దువ్వాడ శ్రీనివాస్ డాక్టరేట్ పనులు, చీర బిజినెస్లో బిజీగా ఉండి మర్చిపోయారో లేకపోతే అన్ని పనలు చేస్తున్నందున డబ్బులు టైట్ గా ఉన్నాయో కానీ తన ఇంటికి కరెంట్ బిల్లు కట్టడం లేదు. చూసి చూసి లైన్ మెన్ వచ్చి కరెంట్ కట్ చేసి పోయారు. టెక్కలిలోని ఆయన ఇంట్లో దీపం వెలగడం ఆగిపోయింది. దీంతో ఆయనకు ఒక్క సారిగా కోపం వచ్చింది. తన ఇంటి దీపం ఆర్పేయడానికి ఎంత ధైర్యం అని లైన్ మెన్ కు ఫోన్ చేసి తిట్టేశారు.
కరెంట్ బిల్లు రూ.56వేల రూపాయలు పెండింగ్ ఉందని రెండు, మడు నెలల నుంచి కట్టడం లేదని..అందుకే ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కనెక్షన్ తొలగించానని ప్రకటించారు. బిల్లు కట్టిన తర్వాత కనెక్షన్ ఇస్తానని చెప్పారు. అయితే దువ్వాడ మాత్రం ఆ కరెంట్ ఏదో తన కంపెనీ నుంచి వస్తున్నట్లుగా బెదిరించారు. టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా..నరకం చూపిస్తా అని డైలాగులు కొట్టారు. దాంతో ఆ ఉద్యోగి పై అధికారులకు సమాచారం ఇచ్చారు.
దువ్వాడ శ్రీనివాస్ .. తాను వైసీపీలో ఉన్నానన్న సంగతిని మర్చిపోతున్నారో లేకపోతే తనను తను డాన్ శీను అనుకుంటున్నారో కానీ..అందర్నీ బెదిరింపులతోనే దారికి తెచ్చుకోవాలనుకుంటారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడుపై బూతులతో విరుచుకుపడేవారు. ఆయన ఊరిపైకి మారణాయుధాలతో దండెత్తేవారు. అధికారులు..నియోజకవర్గాన్ని మొత్తం గుప్పిట్లో పెట్టుకునేవారు. ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నారేమో కానీ.. వివాదాల్లో చిక్కుకుంటున్నారు.