ఆస్కార్ పురస్కారాలలో మన దేశం చరిత్ర సృష్టించింది. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’కి అవార్డు దక్కింది. తమిళ భాషలో రూపొందించిన ఈ లఘు చిత్రం కార్తీక్, గునీత్ తెరకెక్కించారు. 41 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్ ఇది. కార్తీకి గోన్సాల్వేస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఓ ఏనుగు జీవిత చరిత్ర.. ఈ కథ. మూగ జీవాలు, ప్రకృతితో మనుషుల అనుబంధం… వీటి ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ జంట.. ఏనుగుని దత్తత తీసుకొంటారు. అయితే… ఆ ఏనుగుని పోషించలేక ఆపపోపాలు పడతారు. ఇదే స్థూలంగా కథ. ప్రకృతి మనకేమిచ్చింది? మనం తిరిగి ఈ ప్రకృతికి ఏం ఇవ్వాలి? అనే పాయింట్ ని దర్శకుడు ఈ షార్ట్ ఫిల్మ్‌లో చాలా చక్కగా డీల్ చేశారు. అదే.. జ్యూరీకి నచ్చి ఉంటుంది. అందరి దృష్టీ.. ‘నాటు నాటు’పై ఉంటే.. సైలెంట్‌గా ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ అవార్డు కొట్టేయడం విశేషం.