తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనల పాలసీ ప్రకటించింది. అటు కొనుగోలుదారులకు..ఇటు అమ్మకం దారులకు భారీగా రాయితీలు వచ్చేలా పాలసీ ప్రకటించింది. రాబోయే రోజుల్లో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల హవా ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడి మంత్రి కేటీఆర్ దీన్నో సవాల్‌గా తీసుకుని అవకాశాలు అంది పుచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఏపీ కూడా.. ఆ రేస్ లోకి రావాలని నిర్ణయించుకుంది. ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాలకు బూస్ట్ ఇచ్చేలా చర్యలనుప్రకటించింది. ఏపీలో ఎక్కడ చూసినా చార్జింగ్ పాయింట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. వివిద ప్రాంతాల్లో 400 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభఉత్వం నిర్ణయించింది.
జాతీయ రహదారుల్లో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు. అలాగే రూ.250 కోట్లతో టెస్టింగ్ ఫెసిలిటీ సిద్ధం చేయాలని డిసైడయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వివిధ కంపెనీల ఆటోమోబైల్ కంపెనీల యూనిట్లలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి చేపట్టే దిశగా ప్రోత్సహించాలని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కియా పరిశ్రమ తమ ఎలక్ట్రిక్ కార్ల విస్తరణ చేపట్టాలని అనుకుంది. గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వివిధ కారణాలతో ఆ విస్తరణ ఆగిపోయింది. తమిళనాడుకు పోయిందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వం ఇస్తామన్న రాయితీలు ఇవ్వకపోవడం వల్లే.. ఆ పరిశ్రమ వెళ్లిపోయిందని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆ విస్తరణ పెట్టుబడి ఇక్కడే పెట్టేలా ఏపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. హీరో తో పాటు ఇతర సంస్థలు కూడా.. పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బైక్‌ల ఉత్పత్తిని పెంచేలా ప్రభుత్వం చర్చలు జరిగే అవకాశం ఉంది. త్వరలో.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేలా కొన్ని చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. తెలంగాణ కన్నా ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతో ఏపీ అధికారులు ఉన్నారు.