అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచింది డొనాల్డ్ ట్రంపే కానీ..ఆ గెలుపు వెనుక ఉన్నది మాత్రం ఎలాన్ మస్క్. అమెరికా మీడియా మొత్తం డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకం. ఆయనను జోకర్ గా.. డిక్టేటర్ గా భావిస్తూ ప్రచారం చేసినా, ఒక్క మస్క్ మాత్రం తన ట్విట్టర్ ను ట్రంప్ కోసం ఉపయోగించారు. అంతేనా వందల కోట్ల విరాళం ఇచ్చారు. మొత్తం ట్విట్టర్ ను ఆయన కోసం వినియోగించారు. ఊరూవాడా ట్రంప్ కోసం ప్రచారం చేశారు.
ట్రంప్‌నకు మద్దతిచ్చే వారి కోసం రోజుకు మిలియన్ డాలర్లు ఇస్తూ వచ్చారు. డిబేట్లు పెట్టారు. అందుకే ట్రంప్ కూడా తన విజయం వెనుక ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించారన్నారు. తాను నిరాశలో కూరుకుపోయినప్పుడు ఎలాన్ మస్క్ ఎంతో అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. అమెరికా రాజకీయాల్లోకి కొత్త సూపర్ స్టార్ వచ్చారని ఆయనే ఎలాన్ మస్క్ అన్నారు. ట్రంప్ కోసం మస్క్ చేసిన ప్రచారం ఎలా ఉండేదంటే చివరి కి డెమెక్రాట్లు కూడా ఆయన అక్రమంగా అమెరికాలో ఆరోపణలు చేశారు. తాము వస్తే బయటకు పంపేస్తామని హెచ్చరికలు చేశారు.
వీటన్నింటినీ మస్క్ పట్టించుకోలేదు. తన పద్దితిలో తాను ట్రంప్ కోసం పని చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలోనే ట్రంప్ గెలిస్తే ఆయనను కేబినెట్ లోకి తీసుకుంటానని ప్రకటించారు.ఇప్పుడు ఆయన మంత్రి కావొచ్చు.తాను కూడా కేబినెట్ లో చేరుతానని ఆయన చెప్పారు.అయితే ఫక్తు వ్యాపారవేత్త అయిన ఎలాన్ మస్క్.. మంత్రిగా చేరుతారో లేదో తెలియదు కానీ.. స్పేస్ఎక్స్ ద్వారా అంతరిక్షాన్ని అందుకునేందుకు ట్రంప్ నుంచి కావాల్సినంత సాయం పొందగలరు.