ఎన్నికలు వాయిదా పడతాయని అనుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంంట్ కేటీఆర్ కు … ఇప్పుడు సమయానికే ఎన్నికలు జరుగుతాయని స్పష్టమైంది. దీంతో ఆయన అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్యను పిలిచి బుజ్జగించారు. కడియంతో చేతులు కలిపేలా చేశారు. అలాకే ఇతర నియోజకవర్గాలకు చెందిన వారిని కూడా పిలిపించి మాట్లాడుతున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని భవిష్యత్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. వేరే ఆప్షన్ లేని నేతంలతా.. ఇలాంటి బుజ్జగింపులు కోరుకుంటున్నారు. వారంతా దారికి వస్తున్నారు.
మరో వైపు ఇతర పార్టీల్లో చాన్స్ దొరుకుతుందని అనుకున్న వారు ముఖ్యంగా కాంగ్రెస్ లో చోటు దొరుకుతుందని అనుకున్న వారు జంప్ అవుతున్నారు. మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేశారు . బీజేపీలో చేరేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అన్నట్లుగా ఉంటున్నారు. ఇలాంటి వారిని బుజ్జగించడం కేటీఆర్కు సులువు అవుతోంది.
మహిళా రిజర్వేషన్ల బిల్లు వల్ల అయినా ఎన్నికలు ఆలస్యమవుతాయని అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అమలు చేయాలంటే రాజ్యాగసవరణ చేయాలి. అలా చేయడానికి కేంద్రం సిద్ధపడలేదు. నియోజకవర్గాల డీలిమిటేషన్ తర్వాత అని ప్రకటించింది. దీంతో ఎన్నికలకు అడ్డంకి లేకుండా పోయింది. ఇప్పటికే ఈసీ తెలంగాణలో పర్యటించింది. వచ్చే నెల మొదటి వారంలో ఐదు రాష్ట్రాలతో పాటు… తెలంగాణకూ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.