈసీ కూడా.. ప్రత్యక్ష పరిశీలన కోసం.. ఓ టీమ్‌ను పంపాలని డిసైడయింది. పదకొండో తేదీన వారు వస్తారు. మొత్తం చూస్తారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించవచ్చని… డిక్లేర్ చేస్తారు. అది కామన్. మరి ఓటర్ల లిస్టులు…? అవి కూడా..ముందస్తుగానే ప్రిపేర్ చేయాడనికి ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. దానికి వచ్చే నెల మొదటి వారం వరకు గడువు ఇచ్చి. ఈసీ వేగం చూస్తూంటే.. గతంలో.. కేసీఆర్ మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టిన వ్యవహారం గుర్తుకు వచ్చేలా ఉంది. నోటిఫికేషన్లు, నామినేషన్లు, ప్రచారం, ఓటింగ్, రిజల్ట్ మొత్తం పది రోజుల్లో వచ్చేలా చేసి.. ప్రజాస్వామ్యానికి అర్థం చెప్పారు కేసీఆర్. ఇప్పుడు అదే మోడల్ ఈసీ అడాప్ట్ చేసుకునే ఉందనే సైటెర్లు వినిపిస్తున్నాయి.
అసలు ఈసీ ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల విషయంలో లేనంత తొందర… కావాలని అసెంబ్లీని రద్దు చేసుకున్న తెలంగాణ విషయంలో ఎందుకు..? కేంద్రం నుంచి స్పష్టమైన సూచనలు రావడమే కారణమని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల కంటే ముందే నిర్వహించి.. ఫలితాలు వచ్చేలా చూడాలన్నది ఈసీకి అందిన సూచనట. ఎందుకంటే..ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే.. ఆ తర్వాత పోలింగ్ జరిగే నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ సెంటిమెంట్ దెబ్బతింటందనేది వారి ఆలోచన అట. వారే తమకు పోస్టులు కట్టబెట్టారు కాబట్టి.. ఈసీ అధికారులకు రాజ్యాంగం కన్నా.. కేంద్రం పెద్దలు చెప్పేదే వేదం. అందుకే వారు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.